Loading...
DGS Dhinakaran

యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మన పక్షమున ఉన్నాడు!

Bro. D.G.S Dhinakaran
05 Aug
నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీ పట్ల న్యాయము జరిగించుట కొరకై యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మీ కొరకు ఉన్నాడని మరువకండి. ఈనాడు, సాధారణంగా, మీ హృదయంలోని ఆనందాన్ని మరియు శాంతిని నాశనం చేసే మీలో పాపము ఉన్నదని మీరు చింతించుచున్నారా? దిగులుపడకండి, దేవుడు మీ పట్ల జాలిపరుడై యున్నాడు. బైబిల్‌లో యోబు యొక్క స్థితి ఎంత దయనీయమైనది. మీరు కూడా ఇలాంటి పరిస్థితిలో బాధపడుచుండవచ్చును. నేడు ఈ సందేశము చదువుచున్న మీ విన్నపముల జవాబు రాలేదు, దేవుడు ఆలకించలేదు, నా పక్షమున ప్రభువును వేడుకునే వ్యక్తి ఎవరైనా ఉంటే ఎంత బాగుంటుంది! అని చింతించుచున్నారా? చింతించకండి. మీ పక్షమున విన్నపము చేయుటకు మీకు ఒక మధ్యవర్తి ఉన్నాడని మీరు మరువకండి! బైబిలు ఇలా చెబుతోంది, " దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే; ఆయన క్రీస్తుయేసను నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్నుతానే సమర్పించుకొనెను. దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలముల యందు ఇయ్యబడును '' (1 తిమోతి 2:5-6) అన్న వచనముల ప్రకారము అవును, మన కొరకు మధ్యవర్తిత్వం వహించడానికి మరియు మన పరిస్థితి చూచి, మన పక్షమున వాదించడానికి ప్రభువైన యేసు దేవుని సింహాసనమునందు కుడిపార్శ్వమున ఆసీనుడైయున్నాడు. మీకు న్యాయవాదిగా యేసుక్రీస్తు ఉన్నాడని మరచిపోకండి, ఆయన పరలోకమందు తండ్రి సింహాసనం యెదుట నిరంతరం తన విలువైన రక్తంతో మీ కోసం వ్యాజ్యము చేయుచున్నాడని లేక బతిమాలుకొనుచున్నాడనియు మరువకండి.

