Loading...
Dr. Paul Dhinakaran

మీకు ఏక హృదయమును ఏక మార్గమును ఇచ్చే దేవుడు!

Dr. Paul Dhinakaran
05 Dec
నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీ కుటుంబాలలో మన దేవుడు ఏక హృదయమును, ఏక మార్గమును అనుగ్రహించాలని మీ పట్ల కోరుచున్నాడు. మీరు ఒక కుటుంబం ఆరోగ్యంగా మరియు సంతోషంగా ఉండాలంటే, భార్యాభర్తల మధ్య సంబంధం ప్రభువైన యేసుక్రీస్తుతో ఏకీభవించాలి. " ఒంటరియగు నొకని మీద మరియొకడు పడిన యెడల ఇద్దరు కూడి వాని నెదిరింపగలరు, మూడు పేటల త్రాడు త్వరగా తెగిపోదు గదా? '' (ప్రసంగి 4:12) అన్న వచనము ప్రకారము భార్యభర్తలుగా మీరు యేసు ప్రభువుతో ఏకముగా కూడి యున్నట్లయితే, కుటుంబాలను విచ్ఛిన్నం చేయు మన శత్రువైన అపవాదిని నిశ్చయముగా ఎదిరించగలరు. దురదృష్టవశాత్తు, ఈ రోజులలో ఎన్నో కుటుంబాలలో కలహాలు కనిపిస్తున్నాయి. అటువంటి స్థితిలో ఉంటూ, మీరు ఎడబాటుతో బాధపడుతుంటే, ఇక్కడ మీకు ఒక శుభవార్త ఉన్నది. దేవుడు వాగ్దానం చేస్తాడు, " ...మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడునట్లు నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేయుదును '' (యిర్మీయా 32:39) అన్న ఈ వాగ్దానాన్ని మీ హృదయములో హత్తుకొనండి. మరియు అపవాది యొక్క అశాంతిని మరియు గందరగోళ పరిస్థితులను తీసుకొని వచ్చు ప్రణాళికలను ఎదిరించండి.

