Loading...
Evangeline Paul Dhinakaran

మీరు దేవుని పిలుపుకు అర్హులు!

Sis. Evangeline Paul Dhinakaran
28 May
నా ప్రియ స్నేహితులారా, యిర్మీయా 1:5లో ప్రభువు నేడు ఈ సందేశము చదువుచున్న మీతో ఇలా అంటున్నాడు, " గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని" అన్న వచనము ప్రకారము నేడు ఈ సందేశము చదువుచున్న మీరు మీ తల్లి గర్భంలో ఏర్పడకముందే మిమ్మును గుర్తెరిగియున్నాడు అని ప్రభువు చెప్పినప్పుడు అది ఎంత ఆనందాన్ని ఇస్తుంది కదా! ప్రభువు తానే నేడు ఈ సందేశమును చదువుచున్న మిమ్మును సృష్టించాడు. మిమ్మును సృష్టించక మునుపే, ప్రభువునకు మీ గురించి అన్ని తెలుసు. ప్రభువు మిమ్మును ఎలా సృష్టిస్తాడు? "మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్‌క్రియలు చేయుటకై, మనము క్రీస్తుయేసునందు సృష్ఠింపబడినవారమై ఆయన చేసిన పనియైయున్నాము" (ఎఫెసీయులకు 2:10)లో ఉన్నట్లుగా మనము దేవుని చేతిపనివారమై, స్రత్కియలు చేయుటకు క్రీస్తుయేసునందు సృష్టించబడినవారము. కాబట్టి, చింతించకండి.

అవును, ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీ తల్లి గర్భంలో మిమ్మల్ని ఏర్పరచకముందే ప్రభువు మీ కోసం సమస్తమును సిద్ధపరచియున్నాడు. ప్రియమైన స్నేహితులారా, నేడు మీరు మంచి పని చేయుటకు ప్రభువు మీ కొరకు సమస్తమును ముందుగానే సిద్ధపరచియున్నాడు. అందుకే దావీదు కీర్తనలు 139:16లో ఇలా అంటున్నాడు, " నేను పిండమునై యుండగా నీ కన్నులు నన్ను చూచెను నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునుపే నా దినములన్నియు నీ గ్రంథములో లిఖితములాయెను" (ఎఫెసీయులకు 2:10) లో ఉన్నట్లుగా దేవుడు మిమ్మల్ని యేసుక్రీస్తులో మంచి పని చేయడానికి సృష్టించాడు. నేడు మిమ్మును సృష్టించకముందే ప్రభువు మీ కోసం సమస్తమును ఎరిగి యున్నాడు. ఆది నుండి ప్రభువు మీ గురించి ఆలోచిస్తున్నాడు.
కాబట్టి, నేడు ఈ సందేశము చదువుచున్న మీ వ్యక్తిగత స్థితి ప్రభువునకు తెలుసు. మీ బహుమతులు మరియు మీ పిలుపు ఆయనకు తెలుసు. కాబట్టి, ప్రియమైన స్నేహితులారా, ప్రభువు కోసం పని చేయకూడదని మీరు ఎటువంటి సాకు చెప్పలేరు. మీరు మంచి పనులు చేయడానికి దేవునిచే సృష్టించబడ్డారు. కాబట్టి, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు ప్రభువుచే ఉపయోగించబడటానికి అర్హులు. స్నేహితులారా, ఇక నుండి దేవుని కోసం పని చేయడానికి మిమ్మును మీరు దేవుని చేతులకు అప్పగించుకొన్నట్లయితే, మీ గురించి నీకు తెలిసిన దానికంటే ప్రభువు మీకు బాగా తెలుసు. ఈ రోజు, మీ జీవితాన్ని మరియు ఘనతను దేవునిచే ఉపయోగించబడేలా చేయండి ప్రియమైన స్నేహితులారా, నిశ్చయముగా, దేవుడు మిమ్మును ఆశీర్వదిస్తాడు.
Prayer:
మహోన్నతుడవైన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ,

నేటి వాగ్దానానికై నీకు వందనములు. తండ్రి, ఈరోజు మీ ప్రత్యేకమైన అభిషేకం మా మీదికి దిగివచ్చునట్లు చేయుము. ప్రభువా, నీవు మాకు ఇచ్చిన తలాంతులను నీ పని కోసం ఉపయోగించేందుకు మాకు సహాయం చేయుము. దేవా, మా జీవితం మరియు నీవు మాకిచ్చిన తలాంతులను నీ నామానికి ఘనతను తీసుకువచ్చునట్లు చేయుమని యేసు నామంలో మేము ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

For Prayer Help (24x7) - 044 45 999 000