Loading...
Stella ramola

మీరు రక్షించబడతారు!

Sis. Stella Dhinakaran
30 May
నా ప్రియమైన స్నేహితులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో నేను మీకు శుభాభివందనములు తెలియజేయుచున్నాను. ఈ రోజు దేవుడు యెషయా 59:1లో ఉన్న వాక్యం నుండి మీతో మాట్లాడుచున్నాడు. ఆ వచనము, " రక్షింపనేరక యుండునట్లు యెహోవా హస్తము కురుచకాలేదు విననేరక యుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు'' అన్న వచనము ప్రకారము దేవుడు, తన బాహువు రక్షించడానికి నిశ్చయంగా కురచకాలేదని వాగ్దానము చేయుచున్నాడు. దావీదు రాజునకు ఈ అనుభవం ఎదురైంది. అతడు కీర్తనలు 27:1 లో ఇలా వ్రాశాడు, " యెహోవా నాకు వెలుగును రక్షణయునై యున్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును?'' అని ధైర్యంగా చెప్పగలిగాడు.

దావీదు యౌవ్వనంలో, దేవుడు అతని హృదయాన్ని తాకి, అతనికి ఈ అనుభవాన్ని ఇచ్చాడు. మీరు నిర్గమకాండము 15:2 చదివినట్లయితే, " యెహోవాయే నా బలము నా గానము ఆయన నాకు రక్షణయు ఆయెను. ఆయన నా దేవుడు ఆయనను వర్ణించెదను ఆయన నా పితరుల దేవుడు ఆయన మహిమ నుతించెదను.'' అవును, మోషే మరియు ఇశ్రాయేలీయులందరూ దేవునిని స్తుతించారు. ఎందుకంటే, దేవుడు వారి జీవితాలలో అద్భుతాలు చేశాడు కనుకనే. వారు ఎర్ర సముద్రం దాటవలసి వచ్చినప్పుడు, మోషే తన చేతిని చాచాడు మరియు దేవుడు వారి కోసం సముద్రాన్ని రెండు పాయలుగా చేశాడు.
తద్వారా, ఇశ్రాయేలీయులు ఆరిన నేల గుండా నడిచారు. కానీ, ఆయన ఐగుప్తీయుల కొరకు అలాగున చేయలేదు. ఇశ్రాయేలీయులు దేవుని స్తుతిస్తూ సముద్రంలో మునిగిపోయారు. దేవుడు వారికి ఒక అద్భుతం చేశాడు. అవును, నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీకు కూడా ఒక అద్భుతం జరగాలని కోరుకొనుచుండవచ్చును. కాబట్టి, ప్రభువునకు మొరపెట్టండి మరియు ఆయన మీ కోసం గొప్ప అద్భుత కార్యాలు జరిగించడం మీరు చూచెదరు. యేసు రక్షించే బాహువు మీ కష్టాల నుండి మిమ్మును విడిపిస్తుంది. మీరు యాకోబు 5:15 చదివినట్లయితే, " విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతని లేపును; అతడు పాపములు చేసినవాడైతే పాపక్షమాపణ నొందును.'' అయినా దేవుడు నేడు ఈ సందేశము చదువుచున్న మిమ్మును రక్షిస్తాడు. మీరు ఏ వ్యాధితో బాధపడుచున్నా సరే, మీరు వెంటనే స్వస్థతను పొందుతారు. మీరు కూడా మీ పాపాలన్నిటిని నుండి రక్షింపబడతారు. నేడే రక్షణ దినం. కాబట్టి, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు ప్రభువు వైపు చూడండి, ఆయనకు మీ హృదయాన్ని సమర్పించి, ఆయనను మీ పూర్ణ హృదయముతో దావీదువలె స్తుతించినట్లయితే, ఈ రోజు మీరు మీ జీవితములో, ఆయన ఇచ్చు రక్షణను చూచెదరు. అదియుగాక, మీ పట్ల గొప్ప కార్యములను అద్భుతాలుగా జరుగుట మీరు చూచెదరు. దేవుడు మిమ్మును దీవించును గాక.
Prayer:
రక్షణకు కర్తవైన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ,

నిన్ను ఘనపరచుటకు నీవు మాకిచ్చిన వాగ్దానమునకై నీకు వందనములు చెల్లించుచున్నాము. ఈ రోజు నీవు మాకిచ్చిన గొప్ప వాగ్దానమునకై నీకు వందనాలు చెల్లించుచున్నాము. దేవా, నేడు మా పరిస్థితి అంతయు నీవు బాగుగా యెరిగి యున్నావు. ప్రభువా, మా ప్రార్థనలు విశ్వాస సహితమైన ప్రార్థనలుగా ఉండునట్లుగాను, మా రోగములను స్వస్థపరచుటకును, దేవా, మా పడక నుండి పైకి లేపునట్లుగాను మరియు మా పాపములకు పాపక్షమాపణ కలుగునట్లుగా సహాయము చేయుము. దేవా, మమ్మల్ని మరియు మా కుటుంబాన్ని రక్షింపకుండుటకు కురచకాకుండా చేయుము. కాబట్టి, నేడు నీ బాహువు నుండి ఒక అద్భుతాన్ని మేము చూసేలా మమ్మును అనుమతించుము. దేవా, మా ప్రియులైన వారిని మరియు మమ్మును నీ రక్షణ బాహువును చాచి, ఇప్పుడే రక్షించునట్లుగా చేయుము. ఇంకను మా జీవితమంతా నిన్ను మహిమపరుచునట్లు మరియు నీ నామము స్తుతింపబడునట్లు చేయుమని యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

For Prayer Help (24x7) - 044 45 999 000