Loading...
Evangeline Paul Dhinakaran

దేవుని సన్నిధిలో సహనముతో వేచి ఉండండి!

Sis. Evangeline Paul Dhinakaran
21 Oct
నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీ పట్ల దేవుడు అద్భుతమైన వాగ్దానం చేయుచున్నాడు. ఇది కీర్తనలు 27:1 నుండి తీసుకోబడింది, " యెహోవా నాకు వెలుగును రక్షణయునై యున్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణ దుర్గము, ఎవరికి వెరతును? '' అన్న వచనము ప్రకారము యెహోవా మా జీవితానికి నీవు బలమైన కోటగాను - మేము ఎవరికి భయపడెదము? అని చెప్పవచ్చును. అవును, దేవుడు మీకు కోటగా ఉన్నాడు. దావీదు ఒక ప్రార్థన యోధుడు. కీర్తనల గ్రంథము ద్వారా ఆయన అన్ని సమయాలలో కూడ ప్రార్థించేవాడు. అతను ఎంతగానో ప్రభువుతో పోరాడి మరియు సమాధానమును పొందుకున్నాడు. అందుకే దావీదు కీర్తనలు 40:1 లో " యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని ఆయన నాకు చెవి యొగ్గి నా మొఱ్ఱ ఆలకించెను '' అని చెప్పబడినట్లుగానే, దావీదు సహనముతో దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని యుండుట ద్వారానే సమాధానమును పొందుకొనియున్నాడు.

నా ప్రియులారా, ఈ రోజు ఈ సందేశము చదువుచున్న మీరు కూడా ప్రభువు సన్నిధిలో ఎంతకాలము నుండి ఇలా ఏడుస్తూ ఉండవచ్చును, " ప్రభువా, నేను సహనముతో ఎదురు చూస్తున్నాను. నీవు నా ప్రార్థన వింటున్నావా? ప్రభువా, నా ప్రార్థనకు నీవు సమాధానం అనుగ్రహించవా? తద్వారా, నేను నిరాశకు గురయ్యాను. నీవు నాకు ఈ ఆశీర్వాదం కుమ్మరించవా? '' అని మీరు ఇలా ప్రార్థిస్తూ ఉండవచ్చును. అందుకే దావీదు, కీర్తనలు 27:14 లో " ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము యెహోవా కొరకు కనిపెట్టుకొని యుండుము '' అన్న వచనము ప్రకారము మీరు దేని నిమిత్తము చింతించకుండా, ధైర్యంగా ఉండండి మరియు మీ హృదయాన్ని నిబ్బరముగా ఉంచుకోండి అని దావీదు చెప్పుచున్నాడు. అతను ప్రతిరోజు ప్రభువు పాదాల వద్ద సహనముతో వేచి ఉండి ఉండుట ద్వారానే, ఆయన ఇలా అంటున్నాడు, " నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును '' (కీర్తనలు 34:1) అన్న వచనము ప్రకారము దావీదు సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున దేవుని ధ్యానించుచు మొఱ్ఱపెట్టుకొనుచుండెను, ఆయన దావీదు ప్రార్థన నాలకించాడు అని అతను అనుదినము ఏడు సార్లు ప్రార్థించేవాడు. ఇది దావీదు యొక్క ప్రార్థన జీవితం. దావీదు, తన ప్రార్థన విన్నపములకు సమాధానాల కొరకు ప్రభువు కొరకు సహనముతో ఎదురు చూచుట ద్వారా ఉన్నత స్థానమునకు హెచ్చింపబడెను.
నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీ హృదయాన్ని ప్రభువు బలపరుస్తాడు. మీరు ఎంతకాలం ప్రార్థించాలి? మరియు దేవుని కొరకు సహనముతో వేచి యుండాలి? అని ప్రజలు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తుండవచ్చును. కానీ, దేవునికి అసాధ్యమైనదేదీయు లేదు. కాబట్టి, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు సహనముతో వేచి ఉండినట్లయితే, ప్రభువు మీ హృదయాన్ని బలపరచి, మీ హృదయ కోరికలన్నింటిని తీరుస్తాడు. ప్రభువే మీ నిరీక్షణకు కర్తయై యున్నాడు. కాబట్టి, ప్రభువు యందు మీరు నిరీక్షణ కలిగియుండండి. అబ్రాహాము కూడా ప్రభువును అడిగాడు, ' సర్వశక్తిమంతుడైన దేవుడవు, నేను సంతానం లేనివాడను, కాబట్టి నీవు నాకు ఏమి జరిగించావు? అని ప్రశ్నించాడు.' అయితే, " ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి అబ్రామా, భయపడకుము; నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను '' (ఆదికాండము 15:1). ఇది ప్రభువు నుండి వచ్చిన అద్భుతమైన వాగ్దానం కాదా? నా ప్రియులారా, మీకు కూడా ప్రభువు ఇదే వాగ్దానమును సెలవిచ్చుచున్నాడు. దేవుడు మీకు కేడెము, మీ బహుమానముగా ఉన్నాడు, ఇంక మీ జీవితంలో మీకు ఏమి కావాలి? అవును, ఈ లోకములో మీకు లభించే ఒకేఒక ఆదరణ ఆయనలో మాత్రమే ఉన్నది. అబ్రాహాము తనకు సంతానం లేదని భయపడ్డాడు. అటువంటి సమయములో, " మరియు ఆయన వెలుపలికి అతని తీసికొని వచ్చి నీవు ఆకాశము వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము ఆలాగవునని చెప్పెను. '' అబ్రాహాము మాటలు ' నేను సంతానం లేనివాడిని ' అన్నాడు. కానీ, ప్రభువు మాటలు, ' నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము ఆలాగవునని చెప్పెను.' నా ప్రియ స్నేహితులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీ కోసం ప్రభువు ఇచ్చిన వాగ్దానం ఇది. కాబట్టి, ధైర్యంగా ఉండండి, సహనముతో ప్రభువు సన్నిధిలో వేచి ఉండండి మరియు దేవుడు మీకు తప్పకుండా మీ ప్రార్థన విన్నపములన్నిటికిని సమాధానం అనుగ్రహించి మిమ్మల్ని అబ్రాహాము, దావీదువలె ఆశీర్వదిస్తాడు.
Prayer:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ,
 
