Loading...
Dr. Paul Dhinakaran

మూడంతల దేవుని ఆశీర్వాదాలను నమ్మండి!

Dr. Paul Dhinakaran
20 Sep
నా ప్రశస్తమైన స్నేహితులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు దేవునికి ఎంతో విలువైనవారు. ఎందుకంటే, మీరు ఈ రోజు దేవుని వాగ్దానం వెతుక్కుంటూ వచ్చి యున్నారు కనుకనే. మీ జీవితములో దేవుని వాగ్దానములు ఎన్నియైనను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే యున్నవి. ఈనాడు దేవుడు మీ జీవితములో మూడు ఆశీర్వాదములను వాగ్దానముగా అనుగ్రహించుచున్నాడు. మొట్టమొదటగా, మీతో ఉన్న దేవుని సమాధానకరమైన నిబంధన కదిలించబడదు. " పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు '' (యెషయా 54:10) అన్న వచనము ప్రకారము ఎటువంటి స్థితిలోను దేవుని కృప మిమ్మల్ని విడిచిపోదు. ఆయన యొక్క సమాధానార్థమైన నిబంధన మీ నుండి తొలగిపోదు. అందుకే కీర్తనాకారుడైన దావీదు ఇలాగున అంటున్నాడు, " సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను '' (కీర్తనలు 16:8) అన్న వచనము ప్రకారము నేడు ఈ సందేశము చదువుచున్న మీరు కూడా ప్రభువును మీ ముందు ఉంచినందున, మీరు ఎన్నటికిని కదిలించబడరు. అందుకే బైబిలేమంటుందో చూడండి, " నీ దేవుడనైన యెహోవానగు నేను భయపడకుము నేను నీకు సహాయము చేసెదనని చెప్పుచు నీ కుడిచేతిని పట్టుకొనుచున్నాను '' (యెషయా 41:13) అని సెలవిచ్చుచున్నాడు. కాబట్టి, భయం లేకుండా ఉండండి.
 
రెండవదిగా, నేడు ఈ సందేశము చదువుచున్న మీ బలహీనతలలో దేవుని యొక్క శక్తి పరిపూర్ణమగును. యెషయా 41:10వ వచనములో దేవుడు ఇలాగున అంటున్నాడు, " నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక యేర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పియున్నాను నీకు తోడై యున్నాను భయపడకుము నేను నీ దేవుడనై యున్నాను దిగులుపడకుము నేను నిన్ను బలపరతును నీకు సహాయము చేయువాడను నేనే నీతియను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును అని వాగ్దానము చేయుచున్నాడు. '' దేవుడు మీతో ఉండి మిమ్మల్ని బలపరుస్తాడు. మనము బైబిల్‌లో చదివినట్లయితే, మన బలహీనతలో మనలను బలపరుస్తాడని వ్రాయబడియున్నది. " అటువలె ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని, ఉచ్చరింప శక్యముకాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనముచేయుచున్నాడు '' (రోమీయులకు 8:26) అన్న వచనము ప్రకారము మీ బలహీనతలను జయించుట కొరకు పరిశుద్ధాత్మ మీ కొరకు బహుబలముతో విజ్ఞాపనము చేయుచున్నది. కాబట్టి, ధైర్యముగా ఉండండి.
నా ప్రియులారా, మూడవదిగా, నేడు సందేశము చదువుచున్న మీరు ఆయన గురించి అందరితో మాట్లాడటానికి దేవుడు తన మాటలను మీ నోటిలో ఉంచుతాడు మరియు అతను మిమ్మల్ని రక్షిస్తాడు. " యెహోవా నాకీలాగు సెలవిచ్చెను, నేను బాలుడననవద్దు; నేను నిన్ను పంపు వారందరి యొద్దకు నీవు పోవలెను, నీకాజ్ఞాపించిన సంగతులన్నియు చెప్పవలెను. వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై యున్నాను; ఇదే యెహోవా వాక్కు '' (యిర్మీయా 1:7-8) అన్న వచనముల ప్రకారము నేడు ఈ సందేశము చదువుచున్న మీరు దేవుని మాటలను మాట్లాడినప్పుడు మీరు విడిపింపబడతారు. ప్రభువు ఇలా అంటున్నాడు, " నా బిడ్డలారా భయపడకండి, మిమ్మును బలపరచడానికి, మీకు సహాయం చేయడానికి మరియు మిమ్మును విడిపించడానికి నేను మీతో ఉన్నాను '' అని చెప్పుచున్నాడు. కాబట్టి, దేవుని నమ్మండి. పరిశుద్ధాత్మను శక్తితో నింపమని దేవుని అడగండి. మీరు ఈ రోజు ఆయన కొరకు జీవిస్తున్నప్పుడు, ఆయన మీ కివ్వబడిన ఈ వాగ్దానాలను తప్పకుండా మీ జీవితములో నెరవేరుస్తాడు.
Prayer:
పరలోకమందున్న మా ప్రియ తండ్రీ,
 
నీవు మాకు సమీపముగా ఉండటానికి నీ కృపను మాకు దయచేయుము. దేవా, నీ సమాధానార్థమైన నిబంధనను మాతో ఉండనివ్వుము. మా బలహీనతలో నీ బలం పరిపూర్ణంగా మాకు దయచేసి మరియు నీ మాటలు మా ద్వారా ప్రకటించబడునట్లు చేయుము. యేసు నామం ద్వారా మాలో ఉన్న భయాన్ని తొలగించుము. దేవా, మాలో నీ సన్నిధిని అనుభవించడానికి మాకు సహాయం చేయుము. ప్రభువా, పై చెప్పబడిన మూడు ఆశీర్వాదములను మాకు అనుగ్రహించి, మమ్మల్ని బలపరచుము. దేవా, నీ సమాధానార్థమైన నిబంధన ద్వారా మమ్మల్ని రక్షించి మరియు మాకు సహాయం చేయుమని యేసుక్రీస్తు శక్తివంతమైన నామములో ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

For Prayer Help (24x7) - 044 45 999 000