కొన్ని సంవత్సరాల క్రితం, ప్రభువైన యేసుక్రీస్తును గురించి ఏమీ తెలియని ఒక జంట ఉండేవారు. వారు తరచూ వివిధ కారణాల వల్ల తమలో తాము కలహాలు పెంచుకున్నారు. తద్వారా, భర్త తన ఆదాయంతో ఒంటరిగా కుటుంబాన్ని పోషించుకోవలసి వచ్చింది. ఆ సమయంలో, అతను తన ఉద్యోగాన్ని కోల్పోయాడు, దాని కోసం అతను తన భార్యను కారణము లేకుండా నిందించేవాడు. అది ఆమెను తీవ్ర వేదనకు గురిచేసినది. వారి ఇంట్లో శాంతి సమాధానము కరువైనది. ఒకరోజు, ఆమె టి.వి. ఛానల్‌ను త్రిప్పున్నప్పుడు, అకస్మాత్తుగా టెలివిజన్‌లో ఒక జంట తమ చేతులు పట్టుకొని ప్రార్థన చేయడాన్ని ఆమె చూసింది మరియు అది ఆమెను ఎంతగానో ఆకర్షించింది. అది యేసు పిలుచుచున్నాడు టి.వి.కార్యక్రమం మరియు ఆ దంపతులు నా భార్య మరియు నేను! ఆమె చూస్తు ఉండగానే , నా భార్య నేను చేతులు పట్టుకొని ప్రార్థిస్తున్నప్పుడు, " మీరు ఎక్కడ ఉన్నా భార్యాభర్తలు, మీ చేతులు పట్టుకోండి. దేవుడు మీ ఇంటిని బాగు చేస్తాడని, మీ వివాహ బంధమును ఏకపరుస్తాడని మరియు దేవుడు మీ కుటుంబ జీవితాన్ని తన హస్తాలలోనికి బాధ్యతను తీసుకుంటాడు, మీ కోసం నేను ఇప్పుడే ప్రార్థించబోతున్నాను '' అని చెప్పాను. సరిగ్గా ఆ సమయంలో, ఆమె భర్త లోపలికి వెళ్ళిపోయాడు. అయితే, ప్రార్థనలో తనతో కలుసుకోమని ఆమె తన భర్తను పిలిచింది. అతను కూడా తన జీవితంలో మొట్టమొదటిసారిగా ఆమె మాటకు విధేయత చూపించాడు మరియు వారిద్దరూ ప్రార్థనలో తమ చేతులను పట్టుకున్నారు. మరియు మేము ఇద్దరూ కార్యక్రమంలో తీవ్రంగా ప్రార్థిస్తున్నప్పుడు, ' ఒక వ్యక్తి ఎవరో మా ఇంటిలో నడుస్తున్నారు, ఆయన ప్రకాశవంతమైన వెలుగుతో నిండి ఉన్నాడు, ఆయన తెల్లని వస్త్రాలను ధరించి ఉన్నాడు, ఆయన మమ్మల్ని సమీపిస్తూ మరియు మా యొద్దకు వస్తున్నాడు ' అని కేకలు పెట్టడము ప్రారంభించాడు. అలాగున చెప్పి అతడు క్రింద పడిపోయాడు. కానీ, అతడు వెంటనే లేచినప్పుడు, ఒక గొప్ప శాంతి అతని హృదయాన్ని నింపినది. యేసు వారిని తాకి, వారి హృదయాలను మార్చాడు. వారి కుటుంబాన్ని ఐక్యపరచాడు. మరుసటి రోజు, వారు ప్రార్థనలు కోరుతూ యేసు పిలుచుచున్నాడు ప్రార్థన గోపురమునకు వచ్చారు. ఆ వ్యక్తికి ఒక విదేశంలో ఉద్యోగం వచ్చింది. అటుతరువాత, మెల్లగా వారు అభివృద్ధి చెందడం ప్రారంభించారు మరియు దేవుడు వారి పిల్లలను ఆశీర్వదించాడు. దేవునికే మహిమ కలుగును గాక.
అవును, నా ప్రియులారా, నేడు ఒక వ్యక్తి జీవితంలో నిజమైన వెలుగు ప్రకాశిస్తే, చీకటి ఆ వ్యక్తిలో నుండి పారిపోవాలి. ఈనాడు ఈ సందేశము చదువుచున్న మీ కుటుంబాన్ని చెదరగొట్టడానికి అపవాది పన్నుచున్న ప్రతి ప్రణాళికను ఆయన సన్నిధిలోనికి తీసుకొని రండి. అందుకే బైబిలేమంటుందో చూడండి, " మీరు ఏకమనస్కులగునట్లుగా ఏక ప్రేమకలిగి, యేక భావముగలవారుగా ఉండి, ఒక్కదానియందే మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి '' (ఫిలిప్పీయులకు 2:2) అన్న వచనము ప్రకారము నా ప్రియులారా, ఆయనలో నిలిచియుండనట్లయితే, మీరు మంచి ఫలాలను పొందలేరు. కాబట్టి, ఈ రోజు, ఈ సందేశము చదువుచున్న మీరు యేసును మీ కుటుంబానికి అధిపతిగా ఆహ్వానించినట్లయితే, ఆయన మీ కుటుంబములో నివసించుచూ, అశాంతితో నిండిన మీ కుటుంబాన్ని తన యొక్క శాంతితో నింపి, మీ కుటుంబాన్ని నడిపించుటకు ఏక మార్గమును మరియు ఏక హృదయమును అనుగ్రహించి, మీరు పరలోక రాజ్యం యొక్క ఆనందం మరియు శాంతి సమాధానమును మీరు అనుభవించునట్లు చేసి మిమ్మల్ని పరవశింపజేస్తాడు.
Prayer:
కృపకు పాత్రుడవైన మా ప్రియ పరలోకపు తండ్రీ,

నీవు మా పట్ల నీ ప్రేమను చూపినందుకై నీకు వందనములు చెల్లించుచున్నాము. నేడు విడిపోయిన మా కుటుంబాలను నీ యొక్క ప్రేమ బంధము చేత మమ్మల్ని నీ యొద్దకు ఆకర్షించుకొనుము. మా కుటుంబాలలోనికి నీవు వచ్చి నివసించునట్లుగా మా హృదయములోనికి మరియు మా కుటుంబములోనికి మరియు మా విహహ జీవితములో నిన్ను ఆహ్వానించుచున్నాము. పగిలిన మా హృదయాలను నీ యొక్క దివ్య ప్రేమతో బాగు చేయుము. మా కుటుంబంలో మేము అనుమతించిన కలహములను బట్టి చింతిస్తున్నాము. అది అపవాది జరిగించిన పన్నాగము కనుకనే, నేడు అపవాది ఎదిరించుటకు నీ యొక్క శక్తిని మాకు అనుగ్రహించుము. మా కుటుంబం పట్ల నీ యొక్క ఉద్దేశమును బయలుపరచి, విడిపోయిన మాకు కుటుంబాలను ఐక్యపరచుము. మా కుటుంబములో కరువైన శాంతి సమాధానములను మరల మేము పొందుకొనునట్లు మాకు సహాయము చేయుము. మా కుటుంబాన్ని నడిపించుటకు మాకు కావలసిన ఏక ప్రేమకలిగి, యేక భావముగలవారముగా ఉండునట్లు మాకు సహాయము చేయుమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

For Prayer Help (24x7) - 044 45 999 000