Loading...
Samuel Paul Dhinakaran

మీ ఒంటరితనమును తొలగించే దేవుడు!

Samuel Dhinakaran
23 May
నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు ఒంటరిగా ఉన్నను, దేవుడు సంసారులనుగా చేస్తానని మీ పట్ల వాగ్దానము చేయుచున్నాడు. కాబట్టి, ఒంటరిగా ఉన్నారని చింతించకండి. ఒంటరితనం అంటే మనం ఒంటరిగా ఉన్నామని కాదు. మనము ప్రజలతో కలిసి యుండవచ్చును. కానీ, లోపల ఒంటరిగా ఉన్నామన్న తలంపులో మనలో ఉండియుండవచ్చును. ఒంటరితనం మనల్ని ప్రేమించకుండా మరియు వదిలివేస్తుంది. ఇది మన హృదయాలను బ్రద్ధలు చేస్తుంది. ఇది మనము ఇతర వ్యక్తులకు మరియు పరిస్థితులకు ప్రతిస్పందించే విధంగా ప్రభావితం చేస్తుంది. ఈ పరిస్థితులను కలిగించేది మనమే అని భావించే తలంపులు. ప్రజలు మిమ్మల్ని విడిచిపెట్టి, మీ నమ్మకాన్ని బ్రద్ధలు చేసి ఉండవచ్చును. ఏది మిమ్మల్ని ఒంటరిగా చేసినను, దేవుడు మీతో, " నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే చెప్పెను గదా '' (హెబ్రీయులకు 13:5) అన్న వచనము ప్రకారము మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ ద్వారా ఒంటరితనం అనుభవించాడు. మన పాపాలను యేసు ప్రభువు శరీరము మీద మోపడాని కొరకై దేవుడు తన శరీరమును గాయపరచాడు. కనుకనే, యేసు ప్రభువు సిలువపై వ్రేలాడుచు, మన పాపాలను తన మీద మోస్తూ, " ఏలీ, ఏలీ, లామా సబక్తాని? '' (దీనికి అర్థం: " నా దేవా, నా దేవా, నన్నెందుకు చేయి విడిచితివి?) '' అని పలికెను. మనకును మరియు దేవునికి మధ్య నిలువబడి ఒంటరితనమను కాడిని బ్రద్ధలు చేశాడు. కనుకనే, ఇప్పుడు మనకు మరియు దేవునికి మధ్య ఎంతో దూరం లేదు. ఆయన మనకు ఎంతో సమీపముగా ఉన్నాడు. యేసు ఎల్లప్పుడు మన ప్రక్కన ఉన్నందున మనం ఒంటరిగా మనకు ఒక్క క్షణం కూడ ఉండదు. కాబట్టి, మనము ఎప్పుడు కూడ ఒంటరివారము కాదు.

