Loading...
Evangeline Paul Dhinakaran

దేవుడు మీ ప్రార్థనలను ఎన్నటికి త్రోసివేయడు!

Sis. Evangeline Paul Dhinakaran
08 Jun
నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీ ప్రార్థనలన్నిటిని దేవుడు ఎన్నటికిని త్రోసివేయడని ఆయన మీ పట్ల వాగ్దానము చేయుచున్నాడు. మన ప్రార్థనల ద్వారా యేసును మరియు ఆయన చిత్తాన్ని ప్రతిబింబించునట్లు మన జీవితాలు ఉండాలి. తద్వారా మన విన్నపములన్నిటికిని సమాధానం దొరుకుతుంది. మన ప్రార్థనలకు తప్పకుండా, సమాధానం లభిస్తుందని మనం నమ్మాలి. " ప్రార్థన '' అంటే మనం కోరిన దాన్ని పొందుకొనుటను గురించి కాదా? ఇది మా ప్రార్థనలకు దేవుని ప్రతిస్పందన. మన ప్రార్థనలకు కొన్నిసార్లు సమాధానం అవును కావచ్చు లేదా కొన్నిసార్లు అది లేదు అని కూడ కావచ్చును, కొన్నిసార్లు అది వేచి ఉండునట్లు చేస్తుంది. కానీ నిశ్చయంగా, ఆయన మన ప్రార్థనలన్నిటికి సమాధానం అనుగ్రహిస్తాడు. మనలో విశ్వాసం లేకపోవడం చేత తప్పకుండా, మన ప్రార్థనలకు ఆటంకం కలిగిస్తుంది. అందుకే బైబిలేమంటుందో చూడండి, " అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను; సందేహించువాడు గాలిచేత రేపబడి యెగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును '' (యాకోబు 1:6) అన్న వచనము ప్రకారము మనం దేవుని యందు ఎక్కువగా సహవాసము కలిగియున్నప్పుడు, నీతిమంతుల ప్రార్థన ఎలాగున శక్తివంతమైనదో ఈ వాక్యము మీద నమ్మకంగా ఉంచినప్పుడు మీరు విజయమును సాధించగలరు! అందుకే బైబిలేమంటుందో చూడండి, " మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి; మీరు స్వస్థతపొందునట్లు ఒకనికొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలము గలదై యుండును '' (యాకోబు 5:16) అన్న వచనము ప్రకారము నేడు మీ ప్రార్థనలకు తప్పకుండా దేవుడు జవాబిస్తాడు.
 
