Loading...
Evangeline Paul Dhinakaran

మృతులను సహితము సజీవులనుగా లేపే దేవుడు!

Sis. Evangeline Paul Dhinakaran
15 Jun
నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీకు దేవుడుగా ఉండాలని ఆయన మీ పట్ల కోరుచున్నాడు. అయితే, మీకు దేవునితో సంబంధం ఉన్నదా? ఆయనను 'నా' దేవుడు అని మీరు చెప్పగలరా? మీరు ఆయనను మీ దేవునిగా కలిగి ఉన్నారా? లూకా 20:37 లో బైబిలు ఇలా చెబుతోంది, " పొదను గురించిన భాగములో ప్రభువు అబ్రాహాము దేవుడనియు ఇస్సాకు దేవుడనియు యాకోబు దేవుడనియు చెప్పుచు, మృతులు లేతురని మోషే సూచించెను; '' దేవుడు తన బిడ్డలకు చెందిన పేరుతో పిలువబడ్డాడు. ఆయన అబ్రాహాము, ఇస్సాకు మరియు యాకోబుల దేవుడు అని పిలువబడటం మనకు ఎంతో గర్వంగా ఉన్నది. వారు ఆయనను తమ దేవుడిగా ఎన్నుకున్నందున, ఆయన వారి పేర్లను ఘనపరిచాడు. అబ్రాహామునకు ఇచ్చిన వాగ్దానంలో, " నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు '' (ఆదికాండము 12:2) అన్న వచనము ప్రకారము వారు దేవునికి చెందినంత వరకు దేవుడు వారికి స్వంతమై యుంటాడు. తత్ఫలితంగా, భూమి ఉన్నప్పుడే దేవుడు వారికి సుదీర్ఘ జీవితాన్ని ఆశీర్వదించాడు మరియు వారి జీవితాలను నిత్యజీవంగా మార్చాడు. కారణము, " ఆయన సజీవులకే దేవుడు. కాని మృతులకు దేవుడు కాడు; ఆయన దృష్టికి అందరును జీవించుచున్నారని వారికి ఉత్తరమిచ్చెను '' ( లూకా 20:38) అన్న వచనము ప్రకారము సజీవులకే దేవుడనియు ఆయన మిమ్మల్ని కూడ జీవింపజేస్తాడని ఈ రోజు వాగ్దానము చేయుచున్నాడు.
 
