Loading...
Samuel Paul Dhinakaran

మీరు జీవించు సంవత్సరములు అధికములగును!

Samuel Dhinakaran
24 May
నా ప్రియ స్నేహితులారా, ఈ రోజు ఈ సందేశము చదువుచున్న మీతో దేవుని వాగ్దానమును ధ్యానించుటకు నాకు చాలా ఆనందముగా ఉన్నది. ఈ రోజు మా బామ్మగారి పుట్టిన రోజు. ఆమెను అనేకులకు ఒక గొప్ప ఆశీర్వాదముగా మార్చినందుకై దేవునికి వందనములు. అంతమాత్రమే కాదు, ఆమె కొరకు ప్రార్థించిన మీకు నా కృతజ్ఞతలు. ఈ రోజు వాగ్దానము దేవుడు బామ్మగారి జీవితములో అనుగ్రహించియున్నాడు. ఆ వచనము, " నా వలన నీకు దీర్ఘాయువు కలుగును నీవు జీవించు సంవత్సరములు అధికములగును '' అని దేవుడు చెప్పిన సామెతలు 9:11 ప్రకారం మీకు కూడ ఈ ఆశీర్వాదం మరింత ఎక్కువ కావాలని కోరుకుంటున్నాను.

ఇది ఎంత అద్భుతం! దేవుని జ్ఞానం ద్వారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీ జీవితానికి రోజులు ఎలా పొడిగించబడును? " యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట తెలివికి మూలము మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు '' అని సామెతలు 1:7లో చెప్పబడినట్లుగా, ప్రభువు యందు భయమే జ్ఞానానికి ఆరంభము అని మనకు తెలుసు. లోకమంత అనేక పాపాలతో నింపబడి ఉన్నను, నోవహు తన జీవితంలో ఏమి చేసాడో ఆఆ కార్యములో మనం దీనిని చూడగలము. నోవహు మరియు అతని కుటుంబం దేవునికి భయపడే వ్యక్తులుగా ఉండాలని దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు. దేవుని దృష్టిలో సరైనది మాత్రమే జరిగించునట్లుగా దేవుడు అతనికి జ్ఞానమును ఇచ్చి, రాబోయే నాశనం నుండి తప్పించుకునే మార్గాన్ని కూడ ఆయన వారికి చూపించాడు. అతనికి దేవుని జ్ఞానం బయలుపరచబడింది. నోవహు తన కోసం మరియు తన కుటుంబం కోసం ఒక పెద్ద ఓడను నిర్మించాడు మరియు ఈ లోకమును ముంచివేయు నీటి నుండి తప్పించుకున్నాడు మరియు దాని ద్వారా అతని దినములు పొడిగించబడ్డాయి మరియు రక్షించబడ్డారు. ఒక నూతన సృష్టి కోసం దేవుడు వారి నుండి దైవిక తరాన్ని నిర్మించాడు. నా స్నేహితులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీకు ఇదే విధంగా జరుగుతుంది. తద్వారా, దేవుడు నేడు ఈ సందేశము చదువుచున్న మీరు దేవుని నుండి అనేక ఆశీర్వాదాలను స్వాస్థ్యంగా పొందేలా చేయు యథార్థమైన హృదయముతో ఆశీర్వదించును
నా ప్రియులారా, పాపానికి జీతం మరణం. అవును యూదా డబ్బు కోసం తనకున్న దురాశ కారణంగా యేసుకు ద్రోహం చేశాడు మరియు ఇది అతని హృదయాన్ని చంపునట్లు చేసింది మరియు అతడు దానిని తట్టుకోలేక పోయాడు. ఇది అతన్ని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకొనునట్లు చేసినది. ఈ లోకము మనల్ని కూడ ఇదే చేసేలా చేస్తుంది. మరణానికి ఒత్తిడి చేస్తుంది. అయితే, దేవుడు, ' నా జ్ఞానంతో, మీ దినములు అత్యధికము చేయబడును మరియు మీరు జీవించు సంవత్సరాలు పొడిగించబడతాయి. మరియు నేను ఇచ్చు దీర్ఘాయువుచేత నన్ను స్తుతించేవారిని ఆశీర్వదించే సంతతిగా అత్యధికము చేసి నేను నిన్ను ఉపయోగించెదను. నీ భవిష్యత్తు ఇలాగే ధన్యమవుతుంది!' అంటున్నాడు. కాబట్టి, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు ఆయనను పట్టుకొన్నట్లయితే, దేవుడు మీకు ఈ కృపను అనుగ్రహిస్తాడు నా స్నేహితులారా.
Prayer:
మా ప్రేమగల పరలోకమందున్న తండ్రీ,

నేటి వాగ్దానానికై నీకు వందనాలు. తండ్రీ, మాకు దేవునికి భయపడే ఆత్మను దయచేయుము. ప్రభువా, నీ దివ్య జ్ఞానముతో మమ్మును దీవించుము మరియు మమ్మును ఇతరులకు ఆశీర్వాదకరముగా చేసి నీ నామమునకు మహిమను కలిగించుము. ప్రభువా, మేము జీవించు సంవత్సరములు అధికమగునట్లుగా, మా దినములు సంపూర్తి చేయబడునట్లుగా నీవు మాకు అటువంటి కృపను అనుగ్రహించుము. దేవా, మమ్మును నీ యొక్క జ్ఞానముతో నింపుము మరియు తెలివిచేత నేడు మా జీవితమును ప్రారంభించునట్లు చేయుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

For Prayer Help (24x7) - 044 45 999 000