Loading...
Dr. Paul Dhinakaran

దేవుడు మిమ్మల్ని వేయిమందియగునట్లు వృద్ధిపరుస్తాడు!

Dr. Paul Dhinakaran
01 Sep
నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మిమ్మల్ని దేవుడు మరచిపోలేదు. ఆయన తప్పకుండా, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే, యేసు మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నాడు మరియు వాస్తవంగా మీరు సాధారణమైన వ్యక్తులు కారు. మీరు దేవునికి ప్రత్యేకమైనవారై యున్నారు. " అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజకసమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తయిన ప్రజలునై యున్నారు '' (1 పేతురు 2:9) అన్న వచనము ప్రకారము మీరు ఏర్పరచుకున్న వంశమునై యున్నారు. మీరు కోట్లాదిమంది ప్రజల మధ్య దేవునిచేత ఎన్నుకొనబడిన జనాంగముగా ప్రత్యేకించబడియున్నారు. ఆయన మిమ్మల్ని తన ప్రజలనుగా ఎన్నుకున్నాడు. ప్రవక్తయైన సమూయేలు ఇశ్రాయేలీయులతో, " కోట్లాది మంది ప్రజల మధ్యలో దేవుడు మిమ్మల్ని తన సొంత జనముగా ఎన్నుకున్నాడని చెప్పెను. '' అవును, దేవుడు మిమ్మల్ని మరచిపోలేదని వాక్యము సెలవిచ్చుచున్నది, " యెహోవా మమ్మును మరచిపోలేదు ఆయన మమ్ము నాశీర్వదించును ఆయన ఇశ్రాయేలీయుల నాశీర్వదించును అహరోను వంశస్థులనాశీర్వదించును. పిన్నలనేమి పెద్దలనేమి తనయందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును.యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధిపొందించును'' (కీర్తనలు 115:12-14) అన్న వచనము ప్రకారము ఆయన మిమ్మల్ని జ్ఞాపకము చేసుకొనియున్నాడు. ఆయన మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆయన మిమ్మల్ని ఆశీర్వదించి మరియు వృద్ధిపరుస్తాడు.
 
నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మిమ్మల్ని బలమైన జనముగా మారుస్తానని వాగ్దానము చేయుచున్నాడు. అందుకే బైబిలేమంటుందో చూడండి, " వారిలో ఒంటరియైనవాడు వేయిమందియగును ఎన్నికలేనివాడు బలమైన జనమగును యెహోవానగు నేను తగినకాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును '' (యెషయా 60:22) అన్న వచనము ప్రకారము నేడు ఈ సందేశము చదువుచున్న మీరు ఒంటరిగా ఉన్నవారని చింతించుచున్నారా? దిగులుపడకండి, మీరు వేయిమందియగునట్లు వృద్ధిపరుస్తాడు. దేవుడు మిమ్మల్ని వెయ్యి రెట్లు వృద్ధిపరుస్తాడని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే, మీరు ఆయనకు ప్రత్యేకమైన జనాంగముగా ఎన్నుకోబడ్డారు. మీరు ఆయన సన్నిధిలో ప్రార్థించి, మీరు మీ జీవితాన్ని ఆయనకు అప్పగించినప్పుడు, మీరు ఆయనకు స్వంత బిడ్డలుగా చేయబడ్డారు. మీరు మీ జీవితం నుండి యేసు నామాన్ని ఎప్పుడు విడిచిపెట్టలేదు. మీరు ఎల్లప్పుడు యేసును మొదటి స్థానంలో ఉంచారు. మీరు ప్రభువును సేవించారు. మీరు మీ కానుకలను ప్రభువు పరిచర్యకు సమర్పించియున్నారు. తద్వారా, ఈ పరిచర్యచేత ఇతరుల కన్నీళ్లను తుడవడానికి ఇది ఉపయోగపడుతుంది. మీరు పరిచర్య ద్వారా పేదలను పరామర్శించుచున్నారు. కాబట్టి, నిశ్చయంగా ప్రభువు మిమ్మల్ని జ్ఞాపకము చేసుకుంటాడు. ఆయన ఎన్నడును మిమ్మల్ని మరువడు.
నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు మీ కుటుంబము లౌకికమైన ఆశీర్వాదాలు పొందక ఎన్నో కష్టాలుపడుతూ ఉండవచ్చును. ఇందువలన మీరు అధైర్యపడకండి. నేడు ఈ సందేశము చదువుచున్న మీ పేరు ఆయన తెలుసును. " ఆ కాలమున ఆనాటికి ఇశ్రాయేలువారును యూదా వారును కూడి వచ్చెదరు ఏడ్చుచు సాగుచు తమ దేవుడైన యెహోవా యొద్ద విచారించుటకై వచ్చెదరు. ఎన్నటికిని మరువబడని నిత్యనిబంధన చేసికొని యెహోవాను కలిసికొందము రండని చెప్పుకొనుచు సీయోను తట్టు అభిముఖులై ఆచ్చటికి వెళ్లు మార్గము ఏదని అడుగుచు వచ్చెదరు ఇదే యెహోవా వాక్కు'' (యిర్మీయా 50:4,5) అన్న వచనముల ప్రకారము ఇక్కడ యెహోవా ఇశ్రాయేలు ప్రజలను గురించి, యూదా ప్రజల గురించి మాట్లాడుచున్నాడు. వారందరు దేవునిచే ఎన్నుకొనబడిన యూదా ప్రజలు అయినప్పటికిని, వారు తమను తాము విడిపోయారు, వారికై వారు రాజ్యాలను ఏర్పరుచుకున్నారు మరియు ఇద్దరు వేర్వేరు రాజులను కలిగి ఉండిరి. కానీ, దేవుడు వారిని ఎప్పుడు ఒక్కటిగానే చూచాడు. నేడు ఈ సందేశము చదువుచున్న మీ కుటుంబంలో కూడా, మీ కుటుంబం అభివృద్ధి చెంది విస్తరించియుండవచ్చును. ఒక జనము వారు ప్రభువునకు సేవ చేస్తూ ఉండవచ్చును మరియు మరి కొంతమంది సేవ చేయకపోవచ్చును. కానీ, దేవుడు మీ కుటుంబము వైపు చూస్తున్నాడు. ఎందుకంటే, ఆయన మిమ్మల్ని ఎన్నుకున్నాడు మరియు మీ కుటుంబంలోని ప్రతి ఒక్కరిని ప్రత్యేక జనాంగముగా మారుస్తాడు. బైబిలు ఇలా చెబుతోంది, " దేవుడు మీ కుటుంబ సభ్యులందరిని ఆయనను వెదకడానికి అందరు సమకూడి వచ్చేలా చేస్తాడు మరియు ఆయన మిమ్మల్ని కన్నీళ్లతో వెదకునట్లుగా చేస్తాడు.'' ఎందుకంటే, మీరు కన్నీళ్లతో విత్తినప్పుడు మాత్రమే మీరు ఆనందంతో ప్రతిఫలమును పొందుకుంటారు. అందుకే బైబిలేమంటుందో చూడండి, " కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు '' (కీర్తనలు 126:5) అన్న వచనము ప్రకారము నేడు ఈ సందేశము చదువుచున్న మిమ్మల్ని అందరు విడిచిపోయారని చింతించుచున్నారా? దిగులుపడకండి, మీరు కన్నీళ్లతో దేవుని సన్నిధిలో మొర్రపెట్టినప్పుడు, ఆయన మీ కన్నీళ్లను మరువకుండా, మిమ్మల్ని జ్ఞాపకము చేసుకొనుచు, దేవుడు మిమ్మల్ని మరియు మీ కుటుంబమును వృద్ధిపరుస్తాడు.
Prayer:
మా ప్రశస్తమైన విమోచకా! ప్రియ పరలోకపు తండ్రీ,
 
