Loading...
Stella dhinakaran

మీ శ్రమలను జయించే విశ్వాసమును దేవుడు మీకిస్తాడు!

Sis. Stella Dhinakaran
25 Feb
నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీ శ్రమల నుండి మీకు విజయమును అనుగ్రహించాలని మన ప్రభువు మీ పట్ల కోరుచున్నాడు. నేడు మీరు అనేక శ్రమలను అనుభవించుచున్నారని దిగులుపడుచున్నారా? " ...లోకములో మీకు శ్రమలు కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి యున్నాను '' అని వాగ్దానము చేయుచున్నాడు. ఆయన ఈ లోకమును జయించెను. కనుకనే, నశించిపోయే లోకములో జీవిస్తున్న మనలను బాధలు, శ్రమలు, శోధనలు వెంబడించును. అటువంటి మనకందరికి ఒక శుభవార్త, ' యేసు మనతో ఉన్నాడనియు మరియు ఆయన ఈ లోకాన్ని జయించియున్నాడనియు మనకు సెలవిచ్చుచున్నాడు. ' ఈనాడు మీరు ఏదో ఒక విధంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారా? ఎన్నో శ్రమలు మిమ్మల్ని బాధపెడుతుండవచ్చును? భవిష్యత్తు అంధకారముగా ఉండవచ్చును? గుర్తుంచుకోండి, మనకు గొప్ప ఆనందం మరియు మనము మన యొక్క నిత్యవసర కాలంలో, ఆయన వద్దకు పరుగెత్తివచ్చినట్లయితే, మనకు యేసులో ఆశ్రయం ఉంటుంది. కాబట్టి, నిరుత్సాహపడకండి. జీవితములో ఎదురుచూడని విధంగా, శ్రమలకు గురికాకుండా, ఆయన వాక్యమునందు నమ్మకం ఉంచండి. అదియుగాక, మీ భారములను దేవునిపై మోపండి అని వాక్యము తెలియజేయుచున్నది, " నీ భారము యెహోవా మీద మోపుము ఆయనే నిన్ను ఆదుకొనును నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు '' (కీర్తనలు 55:22) అన్న వచనము ప్రకారము మీ భారమును దేవుని మీద మోపినప్పుడు, ఏమి జరుగుతుందో చూడండి, " నీ సహాయము వలన నేను సైన్యమును జయింతును. నా దేవుని సహాయము వలన ప్రాకారమును దాటుదును '' (కీర్తనలు 18:29) అన్న వచనము ప్రకారము అవును, నేడు మీరు ఎదుర్కొంటున్న ఎటువంటి ప్రాకారములాంటి శ్రమలైనను మీరు సర్వసాధారణంగా జయించగలరు. ఆలాగున జయించిన సహోదరి ప్రేమా విజయానంద్, (తిరువళ్ళూరు, తమిళనాడు) తన యొక్క దు:ఖమంతటిని ప్రభువు ఆనందంగా ఎలా మార్చాడో తాను చెప్పిన సాక్ష్యమును చూడండి:

