Loading...
Samuel Paul Dhinakaran

ఏ మేలు కొదువయై యుండదు.

Samuel Dhinakaran
20 Jan
హలో నా ప్రియ స్నేహితులారా, నేటి వాగ్దానంగా బైబిల్ నుండి కీర్తనలు 34:10వ వచనము ఎన్నుకొనబడినది. ఈ వచనం ఏమి చెబుతుందో చూడండి, " సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును యెహోవాను ఆశ్రయించువారికి ఏ మేలు కొదువయై యుండదు '' అన్న వచనము ప్రకారము యెహోవాను ఆశ్రయించువారికి ఏ మేలు కొదువై యుండదు అని చెప్పబడియున్నది. అవును, దేవుడు మీకు ఇచ్చే గొప్ప మేలులకు ఎటువంటి కొరత ఉండదు. దేవుడు అనుగ్రహించు మేలులు చూచినట్లయితే, కరువు మరియు ఎక్కువ కొరతగా ఉన్న పరిస్థితుల నుండి బయటపడుతుంది. వారి మధ్యలో, దేవుడు తన మహిమను మీరు చూసేలా చేయబోతున్నాడు. మీ కొరత నుండి ఎన్నో గొప్ప మేలులు మీ నుండి బయలు వెళ్లునట్లు మీరు చూడబోతున్నారు.

నా ప్రియులారా, బహుశా! నేడు ఈ సందేశము చదువుచున్న మీ చుట్టూ ఉన్న వ్యక్తులు తమ గొప్ప బలంను గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉండవచ్చును. వారి యొక్క ఉన్నత జ్ఞానం మరియు తలాంతులు లేదా నైపుణ్యం గురించి చెప్పుకుంటారు. అయినప్పటికి ఎన్నో కష్టాలు మరియు కొరత సమయంలో, వారి గొప్పతనమంతా పడిపోతుంది. అయితే, నేడు ఈ సందేశము చదువుచున్న మీ జీవితంలో దేవుడు తన గొప్పతనాన్ని చూపించడానికి ఆయన మిమ్మల్ని ఉపయోగించే క్షణం అది. కాబట్టి, నేడు మీరు ఓపికగా ఉన్నారు స్నేహితులారా, మీరు మీ చుట్టూ, చూసే ఈ కొరత మధ్య, ప్రభువు నుండి వచ్చే మేలులను మీరు చూస్తారు. అన్ని కష్టాల మధ్య, మీ జీవితంలోనికి ఒక మంచి విషయం రావడాన్ని మీరు చూస్తారు. కాబట్టి, మీ దగ్గర ఉన్న కొద్దిపాటిని ప్రభువు యొద్దకు తీసుకురండి.
నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు దేవునికి అర్పించగలిగినది ఆయన యొద్దకు తీసుకొని రండి. బైబిల్‌లోని ఒక చిన్న పిల్లవాడు ఇలాగున చేశాడు. యేసు తన సందేశాన్ని ఆనందిస్తున్న వేలాది మందితో మాట్లాడడం చాలించిన తరువాత, వారందరు ఆకలితో ఉన్నారని ఆయన యెరిగి యేసుప్రభువు వారికి ఆహారం ఇవ్వాలనుకున్నాడు. కానీ, ఆహారం లేదు. ఆ వేలాది మంది గొప్ప సమూహములో ఒక చిన్న పిల్లవాడు తన వద్ద ఉన్న ఐదు రొట్టెలు మరియు రెండు చేపలు యేసు యొద్దకు తీసుకొని వచ్చి ఇచ్చాడు. యేసు దానిని సమృద్ధిగా ఆశీర్వదించాడు మరియు అది విస్తరించునట్లు చేశాడు. చిన్నది వేలకు విస్తరించునట్లు చేసిన దేవునికి కృతజ్ఞతలు తెలియజేయండి. ఎందుకంటే, దేవుడు మీ కోసం చేయబోతున్నది కూడ ఇదియే. మీరు తీసుకొని వచ్చిన చిన్న దానిని ఆయన ఆశీర్వదించి, దానిని వేలాదిమందికి ఆశీర్వదించి విస్తరింపజేయబోతున్నాడు. మరియు అది మీ చుట్టూ ఉన్న వారికి ఆశీర్వదంగా ఉంటుంది. ఇంతకు ముందు తమ శక్తిని గురించి చెప్పుకున్నవారు కూడ దేవుడు మీ ద్వారా ఏమి చేస్తున్నాడో అని భయపడతారు. వారు మీ ద్వారా దేవుని బలాన్ని తెలుసుకోబోతున్నారు. ఈ మంచి కార్యానికి సిద్ధంగా ఉండు స్నేహితులారా, ఇది మీరు ప్రకాశించే సమయం.
Prayer:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ,

నేటి వాగ్దానంకై నీకు వందనాలు. తండ్రీ, మా దగ్గర ఉన్న కొంచెం నీ యొద్దకు తీసుకొని వస్తున్నాము. యేసు ఐదు రొట్టెలు మరియు రెండు చేపలను ఆశీర్వదించి, విస్తరింపజేసినట్లుగానే, మాలో ఉన్న కొద్ది విశ్వాసాన్ని, సదుపాయాన్ని, తలాంతులను మరియు ఆర్థికాన్ని ఆశీర్వదించి, వాటిని అత్యధికంగా చేయుము. ప్రభువా, మా పరిస్థితి లోపించిన నీ దీవెనల ద్వారా నీ నామము కీర్తింపబడునట్లు చేయుము. ప్రభువా, నీ యందు భయభక్తులు కలిగియున్న వారికి ఏ మేలు కొదువై ఉండదని చెప్పినట్లుగానే, మా జీవితములో ఆ వాగ్దానాన్ని నెరవేర్చుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

For Prayer Help (24x7) - 044 45 999 000