Loading...

మీ అపజయాలు ఆశీర్వాదాలుగా మారుతాయి!

Shilpa Dhinakaran
06 Aug
నా ప్రియమైన స్నేహితులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీ అపజయములను దేవుడు ఆశీర్వాదములుగా మారుస్తానని మీకు వాగ్దానము చేయుచున్నాడు. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 89:21 వ వచనమును తీసుకోబడినది. ఆ వచనమేమనగా, ‘‘ నా చెయ్యి యెడతెగక అతనికి తోడైయుండును నా బాహుబలము అతని బలపరచును ’’ అన్న వచనము ప్రకారము మీరు అపజయమును ఎదుర్కొన్నప్పుడు దేవుని బాహుబలము మిమ్మల్ని బలపరస్తుంది. కాబట్టి, ఈరోజు మీ ఓటమిలలో మిమ్మును ఆదుకుంటానని ప్రభువు మీ పట్ల వాగ్దానం చేయుచున్నాడు. కనుకనే, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు ప్రారంభించిన ప్రతి పని ఎందుకు అపజయమును ఎదుర్కొంటుంది అని మీరు బహుశా హృదయంలో కలత చెందియుండవచ్చును లేక నిరుత్సాహముతో ఉండి ఉండ వచ్చును. అది  వ్యాపార వైఫల్యం లేదా విఫలమైన వివాహం లేదా తల్లిదండ్రులు మరియు పిల్లల మధ్య విఫలమైన సంబంధం కావచ్చును. మీరు అన్నిటి యందు నష్టాన్ని అనుభవించి యుండవచ్చును. తద్వారా, మీరు ఇంతకాలం నిస్సహాయంతో, నిరుత్సాహముతోను అపనమ్మకంగా ఉన్నారా? దిగులుపడకండి.
నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీ హృదయమును కలవరపడనీయ్యకండి. ఆయన చెయ్యి మీకు యెడతెగక తోడై యుంటుందని ప్రభువు మీ పట్ల వాగ్దానము చేయుచున్నాడు. అందుకే,  ఫిలిప్పీయులకు 1:4 లో ఉన్న తన వాక్యం ద్వారా ప్రభువు మీతో మాట్లాడుచున్నాడు, ‘‘ మీలో ఈ సత్‌క్రియ నారంభించినవాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను ’’ అన్న వచనము ప్రకారము మీలో మంచి పనిని ప్రారంభించినవాడు దానిని పూర్తి చేస్తాడని మీరు నమ్మండి. అవును, ప్రభువు మీ జీవితంలో ఒక మంచి పనిని ప్రారంభించినట్లయితే, ఆయన మిమ్మల్ని ఎప్పుడూ మధ్యలో నిరాశపరచడు. ఆయన ప్రారంభించిన దానిని పూర్తి చేసేంత వరకు అందులో మీరు అంతము వరకు కొనసాగునట్లు మిమ్మును ముందుకు తీసుకువెళతాడు. ఆ కార్యము  అంతము అయిపోయిందని మీకు అనిపించినప్పటికి, దేవుడు అది ముగిసిపోయినదని ఎప్పుడు తలంచడు. అందుకు బదులుగా, నా స్నేహితులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మిమ్మును తన దక్షిణ హస్తముతో మిమ్మును ఆదుకుంటానని దేవుడు మీ పట్ల వాగ్దానం చేయుచున్నాడు. కాబట్టి, నేడు ఈ సందేశము చదువుచున్న మీ కలలు మరియు హృదయ వాంఛలను విడిచిపెట్టుకోవద్దు! మీ సంబంధాలు లేదా మీ వ్యాపారాన్ని గట్టిగా పట్టుకోండి. ఎందుకంటే, ప్రభువు మీకు సహాయం చేస్తానని వాగ్దానం చేశాడు. కాబట్టి, మీ జీవితాలను ఆయన హస్తాలకు సమర్పించినట్లయితే, ఆయన మీకు సహాయము చేసి, మిమ్మును ఆదుకుంటాడు. అంతమాత్రమే కాదు, ఆయన తన బాహుబలముతో మిమ్మును బలపరచును. మీరు కోల్పోయిన దానిని మీకు రెండంతలుగా అనుగ్రహించి మిమ్మును దీవించును గాక.
Prayer:
మహోన్నతుడవైన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ,
 
నిన్ను స్తుతించుటకు నీవు మాకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి, నీకు వందనాలు. ప్రభువైన యేసు, ఈ రోజు మేము హృదయ వేదనతో నీ సన్నిధి ముందుకు వస్తున్నాము. ప్రభువా, మా జీవితంలో అన్నీ అపజయములనే ఎదుర్కొంటున్నాము. మా జీవితంలో ఏదీ వర్ధిల్లుతున్నట్లు లేదా క్రమంగా కొనసాగుతున్నట్లు మాకు కనిపించడములేదు. కానీ, ప్రభువా మేము నీవిచ్చిన వాగ్దానాన్ని నమ్ముచున్నాము మరియు మా జీవితంలో నీ యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలని ప్రార్థిస్తున్నాము. దేవా, మేము చేయునదంతయు యేసు నామంలో వర్ధిల్లునట్లు చేయుము. ప్రభువా, మా కుటుంబ జీవితం మరల పునరుద్ధరించబడునట్లుగాను మరియు మా ఇంట్లో శాంతిసమాధానము నెలకొనునట్లు చేయుము. ప్రభువా, మాలో ఒక మంచి పనిని ప్రారంభించిన నీవు దానిని సంపూర్తి చేస్తావని మేము నమ్ముచున్నాము.  దేవా, బాహుబలము చేత మమ్మును ఆదరిస్తావనియు మరియు మాకు సహాయం చేస్తావనియు మేము నమ్ముచున్నాము. దేవా, నీవు మమ్మును ఎన్నటికిని చేయి  విడిచిపెట్టవనియు, ఎడబాయవనియు మేము విశ్వసించుచున్నాము. ప్రభువా, ఓటమిని ఎదుర్కొంటున్న మమ్మును నీ సన్నిధితో నింపి, బలపరచమని సమస్త స్తుతి ఘనత మహిమ నీకే చెల్లించుచు యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

For Prayer Help (24x7) - 044 45 999 000