మాకు సమస్తమును అనుగ్రహించుటకు నీవు చాలినంత దేవుడవుగా ఉన్నందుకై నీకు వందనములు చెల్లించుచున్నాము. దేవా, ఎన్నో లోపాలను కలిగి ఉన్న మమ్మల్ని, నీకృపచేత మార్చుము. దేవా, మా జీవితములో మాకు అవసరమైన ప్రతిదాన్ని నీవు అనుగ్రహిస్తావని మేము నమ్ముచున్నాము. కాబట్టి, ప్రభువా, మేము నీ మీద మా విశ్వాసమును ఉంచడానికి మాకు అటువంటి హృదయమును దయచేయుము. అబ్రాహాము వలె ఈ రోజు మమ్మల్ని ఆశీర్వదించుము. దావీదు వలె మేము ఎల్లప్పుడు నిన్ను స్తుతించుటకు మాకు సహాయము చేయుము. ప్రభువా, మేము నీ సన్నిధిలో కనిపెట్టుకొని జీవించుటకును మరియు మా సహనానికి ప్రతిఫలమును మాకు దయచేయుము. మా హృదయాన్ని, శరీరాన్ని శక్తివంతముగా మార్చుము. మా జీవితంలో సమస్తమును నూతనంగా మార్చుము. మేము కోల్పోయిన సమస్తమును మాకు తిరిగి అనుగ్రహించుము. అబ్రాహాము వలె మాకు సంతానమును కలుగజేసి మమ్మల్ని ఆశీర్వదించుమని సమస్త స్తుతి ఘనత మహిమ నీకే చెల్లించుచు యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

For Prayer Help (24x7) - 044 45 999 000