మా కుటుంబంలో వివిధ సమస్యలు ఉండేవి. అందువలన కుటుంబములో శాంతి లేక వేదనను అనుభవించేవారము. ఒక ప్రక్కన నా ఒక్కదాని సంపాదనతో ఇంటిని నడిపించవలసిన పరిస్థితి. మరొక ప్రక్కన అప్పుల సమస్యలు, ఇంకను మా ఇంటి నిర్మాణము పూర్తి చేయలేక, మధ్యలోనే ఆగిపోయింది. అందువలన నా హృదయములో ఎల్లప్పుడు చింతించుచుండేదానను. ఒక దినమున, నాతో కలిసి, పని చేయు ఒక సహోదరుడు నాతో, " ఎందుకు ఎల్లప్పుడు బాధపడుతూ ఉంటారు? " యేసు పిలుచుచున్నాడు '' ప్రార్థన గోపురమునకు వెళ్లండి. మీ బాధలన్నిటిని ప్రభువైన యేసుక్రీస్తు తొలగిస్తాడు. మీ దుఃఖమును సంతోషముగా మారునట్లు చేస్తాడు '' అని చెప్పారు. నేను చిన్న వయస్సు నుండి సాంప్రదాయకమైన భక్తితో నిండిన కుటుంబములో పుట్టి పెరిగినందున, నాకు యేసు క్రీస్తును గూర్చి అంత ఎక్కువగా తెలియదు. అప్పుడు, చెన్నైలోని వానగరం అను ప్రాంతములో నున్న ప్రార్థన గోపురమునకు వెళ్లాను. అక్కడ నిర్వహించబడిన, " కుటుంబ ఆశీర్వాద కూటములో '' పాల్గొని దేవుని సన్నిధిలో విశ్వాసముతో ప్రార్థించిన తరువాత, ఒక దైవీక సమాధానము నా హృదయములో కలిగినది. క్రమముగా ప్రార్థన గోపురమునకు వచ్చి, ప్రార్థించుటకు ప్రారంభించాను. ఒక దినమున ప్రార్థన గోపురములో నిర్వహించబడిన, " కుటుంబ ఆశీర్వాద కూటములో '' పాల్గొన్నాను. ఆనాడు సహోదరి స్టెల్లా దినకరన్‌గారు దేవుని సందేశమును అందించుచున్నప్పుడు, " ప్రభువు, మీ దుఃఖమును సంతోషముగా మార్చును, పరిశుద్ధాత్మ అభిషేకముతో మీరు నింపబడినప్పుడు ఆయన మీకు సమాధానమును సంతోషమును అనుగ్రహించును '' అని చెప్పి భారముతో ప్రార్థన చేయు చున్నప్పుడు, నేను కూడ విశ్వాసముతో, " ప్రభువా, నన్ను నీ శక్తితో నింపుము '' అని ప్రార్థించాను. అప్పుడు నా శరీరము వణికిపోసాగింది. నాలో ఏదో ఒక మార్పు కలుగుటను నేను అనుభూతిని చెందాను. పరిశుద్దాత్మ శక్తితో నేను నింపబడ్డాను. అప్పటి వరకు నాలో నున్న భారము, నన్ను విడిచిపోయినది. దైవీక సంతోషముతోను, సమాధానముతోను నా హృదయము నింపబడినది. క్రమముగా నా అప్పుల సమస్యలు తీరిపోయినవి, ఇంటి నిర్మాణమును కూడ పూర్తి చేయుటకు దేవుడు మాకు సహాయము చేశాడు. '' దేవునికే మహిమ కలుగును గాక!
నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు కూడ దేవుని బిడ్డగా ఉంటూ, ఎల్లప్పుడు విజయమును పొందుకోవాలనుకుంటున్నారా? జయించిన వారిని గూర్చి బైబిలు ఏమంటుందో చూడండి, " దేవుని మూలముగా పుట్టిన వారందరును లోకమును జయించుదురు; లోకమును జయించిన విజయము మన విశ్వాసమే '' (1 యోహాను 5:4) అన్న వచనము ప్రకారము యేసు ప్రభువు ఇలా అంటున్నాడు, " నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును; అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి యున్నాననెను '' (యోహాను 16:33) అన్న వచనము ప్రకారము అవును, మీరు ఇప్పటికే మీలో నింపబడిన దైవిక బలంతో ఎటువంటి క్లిష్ట పరిస్థితుల నుండియైనను ఎంతో సులభంగా బయటకు రాగలరు. కాబట్టి, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు ఆయనకు సమీపముగా వచ్చి, ఆయన ఆజ్ఞలకు లోబడండి. ఎటువంటి పరిస్థితిలోనైనను మీరు దేవుని యందు విశ్వాసము కలిగియున్నట్లయితే, మీరు కదల్చబడరు. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మీ కుటుంబములో సంతోషమును సమాధానమును పొందుకొనెదరు. దేవుని ఆశ్రయించుచున్న మీరు ధన్యులు! ప్రభువు పరిశుద్ధాత్మ ద్వారా మిమ్మును ఆదరించుటకు ఎదురు చూచుచున్నాడు. కనుక దేవుని పరిశుద్ధాత్మతో నింపబడండి. దేవుడు మీ బాధలను మరియు శ్రమలన్నిటిని తొలగించి, మీరు లోకమును జయించే విశ్వాసమును మీకిచ్చి, తద్వారా కలిగే సంతోషమును సమాధానముతో మిమ్మల్ని నింపుతాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక!
Prayer:
కృపకు పాత్రుడవైన మా ప్రియ పరలోకపు తండ్రీ,

నిన్ను స్తుతించుటకు ఇచ్చిన గొప్ప తరుణమును బట్టి నీకు వందనములు చెల్లించుచున్నాము. ప్రభువా, నీ ఏకైక కుమారుడైన యేసుక్రీస్తును మా విమోచన కొరకు ఈ లోకమునకు పంపించినందుకై నీకు వందనములు. మేము అనుభవించాల్సిన బాధలను మరియు శ్రమలను యేసు సిలువలో అనుభవించినందుకై నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. దేవా, యుగ సమాప్తి వరకు నీవు మాతో కూడ ఉన్నావని వాగ్దానము చేసినట్లుగానే, మాతో కూడ ఉండి, మమ్మును విడిపించి, స్వతంత్రులనుగా చేయుము. మేము నీ ఆజ్ఞలకు లోబడి వాటి ప్రకారము అనుసరించుటకు మాకు సహాయము చేయుము. నీ ప్రశస్తమైన రక్తము ద్వారా మమ్మల్ని కడిగి పవిత్రులనుగా చేసి, ఈ లోక శ్రమలను జయించుటకు మాకు నీ పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించుము. ఈలోకమును జయించి విజయమును పొందుకొనే విశ్వాసమును నీవు మాకు దయచేయుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయముతో ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

For Prayer Help (24x7) - 044 45 999 000