ఆలాగుననే, బైబిల్లో చూచినట్లయితే, దావీదు రాజు ఒంటరితనం గుండా వెళ్ళాడు. తన అసూయచేత దావీదు చంపబడటానికి అతన్ని సౌలు రాజు వెంబడించాడు. దావీదును తన కుమారుడైన అబ్షాలోము తన ఇంటి నుండి తరిమికొట్టాడు. తద్వారా, దావీదు ఎంతగానో ఒంటరితనమును అనుభవించాడు. అతడు శత్రువులచేత తరుమబడినప్పుడు, దేవుడు దావీదు పక్షమున ఎల్లప్పుడు తన కుడి ప్రక్కన ఉన్నట్లుగా కనుగొన్నాడు. అందుకే అతడు ఇలా అంటున్నాడు, " నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడను ఉన్నావు, నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడను ఉన్నావు, నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడను నీ చేయి నన్ను నడిపించును నీ కుడిచేయి నన్ను పట్టుకొనును '' (కీర్తనలు 139:8-10) అని ధైర్యముగా చెప్పగలిగాడు. మదర్ థెరిస్సా ఇలా వ్రాసింది, " గొప్ప వ్యాధియైన టి.బి. లేదా కుష్టు వ్యాధి కాదు; ఇది అవాంఛితమైనది, ప్రేమించని మరియు శ్రద్ధచూపనిది. మనము శారీరక అనారోగ్యాన్ని స్వస్థపరచగలము. కానీ ఒంటరితనం, నిరాశ మరియు నిస్సహాయత మాత్రమే స్వస్థపరచలేము. '' రొట్టె ముక్క కోసం చనిపోతున్న వారు ప్రపంచంలో కొంతమందియైనను, కానీ నిజమైన ప్రేమను మరియు ఆదరణను పొందలేక ఎంతో మంది చనిపోతున్నారు. ఒంటరితనమను పేదరికము మాత్రము కాదు, ఇది ఆత్మీయతకు సంబంధించినది. ప్రేమ మీద దాహము కలిగియున్నట్లుగానే, దేవుని మీద కూడ దాహము కలిగియుండాలి. అప్పుడు మనలో ఉన్న ఒంటరితనము మన నుండి తొలగింపబడుతుంది.
నా ప్రియులారా, దేవుని తెలుసుకోవడం మరియు ఆయనతో మాత్రమే సంబంధం కలిగి ఉండటం మనలో ఒంటరితనము మన హృదయాలతో నింపగలదు. ఒంటరితనం తొలగించడం మరెవరూ లేదా మనం చేయగలిగేది కాదు. దేవుని ప్రేమ మన హృదయాలను, మన పరిస్థితులను మార్చగలదు. మన యెదుట రెండు ఎంపికలు ఉన్నాయి. మనం దేవుని వద్దకు పరిగెత్తివచ్చుట ద్వారా నిరాశ నుండి బయటపడవచ్చును. మనం దేవుని దగ్గరకు వెళ్ళాలని ఎంచుకుంటే, " దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు. ఆయన బంధింపబడినవారిని విడిపించి వారిని వర్ధిల్లజేయు వాడు విశ్వాసఘాతకులు నిర్జలదేశమందు నివసించుదురు '' (కీర్తనలు 68:6) అన్న వచనము ప్రకారము దేవుడు ఒంటరివారిని సంసారులుగా చేస్తాడు. మనం దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయాలని ఎంచుకుంటే, మనం సూర్యువేడిమిని ఎలా ఎదుర్కొనలేమో? మన జీవితములో ఎదుర్కొనే ప్రతి కష్టాలు ఎంతో భారముగా ఉన్నాయని మనము గుర్తించగలము. కానీ, మనం దేవుని హత్తుకొని ఉండటానికి ఎన్నుకున్నప్పుడు, ఆయన కార్యాలు జరిగించడానికి, ఆయన మనలను దైవిక కుటుంబాలు, దైవభక్తిగల స్నేహితులుగాను మరియు గొప్ప పనుల కోసం దైవీక వాతావరణంతో ఉండడానికి మనలను ఏర్పరచుకుంటాడని గుర్తుంచుకోండి, మీరు ఒంటరిగా ఉన్నట్లయితే, ఒంటరిగానే మిగిలిపోతారు. కాబట్టి, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు కూడ నేడు ఉన్న ప్రస్తుత పరిస్థితులను బట్టి ఒంటరిగా ఉన్నామని చింతించుచున్నారా? దిగులుపడకండి, మీరు దేవుడు మీ పక్షమున ఉండునట్లుగా, ఆయనను మీరు ఎన్నుకొన్నట్లయితే, నిశ్చయముగా, మీ ఒంటరితనమును తొలగించి, ఒంటరిగా ఉన్న మిమ్ములను సంసారులనుగా చేసి, బంధింపబడినవారిని విడిపించి, మిమ్మల్ని నిర్జలదేశమందు నివసించునట్లుగా వర్థిల్లజేస్తాడు.
Prayer:
సర్వకృపలకు ఆధారభూతుడవైన మా ప్రియ పరలోకపు తండ్రీ,
 
ప్రభువా, నీవు మా ఒంటరితనమును తొలగిస్తావని ఇచ్చిన సందేశమును బట్టి, నీకు వందనములు చెల్లించుచున్నాము. ప్రభువా, మమ్మల్ని ఎవరు విడిచిపెట్టినను నీవు మమ్మల్ని విడిచిపెట్టవని మేము నమ్ముచున్నాము. ప్రభువా, మేము వెళ్ళిన ప్రతిచోటా నీవు మాతో కూడ ఉంటావని మేము నమ్ముచున్నాము. నీవు మా కుటుంబంలో మంచి స్నేహితులు, మంచి సహోద్యోగులు మరియు మంచి సంస్థను ఇస్తావనియు, మా జీవితంలో ఒంటరితనం తొలగిస్తావనియు వేడుకొనుచున్నాము. ఒంటరితనముగా ఉన్న మమ్మల్ని నీ ప్రేమతో మా హృదయాన్ని నింపుము. ప్రభువా, మా ఒంటరితనములో నిన్ను ఎన్నుకొనుటకు మాకు సహాయము చేయుము. ఎవరు విడిచినను, నీవు మమ్మల్ని విడువను ఎడబాయనని వాగ్దానము చేసినట్లుగానే, మా పట్ల గొప్ప అద్భుతమును జరిగించుము. ప్రభువా, నేడు ఉన్న పరిస్థితులలో కూడ ఒంటరిగా ఉన్నామని తలంచే మా జీవితములో నీవు మాకు తోడుగా ఉండి, మమ్మల్ని నడిపించి, దావీదు వలె మా పక్షమున ఉండి మమ్మల్ని బలపరచుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

For Prayer Help (24x7) - 044 45 999 000