ఇటీవల, జయలక్ష్మి అనే సోదరి సాక్ష్యం విన్నాను. ఆమె చెన్నైలోని మా ప్రార్థన గోపురమునకు సమీపములో నివసించుచుండెను. ఆమె యేసును ఎంతగానో ద్వేషించింది, ఆమె షాపింగ్ కోసం లేదా మరెక్కడైనా వెళ్ళినప్పుడల్లా, ప్రార్థన గోపురము వైపు చూడకుండా ఉండాలని ఆమె తలను వంచుకొంటుంది. కానీ ఒకరోజు, ఆకస్మాత్తుగా ఆమె చిన్న కుమార్తెపై మరిగే నూనె పడటముతో, ఆమె శరీరమంతా బొబ్బలు పడ్డాయి. వారు చేయగలిగేదంతా ఏమి లేక, ఆసుపత్రిలో ఆమెను చేర్చారు. దేవుడు మాత్రమే తన కుమార్తెకు సహాయం చేయగలడని వైద్యులు చెప్పుట ద్వారా, ప్రార్థన కోసం యేసు పిలుచుచున్నాడు ప్రార్థన గోపురమును సంప్రదించమని ఒక నర్సు ఆమెతో చెప్పెను. ఇది విన్న ఈ సోదరి ఆశ్చర్యపోయినది. ఇంకా ఆమె ప్రార్థనల కోసం అక్కడికి వెళ్లడానికి అంగీకరించెను. ఆమె ప్రార్థన గోపురములోనికి వెళ్ళినప్పు డు, ప్రార్థన యోధులు ఆమె కుమార్తె కోసం ఎంతో భారముతో ప్రార్థించారు మరియు వారు తన కుమార్తె స్వస్థత పొందాలని వారు అక్షరాలా కన్నీళ్లతో ప్రార్థించారు. ఒక గొప్ప అద్భుతం జరిగినది. ప్రభువు ఆ బొబ్బలను ముట్టి స్వస్థపరచడమే కాదు, ఆమె శరీరంలోని మచ్చలన్నింటిని స్వస్థపరచాడు. ఆమె ఆనందముతో కేకలు వేయడం మాత్రమే కాకుండా మరియు ప్రభువును మహిమపరచడం మొదలుపెట్టినది. అవును, మేము అద్భుతంగా క్రియలు జరిగించే దేవునికి పరిచర్య చేయుచున్నాము. ఈ రోజు ఆమె కుమార్తె ఇంజనీర్. ప్రార్థన గోపురానికి వెళ్లడానికి ఇష్టపడని అదే సోదరి ఇప్పుడు తనకు సమస్యలు వచ్చినప్పుడు ఆమె ఆ ప్రార్థన గోపురమునకు వెళతానని చెప్పింది. కాబట్టి ఈ రోజు, ప్రభువు ఆమె కుటుంబాన్ని ఘనపరచాడు. దేవునికే మహిమ కలుగును గాక.
నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీ ప్రార్థనలు కూడ దేవుడు వింటాడు. అందుకే బైబిలేమంటుందో చూడండి, " మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు'' (యెషయా 59:2) అన్న వచనము ప్రకారము మీ ప్రార్థనలు వినకుండా ఉండుటకు కారణము మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను. " కాగా వారు దుష్టులైన మనుష్యుల గర్వమునుబట్టి మొఱ్ఱపెట్టుదురు గాని ఆయన ప్రత్యుత్తరమిచ్చుటలేదు '' (యోబు 35:12) అన్న వచనము ప్రకారము అవిధేయుల ప్రార్థనలకు దేవుడు సమాధానం ఇవ్వడు. మీ కోసం చేస్తానని ఇప్పటికే వాగ్దానం చేసినట్లుగానే, మీ పట్ల అద్భుతములను చేయమని ఆయనను అడగండి. మరియు మీ ప్రార్థనను కొనసాగించండి, ఆ రోజు వరకు మనం దూరం నుండి ప్రార్థన చేయనవసరం లేదు, ఎందుకంటే మన గొప్ప వాగ్దాన కర్తయు, కొరతలను తీర్చే దేవుడు మరియు మా రాజుగా ఉన్న ఆయనను ముఖాముఖిగా మనము చూస్తాము. కాబట్టి, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు మీ ప్రార్థనలకు ఎంతో కాలము నుండి జవాబు రాలేదని చింతించుచున్నారా? దిగులుపడకండి, మీ ప్రార్థనలకు జవాబు వచ్చేంతవరకు మీరు ఆయనను స్తుతించినట్లయితే, " దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు; ఆయన సన్నుతింపబడును గాక ''(కీర్తనలు 66:20) అన్న వచనము ప్రకారము దేవుడు మీ ప్రార్థనను త్రోసివేయకుండా, మీ యొద్ద నుండి తన కృపను తొలగిపోకుండా చేసి, ఎల్లప్పుడు ఆయన చిత్తము మీ జీవితములో నెరవేరునట్లుగా చేసి మిమ్మల్ని పరవశింపజేస్తాడు.
Prayer:
సర్వోన్నతుడా, సర్వక్తిగల మా ప్రియ పరలోకపు తండ్రీ,

ప్రభువా, మా ప్రార్థనలను త్రోసివేయకుండా, నీ కృపను మాపట్ల కుమ్మరించి, మా విన్నపములకు జవాబును దయచేయుము. ప్రతికూల పరిస్థితులలో కూడా, నీ కొరకు కనిపెట్టుకొని ఉండటానికి మరియు నిన్ను నమ్మడానికి మాకు సహాయం చేయుమని వేడుకొనుచున్నాము. మా ప్రార్థన విన్నపములకు జవాబు వచ్చువరకు మా విశ్వాసాన్ని కాపాడుకొనడానికి మాకు సహాయము చేయుము. దేవా, నీవు సమస్త జ్ఞానానికి మూలం అని మరియు మా ప్రార్థనలకు సంపూర్ణంగా జవాబును అనుగ్రహిస్తావని మేము నమ్ముచున్నాము. ప్రభువా, మా ప్రార్థనకు జవాబు రాకుండా అడ్డుగా ఉన్న పాపములను తొలగించి, నీతిమంతులనుగా మమ్మల్ని మార్చుమని వేడుకొనుచున్నాము. దేవా, మాలో ఉన్న సందేహమును తొలగించి, సంపూర్ణమైన విశ్వాసమును మాకు దయచేయుమని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

For Prayer Help (24x7) - 044 45 999 000