Loading...
Paul Dhinakaran

మీ బహుమానము ఘనమైనదిగా ఉండును!

Dr. Paul Dhinakaran
23 Jun
నా ప్రశస్తమైన స్నేహితులారా, దేవుడు ఈ దినమున మీరు ఉత్సహించే వాగ్దానమును మీకు ఇచ్చుచున్నాడు. "నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగును" (ఆదికాండము 15:1) అని ఆయన చెప్పుచున్నాడు. ఎందుకనగా అబ్రాహాము ప్రతి విషయములోను దేవుని యందు నమ్మిక ఉంచాడు. కావున ఆయన గొప్ప బహుమానమును పొందుకొన్నాడు. అతను తన దీవెనకరమైన పరిస్థితుల మధ్యను మరియు తన కష్ట పరిస్థితుల మధ్యను దేవునియందు విశ్వాసముంచాడు. అబ్రాహాము ఎటువంటి స్వార్ధము లేకుండా, దేవుని నుండి తన కొరకు దేనిని ఆశించకుండా దేవుని చిత్తమును మాత్రమే చేయడానికి ఇష్టపడ్డాడు కనుక "అబ్రాహామా, నేను నీకు కేడెము, నీ కొరకు నేను యుద్ధము చేస్తాను. నేను నీ అత్యధిక బహుమానమును. సర్వశక్తుడగు దేవుడనైన నాలో ఉన్న ప్రతి  శ్రేష్ఠమైన యీవియు మరియు సంపూర్ణమైన బహుమానమును నా బిడ్డయగు నీకు చెందును." అని సర్వశక్తుడగు మన దేవుడు పలికాడు. అవును, నా ప్రియ స్నేహితులారా, ఈ దినం మొదలుకొని దేవుడు మీ బహుమానంగా ఉండబోవుచున్నాడు. ఒక వైపున ఆయన మిమ్మును కాపాడు కేడెము వలే ఉంటాడు. వేరొక ప్రక్కన ఆయన మిమ్మును బలపరుస్తాడు మరియు ఆయన మీ బహుమానంగా ఉందుననే తన చిత్తము నెరవేరేలా చేస్తాడు. సర్వశక్తిమంతుడగు దేవుడు మీతో పాటుగా ఉండుట అనే బహుమానమును మీరు పొందుకొనెదరు. యేసు కలిగియున్న ప్రతి శ్రేష్ఠమైన యీవియు మీరు కలిగియుండెదరు. ఎంతటి గొప్ప ఆశీర్వాదమో కదా!   

మనకు ఎందుకు ఆయన బహుమానము అనుగ్రహిస్తాడో మీకు తెలుసా? మొదటగా "ఆయన ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును" అని రోమా 2:6 చెప్పుచున్నది.  అవును, మనము కొన్ని కార్యాలను చేయాలని ఆయన ఎదురుచూచుచున్నాడు. "తన సేవకులను మనము ప్రేమించాలని ఆయన ఆశిస్తున్నాడు" అని హెబ్రీయులకు 6:10 చెప్పుచున్నది. మనము దేవుని సేవకులను ప్రేమించి వారి పట్ల శ్రద్ధ చూపించిన యెడల మరియు వారి నుండి దేవుని వాక్యమును విధేయతతో పొందుకొనిన యెడల ప్రభువు మనకు బహుమానమును అనుగ్రహిస్తాడు.
రెండవదిగా, మన అత్యంత ఇబ్బందికరసమయములలో కూడా మనము దేవుని ప్రేమించి ఆయనలో మన విశ్వాసముంచినచో, అప్పుడు ఆయన మనకు బహుమానమును అనుగ్రహిస్తాడు. "విశ్వాసములేకుండ దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము" అని హెబ్రీయులకు 11:6 చెప్పుచున్నది. మీ సమస్యలనుండి ప్రభువు మిమ్మును విడిపిస్తాడనే విశ్వాసమును మీరు కలిగియున్నచో, మీ విశ్వాసము ఘనపరచబడును. మీ సమస్యలు అన్నింటినుండి మిమ్మును విడిపించు నిమిత్తము మీ కొరకు యేసు వెల చెల్లించాడని మీరు నమ్మిన యెడల మీరు ఆశీర్వదించబడెదరు. మీ సమస్యలు మరియు కష్టములు అన్నింటి మధ్యలో, యేసును మరణము నుంచి లేవనెత్తిన పరిశుద్ధాత్మ మిమ్మును కూడా మీ సమస్యలనుండి లేవనెత్తునని మీరు విశ్వాసముంచిన యెడల, అప్పుడు మీరు ప్రభువు యొద్ద నుండి మీ బహుమానము పొందుకొనెదరు. ప్రభువు తానే మీ బహుమానముగా ఉండును. 

చివరిగా, లూకా 6:38 ప్రకారం ప్రభువు యొక్క పరిచర్యకు మరియు దాని లక్ష్యములకు మీ యొక్క కానుకలను సమర్పించినచో మీ అవసరతల మధ్యలో కూడా ఆయన బహుమానము మీయొద్దకు వస్తుంది. మీ ఒడిలో దీవెనలు కుమ్మరించుటకు ఆయన ప్రజలను పంపును. ఈ బహుమానములను మరియు యేసులో ఉన్న బహుమానములన్నింటినీ ప్రభువు మీకు అనుగ్రహించునుగాక! ఆయనే మీ బహుమానంగా, అత్యధిక బహుమానంగా మరియు మీ కేడెముగా ఉండునుగాక! దేవుడు మిమ్మును దీవించునుగాక!
Prayer:
ప్రేమామయుడవగు మా పరలోకపు తండ్రీ,

ఈ చక్కని వాగ్దానము కొరకు మీకు వందనములు. ప్రభువా, ఈ దినము మొదలుకొని నా అత్యధికమగు బహుమానంగా ఉండండి. నన్ను ఆశీర్వదించి వర్ధిల్లజేయండి. నన్ను కాపాడండి మరియు నాకు కేడెముగా ఉండండి. మీ మహిమ నిమిత్తము మీయందలి నా విశ్వాసము మిక్కిలి  బలముగా ఎదుగునుగాక!

యేసు నామములో నేను ప్రార్థించుచున్నాను, ఆమెన్!

For Prayer Help (24x7) - 044 45 999 000