మేము ఈ లోకంలో అనేక కొరతలు వల్ల ఎన్నో ఇబ్బందులు పడుచున్నాము. పై వాగ్దాన వచనం వలన నీవు మా కొరతలన్ని తీర్చి మమ్ములను సమృద్ధిగా ఆశీర్వదిస్తావని ఇప్పుడు మేము గ్రహించియున్నాము. నేడు నీవు దయచేసి మా జీవితాన్ని ఆశీర్వదించి మా కుటుంబ విషయాలన్నింటిలో వృద్ధిని కలిగించుమని వేడుకుంటున్నాము. మమ్మును సృష్టించిన యెహోవాయే దేవుడని మేము నిన్ను గుర్తెరుగునట్లుగా మాకు అటువంటి మనస్సును కలుగజేయుము. మేము ఈ లోక మనుష్యులను వెదకి వెళ్లకుండా, నీవైపు చూస్తూ, నీ పాదముల చెంత కనిపెట్టుకొనియుంటూ, మా వ్యాధుల పట్లను, మా ప్రతి అవసరతల పట్ల నీకు మొఱ్ఱపెట్టుటకు మా హృదయమును తెరువుము. దేవా, ఈ లోకములో ఎంతో మంది ఉండగా నీవు మమ్మల్ని మరియు మా కుటుంబాన్ని ఒక ప్రత్యేక జనముగాను మరియు నీ బిడ్డలనుగా ఎన్నుకున్నందుకై నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. మేము ఏర్పరచబడిన వంశముగా నీవు మమ్మల్ని ఈనాడు ఎన్నుకొనుమని నిన్ను వేడుకొనుచున్నాము. మా కుటుంబాన్ని, మా పిల్లలను నీ హస్తాలకు సమర్పించుకొని నీ ఆజ్ఞలకు విధేయత కలిగి జీవించునట్లు సహాయము చేయుము. నీకు ప్రీతికరమైన జీవితమును జీవించుటకు మాకు మా కుటుంబ సభ్యులకు అటువంటి గొప్ప కృపను దయచేయుమని యేసు ప్రభువు ధన్యకరమైన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రీ, ఆమేన్.

For Prayer Help (24x7) - 044 45 999 000