Loading...
Stella ramola

మీరు ప్రభువు కొరకు వేచి ఉండండి!

Sis. Stella Dhinakaran
16 May
నా ప్రియ మిత్రులారా, మన ప్రభువును మరియు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు వందనములు తెలియజేయుచున్నాను. ఈ రోజు వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనల గ్రంథము 37:34 వ వచనమును దేవుడు మీ కోసం ఒక చక్కటి వాగ్దానం కలిగి ఉన్నాడు, అదేమనగా, " యెహోవా కొరకు కనిపెట్టుకొని యుండుము ఆయన మార్గము ననుసరించుము భూమిని స్వతంత్రించుకొనునట్లు ఆయన నిన్ను హెచ్చించును '' అన్న వచనము ప్రకారము మీరు దేవుని కొరకు కనిపెట్టుకొనియున్నప్పుడు, ఆయన మిమ్మల్ని హెచ్చించును. ఇది సర్వశక్తిమంతుడైన యెహోవా మీకు ఇచ్చిన వాగ్దానం. భూమిని స్వతంత్రించుకొనుటకు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడని వాగ్దానము చేయుచున్నాడు. కానీ, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు ఈ ఆశీర్వాదం ఎలాగున పొందగలరు? నేడు మీరు కీర్తనల గ్రంథము 37:9 వ వచనమును చదివినట్లయితే, " కీడు చేయువారు నిర్మూలమగుదురు యెహోవా కొరకు కనిపెట్టుకొనువారు దేశమును స్వతంత్రించుకొందురు '' అన్న వచనము ప్రకారము ప్రభువు కొరకు కనిపెట్టుకొనువారే ఈ దేశమును స్వతంత్రించుకొనగలరని వాక్యము మనకు స్పష్టముగా తెలియజేయుచున్నది. కాబట్టి, ధైర్యముగా ఉండండి.

నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు బైబిల్ నుండి యెహోషువ 24:2 వ వచనమును చదివినట్లయితే, " యెహోషువ జనులందరితో ఇట్లనెను ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెప్పునదేమనగా ఆదికాలము నుండి మీ పితరులు, అనగా అబ్రాహాముకును నాహోరుకును తండ్రియైన తెరహు కుటుంబికులు నది (యూఫ్రటీసు) అద్దరిని నివసించి యితర దేవతలను పూజించిరి. అయితే నేను నది అద్దరి నుండి మీ పితరుడైన అబ్రాహామును తోడుకొని వచ్చి కనాను దేశమందంతట సంచరింపజేసి, అతనికి సంతానమును విస్తరింపజేసి, అతనికి ఇస్సాకును ఇచ్చితిని '' అని సెలవిచ్చాడు. దేవుడు అతనితో మాట్లాడినందున, అబ్రాహాము దేవున్ని ప్రేమిస్తున్నాడు మరియు ఆయనను సేవించడానికి అబ్రాహామును ఎన్నుకున్నాడు. అందుకే బైబిలేమంటుందో చూడండి, " నీకును నీతరు వాత నీ సంతతికిని నీవు పరదేశివైయున్న దేశమును, అనగా కనానను దేశమంతటిని నిత్యస్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడనై యుందునని అతనితో చెప్పెను '' (ఆదికాండము 17:8) అన్న వచనము ప్రకారము దేవుడు అబ్రాహాముతో ఇలా అన్నాడు, ' నీవు ఇప్పుడు పరదేశీయుడిగా ఉన్నప్పటికిని, నీకును, నీ సంతతికిని కనాను దేశమంతటిని నీకు నిత్య స్వాస్థ్యముగా ఇచ్చానని చెప్పినట్లుగానే, ' నేడు ఈ సందేశము చదువుచున్న మీకును ఆయన నిత్య స్వాస్థ్యమును అనుగ్రహిస్తాడు.
నా ప్రియులారా, దేవుడు అబ్రాహామునకు, అతని సంతతికి కనాను దేశమంతా ఇస్తానని వాగ్దానం చేశాడు. ఇది దేవుడే వారికిచ్చిన వాగ్దానం. మనము హెబ్రీయులకు11:9 వ వచనమును చదివినట్లయితే," విశ్వాసమునుబట్టి అతడును, అతనితో ఆ వాగ్దానమునకు సమానవారసులైన ఇస్సాకు యాకోబు అనువారును, గుడారములలో నివసించుచు, అన్యుల దేశ ములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి '' అన్న వచనము ప్రకారము విశ్వాసం ద్వారా వాగ్దాన దేశంలో పరవాసులైరి. ఈ వాక్యము వ్రాయబడిట్లే ప్రభువు తన వాగ్దానాన్ని ఎన్నటికిని వెనక్కి తీసుకోడు. కాబట్టి, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు దేవుని వాక్యాన్ని చదివినప్పుడు, దేవుడు మీతో మాట్లాడుచున్నాడు. కాబట్టి నేడు ఈ సందేశము చదువుచున్న మీకు ఇవ్వబడిన వాగ్దానములను హత్తుకొన్నప్పుడు మరియు మీరు ప్రార్థించండి మరియు మీరు వెంటనే పొందుకుంటారు. అందుకే బైబిలేమంటుందో చూడండి, " కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసముగల అబ్రాహాముతో కూడ ఆశీర్వదింపబడుదురు '' (గలతీయులకు 3:9) అన్న వచనము ప్రకారం నేడు మీరు కూడ విశ్వాస సంబంధులైనట్లయితే, అబ్రాహామువలె ఆశీర్వదింపబడుదురు. కాబట్టి, " జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును; నేనతనికి దేవుడనై యుందును అతడు నాకు కుమారుడై యుండును '' (ప్రకటన 21:7) అన్న వచనము ప్రకారం దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అంతమాత్రమే కాదు, ఆయన మనకు దేవుడను, మనము ఆయన పిల్లలమవుతాము. ఆయన అబ్రాహాముకు ఇచ్చిన ఆశీర్వాదాలన్నిటిని మీకు కూడ ఇస్తాడు. ఈ ఆశీర్వాదాలను పొందడానికి ప్రభువు కొరకు కనిపెట్టుకొని యుండండి మరియు ఆయన యందు మీ నమ్మకమును ఉంచి, ఆయన మార్గము ననుసరించినట్లయితే, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు ఈ భూమిని స్వతంత్రించుకొనునట్లుగా ఆయన మిమ్మల్ని ఆశీర్వదించి, హెచ్చించును.
Prayer:
కృపకు పాత్రుడవైన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ,

నిన్ను ఘనపరచుచున్నాము. దేవా, నీ ప్రేమను మా పట్ల కనుపరచినందుకై నీకు వందనములు చెల్లించుచున్నాము. ప్రభువా, మేము ఎటువంటి స్థితిలోను నీ కొరకు కనిపెట్టుకొనియుండునట్లుగా మాకు సహాయము చేయుము. దేవా, మా హృదయం నీకు తెలుసును. నేడు మా అవసరతలన్నిటిని నీ యొద్దకు తీసుకొని వచ్చి, నీ చేతులకు సమర్పించుకొనుచున్నాము. ప్రభువా, నీ మహిమైశ్వర్యము చొప్పున మా అవసరాలను తీర్చుము. అబ్రాహాము వంటి విశ్వాసంతో మమ్మల్ని ఆశీర్వదించుము. మరియు నీ కొరకు కనిపెట్టుకొని ఉండుటకును మరియు అబ్రాహామునకు ఇచ్చిన ఆశీర్వాదాలన్నిటిని మేము స్వతంత్రించుకొనుటకు మాకు సహాయము చేయుము. దేవా, ఈ భూమిని స్వతంత్రించుకొనే విశ్వాసమును మాకు అనుగ్రహించి మమ్మల్ని హెచ్చించుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

For Prayer Help (24x7) - 044 45 999 000