Loading...
Evangeline Paul Dhinakaran

మీ కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము!

Sis. Evangeline Paul Dhinakaran
05 May
నా ప్రియ మిత్రులారా, ఈ రోజు మీ పిల్లలను దేవుడు ప్రత్యేకంగా ఆశీర్వదిస్తానని ప్రభువు వాగ్దానం చేయుచున్నాడు. అందుకే బైబిలేమంటుందో చూడండి, " నీ పిల్లలందరు యెహోవాచేత ఉపదేశము నొందుదురు నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును '' (యెషయా గ్రంథము 54:13) అన్న వచనము ప్రకారము నేడు ఈ సందేశము చదువుచున్న మీ పిల్లలు దేవుని చేత ఉపదేశము నొందుదురు. ఈ రోజు మీరు, మీ పిల్లలు ఆశీర్వదించబడాలని ప్రార్థిస్తున్నారు మరియు మీ పిల్లలు ప్రభువు ఇచ్చిన బహుమానము అని ప్రభువు మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. అందుకే బైబిలేమంటుందో చూడండి, " కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన యిచ్చు బహుమానమే '' (కీర్తనల గ్రంథము 127:3) అన్న వచనము ప్రకారము కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము అని తెలియజేయబడియున్నది. అవును, పిల్లలు ప్రభువు అనుగ్రహించు బహుమానం. వారు ఈలోకములో ప్రత్యేకమైన మరియు శ్రేష్టమైనవారు. ఒకసారి మేము మా పిల్లల కోసం ఉపవాసం ఉంటూ, ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రభువు మాతో ఇలా అన్నాడు, " మీ పిల్లలు మీ వారు కాదు, వారు నా పిల్లలు. వారి నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో వారిని కప్పియున్నాను. మీ పిల్లలలో ప్రతి ఒక్కరూ పరిచర్య చేస్తారు మరియు వారు సత్యం కోసం నిలబడతారు. ''

నా ప్రియమైన వారలారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు కూడా మీ పిల్లల కోసం ఉపవాసంతో ప్రార్థిస్తూ ఉండవచ్చును. కాబట్టి, ఈ రోజు ప్రభువు మీ ప్రార్థనలకు సమాధానం అనుగ్రహిస్తాడు మరియు ఆయన మీ పిల్లలను ఆశీర్వదిస్తాడు. బైబిల్‌లో, యాకోబు 5:16 వ వచనములో చెప్పబడినట్లుగా, " నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలము గలదై యుండును '' అన్న వచనము ప్రకారము మీ ప్రార్థనలకు దేవుడు జవాబును అనుగ్రహిస్తాడు. ప్రభువైన పరిశుద్ధాత్మ దేవుడు మీ పిల్లలకు ఉపదేశమును నేర్పుతాడు. బైబిల్‌లో యెషయా గ్రంథము 54 వ వచనములో చెప్పబడినట్లుగా, యెహోవా మీ పిల్లలను ఆశీర్వదిస్తాడు. ప్రభువు ఈ సందేశము చదువుచున్న మీ పిల్లలకు చక్కగా బోధించే నాలుకను అనుగ్రహిస్తాడు. అలసిపోయినవారిని నిలబెట్టడానికి ప్రభువు వారికి వాక్యాన్ని బోధిస్తాడు. ప్రభువు ప్రతిరోజూ ఉదయాన్నే మీ పిల్లలను మేల్కొలిపి మరియు బోధించినది వినునట్లుగా ప్రభువు వారి చెవులను మారుస్తాడు.
నా ప్రియులారా, ఈ రోజు కూడా, ప్రభువు ఈ సందేశము చదువుచున్న మీ పిల్లలను పరిశుద్ధాత్మతో నింపాలని ప్రార్థించండి. ఆలాగుననే, వారు పరిశుద్ధాత్మతో నింపినప్పుడు, ప్రభువు తానే వారికి ఉపదేశించి, వారికి శాంతిని అనుగ్రహిస్తాడు. అందుకే బైబిలు ఇలా చెబుతోంది, " మా కుమారులు తమ యౌవన కాలమందు ఎదిగిన మొక్కలవలె ఉన్నారు మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూలకంబములవలె ఉన్నారు '' (కీర్తనల గ్రంథము 144:12) అన్న వచనము ప్రకారము అవును, దేవుడు మీ కుమారులు, కుమార్తెలను మీ కుటుంబానికి మహిమకరముగా ఉండునట్లుగా చేస్తాడు. వారు మీ ఇంటిని చక్కగా తీర్చిదిద్దుతారు. అది పోరాటాల ద్వారా కప్పబడదు,దానికి బదులుగా శాంతితో నింపబడుతుంది. మీ చుట్టు ఉన్న పోరాటల మధ్యలో కూడ మిమ్మల్ని శాంతితో నింపుతాడు. ఆయన నేడు ఈ సందేశము చదువుచున్న మీకు మరియు మీ జీవిత భాగస్వామికి వారు ఆరోగ్యాన్ని తీసుకొనివస్తారు. వారు అందంగా ఉంటారు మరియు ప్రేమలో కుటుంబాన్ని స్థాపించడానికి మీ కుటుంబానికి వారు పునాది అవుతారు. అవును, దేవుడు ఈ రోజు వాగ్దానం చేసినట్లే మీ పిల్లలను కూడా చేయబోతున్నాడు. కాబట్టి, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు కూడ మీ పిల్లలను మరియు మిమ్మల్ని దేవుని చేతులకు సమర్పించుకొన్నట్లయితే, నిశ్చయముగా, మీ పిల్లలందరు యెహోవాచేత ఉపదేశము నొందుదురు మీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగునట్లు చేసి మీ పిల్లల ద్వారా మీకు ఘనత వచ్చునట్లు చేసి మిమ్మల్ని మరియు మీ పిల్లలను ఉన్నత స్థానమునకు హెచ్చిస్తాడు.
Prayer:
సర్వకృపలకు ఆధారభూతుడవైన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ,

నీవు మాకిచ్చిన మా ప్రియమైన పిల్లలను ఆశీర్వదించుము. దేవా, పరిశుద్ధాత్మ వారి మీదికి దిగివచ్చునట్లు సహాయము చేయుము. ప్రభువా, ప్రతి ఉదయం వారిని మేల్కొల్పుము మరియు నీ వాక్యమును వారికి నేర్పుము. దేవా, మా కుమారులు తమ యౌవన కాలమందు ఎదిగిన మొక్కలవలె ఉండునట్లుగాను మరియు మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూలకంబములవలె ఉండునట్లుగా చేయుము. దేవా, మా పిల్లలకు మంచి భవిష్యత్తును అనుగ్రహించి వారిని పిల్లలను ఆశీర్వదించుము. దేవా, మా పిల్లలు నీ ద్వారా ఉపదేశము పొందునట్లుగా సహాయము చేయుము. మా కుమార్తెలు కుమారులు నీ కృప ద్వారా ఆవరించియుండునట్లుగాను మరియు నీ బిడ్డలుగా మారుటకు అటువంటి గొప్ప ధన్యతను దయచేయుమని సమస్త స్తుతి ఘనత మహిమ నీకే చెల్లించుచు యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

For Prayer Help (24x7) - 044 45 999 000