ఒకప్పుడు పూర్తిగా నిరాశకు గురైన ఒక వ్యక్తి ఉండెను. అతను తెరచి యుంచిన కిటికీలో నుండి రోడ్డు పక్కన కారులో నిలబడి ఉన్న వ్యక్తితో మాట్లాడుచుండెను. అదేమనగా, అతని భార్య అతన్ని విడిచిపెట్టినదియు, అతనికి ఉద్యోగం లేదు. ప్రతి రోజు అతనికి ఒక భారముగా ఉన్నదనియు, ఇంకా పరిస్థితులు ఎంతో దుర్భరముగా ఉన్నవనియు, అతను ప్రపంచానికే ఒక భారము అనియు చెప్పుచు, అతని మాటలలో, అతను పూర్తిగా పనికిరానివాడని చెప్పెను. అప్పుడు కారులో ఉన్న వ్యక్తి నిరీక్షణ కలిగించే కొన్ని మాటలతో అతనిని ఉత్సాహపర్చడానికి ప్రయత్నించాడు, కాని అతను చెప్పిన మాటల ద్వారా ఎంతో స్థిరముగా ఉన్నాడు. అతడు, నమ్మకాన్ని కలిగించే మంచి భవిష్యత్తును గురించిన ఆలోచనలతో మరియు ముందుకు సాగిపోవాలన్న తలంపులతో తాను మలుపు తిరిగి, తాను ఉత్సాహాముతో వెళ్ళుటకు ప్రయత్నించాడు. అకస్మాత్తుగా నిరుత్సాహపడిన ఆ వ్యక్తి ' ఆపు' అని బిగ్గరగా కేక వేసెను. ఆ కారులో ఉన్న వ్యక్తి ఎంతో వేగంగా దూసుకొని పోయే కార్ బ్రేక్ వేసినందున అతడు ప్రమాదము నుండి తప్పించబడ్డాడు. కారులో సంరక్షింపబడిన ఆ వ్యక్తి అతనితో ఇలా అన్నాడు: నీవు బయటికి రాకపోతే, నేను చనిపోయేవాడను, కొన్ని క్షణముల క్రితం నీవు ప్రయోజనం లేకుండా పనికిరానివాడనని భావించావు. ఇప్పుడు నీవు నా ప్రాణాన్ని రక్షించావు! కాబట్టి,ఈ క్షణం నుండి నేను చేయు మంచి క్రియలన్నియు దానికి ఫలితం నీ యొక్క లెక్కలో జమచేయబడుతుంది. అప్పుడు ఎన్నో నెలలు నిరాశ అతని విడిచి వెళ్లునట్లుగా అతని ముఖం ఎంతో ప్రకాశించినది. ఆలాగుననే, ఒక ఉదయము వచ్చినప్పుడు, చీకటి రాత్రులు గతించిపోవును. తరువాతి క్షణం ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు. కానీ, మన దేవుడు సజీవుడని మనము గుర్తెరిగినప్పుడు మన జీవితములో మంచి మార్పు కోసం నమ్మకముతో ఎదురు చూడగలము.
నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు సజీవంగా జీవించునట్లుగా, ఆయన మీ అనారోగ్యాలను, బలహీనతలను స్వస్థపరుస్తాడు. ఒకవేళ, నేడు ఈ సందేశము చదువుచున్న మీ జీవితం అంతమునకు వచ్చినట్లుగా మీరు భావించినట్లయితే, " అయితే మీరు నన్ను చూతురు. నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు '' (యోహాను 14:19) అన్న వచనము ప్రకారము నేడు ఆయన జీవించుచున్నట్లుగా మీరు కూడ సజీవంగా జీవిస్తారు. యేసుక్రీస్తు సిలువ వేయబడి మరణం గుండా వెళ్లి, సమాధి చేయబడ్డాడు. అయితే, ఆయన తిరిగి సజీవంగా లేచాడు. మీ జీవితాన్ని తలక్రిందులుగా చేయగల అధికారం ఆయన చేతిలో ఉన్నది. కాబట్టి, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు, ఆయన మీతో మాట్లాడతాడు, మీతో నడుస్తాడు మరియు మీ ప్రస్తుత పరిస్థితులను మార్చే లాభదాయకమైన విషయాలను మీకు బోధిస్తాడు. నేడు మీ అనారోగ్య పరిస్థితులను బట్టి, డాక్టర్ల చేత చేయి విడువబడి, మీరు జీవితముపై నమ్మకాన్ని కోల్పోయి ఉండవచ్చును. కానీ, మనకు దేవునిపై ఉన్న నిరీక్షణ ఏమనగా, ఆయన ఈ లోకములో సజీవంగా జీవించుచున్నాడనునదియే. కాబట్టి ఈ రోజు ఈ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకొన్నట్లయితే, ఈ లోకములో సుదీర్ఘమైన మరియు ఆశీర్వాదకరమైన జీవితాన్ని పొందుకొనగలరు. అబ్రాహాము, ఇస్సాకు మరియు యాకోబు దేవుడు, మీ దేవుడు అని పిలువబడుచున్నాడు. కాబట్టి, అంతటి గొప్ప దేవుని కలిగియున్న మీరు కూడ మీ భవిష్యత్తు పట్ల నిరుత్సాహము కలిగియున్నట్లయితే, మీ జీవితాలను దేవుని చేతులకు సమర్పించుకొన్నట్లయితే, మృతులను సహితము సజీవంగా లేపు దేవుడు, మీ జీవితములో మృతమైన దానిని సజీవంగా లేపి, మీరు దీర్ఘాయుష్షుతో ఈ లోకములో జీవించునట్లుగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు.
Prayer:
మృతులను సహితము లేపిన మా పరలోకమందున్న తండ్రీ,

దేవా, నేడు మృతమైన మా జీవితాన్ని నీ చేతులకు సమర్పించుకొను చున్నాము. నేడు నీవు జీవించుచున్నట్లుగా, మమ్మల్ని కూడ నీవు జీవింపజేయుమని కోరుచున్నాము. దేవా, మా వ్యాధులను ముట్టి మమ్మల్ని స్వస్థపరచుము. నీవు మమ్మల్ని జీవింపజేయుటకై నీవు సిలువలో మరణించినందుకై నీకు వందనములు చెల్లించుచున్నాము. మేము జీవించడానికి కారణం నీవు మాకు సుదీర్ఘ జీవితాన్ని ఇచ్చినందుకై నీకు వందనములు చెల్లించుచున్నాము. అనారోగ్యంతో ఉన్న మా ప్రియులైన వారిని స్వస్థపరచి, వారికి దీర్ఘాయువును కలుగజేయుము. మా జీవితములో నిన్ను సొంతము చేసుకొనుటకు మాకు సహాయము చేయుము. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు దేవుడవైన నీవు మా జీవితములో గొప్ప అద్భుతములు జరిగించుము. మా పితురుడైన అబ్రాహామును ఆశీర్వదించినట్లుగా, నీవు మమ్మల్ని గొప్ప జనముగా చేసి, మా పేరును ఘనపరచి, మమ్మల్ని ఉన్నత స్థానమునకు హెచ్చించుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

For Prayer Help (24x7) - 044 45 999 000