1974 వ సంవత్సరములో నేను మరియు నా భార్య కలిసి విదేశానికి వెళ్ళాము. మేము ఆ నగర రాజధాని నుండి మరొక విమానాశ్రయానికి వెళ్ళాలని అనుకున్నాము. మేము ఆ విమానాశ్రయంలోనికి వెళ్లినప్పుడు ఒక అధికారి మా టికెట్‌ను పరిశీలించి, రాజధాని నగర విమానాశ్రయంలో ఉన్న అధికారుల యొక్క సంతకం లేదు అని, అందువలన మమ్మల్ని ఆ దేశం విడిచి వెళ్ళడానికి అనుమతించలేమని చెప్పారు. అప్పుడు ఏమి చేయాలో మాకు తెలియదు. ఇదంతయు చూచి మేము ఎంతగానో భయపడ్డాము. మా వైపు ఎటువంటి తప్పులేదని మేము వారికి వివరించడానికి ఎంతగానో ప్రయత్నించాము. కానీ, మా ప్రయత్నమంతయు ఫలించలేదు. మేము ఇకపై విమానమును ఆలస్యం చేయలేమని వారు మాతో చెప్పారు. అంతమాత్రమే కాదు, వారు మేము తీసుకొని వెళ్లిన మా వస్తువులన్నిటిని ఆ విమానములో నుండి క్రిందికి దించుతున్నామని చెప్పారు. ఈ విదేశములో వాదించడానికి మా పక్షమున ఎవరూ లేరని మేము కలవరపడినప్పుడు, ఇదంతయు కొంత దూరం నుండి చూస్తున్న ఒక అధికారి, మా వద్దకు వచ్చి, విషయం ఏమిటి? అని మమ్మల్ని అడిగారు. అప్పుడు నవ్వుచున్న ముఖంతో అతడు మా టికెట్ నిరాకరించిన, ఆ అధికారి వద్దకు వెళ్లి, వారి భాషలో ఏదో చెప్పాడు. అంతే, కొన్ని పత్రాలలో సంతకము చేయలేదని అడిగిన అదే అధికారి, మమ్మల్ని మరోసారి పిలిచాడు. మరియు అదే విమానంలో మేము ప్రయాణించడానికి మాకు అనుమతి ఇచ్చాడు. మేము అక్కడున్న అధికారులకు మరియు మా క్రొత్త స్నేహితులకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేశాము. మేము అదే విమానం ఎక్కి వెళ్లాము.
ఆలాగుననే, నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీ పక్షమున పరలోకపు తండ్రితో మాటలాడుటకు మీకు ఒక ఉత్తరవాది ఉన్నాడు. ఆయనే యేసుప్రభువు, మీరు పరిశుద్ధముగా నడుచుకొనుటకు ప్రయత్నించినప్పుడు, అనుదినము అపజయమును ఎదుర్కొనుచు ఉండి యుండవచ్చును. కానీ నిరుత్సాహపడకండి, ప్రభువైన యేసుక్రీస్తు మీ కొరకును దేవుని యొద్ద విజ్ఞాపన చేయుచు, మీకు రావలసిన శిక్ష నుండి మిమ్మును తప్పించుటకు సిద్ధముగా ఉన్నాడు. యేసుక్రీస్తు తన రక్తంతో తండ్రిని వేడుకుంటున్నాడు మరియు శిక్ష నుండి మిమ్మల్ని రక్షిస్తాడు. బైబిల్ ఇలా చెబుతోంది, "...మీరు పాపము చేయకుండుటకై యా సంగతులను మీకు వ్రాయుచున్నాను. ఎవడైనను పాపము చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు '' (1 యోహాను 2:1) అన్న వచనము ప్రకారము నేడు ఈ సందేశము చదువుచున్న మీరు పాపములో పడిపోకుండునట్లుగా, ఆయన మీకు సహాయము చేయును, మన క్లిష్టమైన పరిస్థితిలో అదే విధంగా, మన ప్రభువైన యేసు మన పక్షమున మన పరలోకపు తండ్రికి మధ్యవర్తిత్వం వహిస్తాడు. మీకు సహాయం చేయడానికి మీకు ఎవరూ లేరని మరియు మీరు పేదరికం మరియు అపజయములలో ఒంటరిగా బాధపడుతున్నారని మీరు బాధపడుతున్నారా? ప్రభువైన యేసు, తండ్రి దగ్గరకు వెళ్లి, " అతను/ఆమె నా బిడ్డలు, నా ప్రియ తండ్రి, నేను వారి కోసం నా ప్రాణాన్ని త్యాగముగా సమర్పించుకున్నాను. నా త్యాగాన్ని జ్ఞాపకము చేసుకొని, నా నామము ద్వారా వారికి సహాయం చేయుమని మన తండ్రి యొద్ద మన కొరకు విజ్ఞాపనము చేస్తాడు. '' కాబట్టి, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు దేనిని నిమిత్తము నిరుత్సాహపడకండి. మీ యొక్క ప్రతి క్లిష్టమైన పరిస్థితులను చూచి భయపడకండి, సమస్తమును ఆయన దివ్య హస్తాలకు సమర్పించినప్పుడు మీ కొరకు ఒక మధ్యవర్తిగా ఉన్న ఉత్తరవాదియైన యేసు క్రీస్తు తండ్రి యొద్ద మీ పక్షమున న్యాయవాదిగా విజ్ఞాపనము చేయుచు, ప్రభువు మీ యొక్క ప్రతి సమస్య నుండి మిమ్మల్ని విడిపించి, ఆశీర్వదిస్తాడు.
Prayer:
ప్రేమగల మా పరలోకపు తండ్రీ,
 
నీ కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు సిలువపై చిందించిన రక్తమును బట్టి నీకు స్తోత్రములు. మేము మా శిక్ష నుండి తప్పించుకొనుటకు మాకు ఉత్తరవాదియై యున్నందున నీకు స్తోత్రములు చెల్లించుచున్నాము. ఎల్లప్పుడు పరిశుద్ధమైన హృదయమును కలిగియుండుటకు మరియు పరిశుద్ధమైన మార్గములో నడుచుకొనుటకు మాకు సహాయము చేయుము. ప్రభువా, ఈనాడు మేము చేసిన పాపములను నీ రక్తము ద్వారా కడిగి పరిశుద్ధపరచుము. మేము అనేకులకు న్యాయము జరిగించునట్లుగా మమ్మల్ని నీతివంతమైన మార్గములో నడిపించుము. మేము అపజయమును ఎదుర్కొన్నప్పుడు, నీవు మాకు తోడుగా, మేము పడిన గుంటలలో నుండి మమ్మల్ని పైకి లేపుము. మా లక్ష్యము వైపు పరుగెత్తడానికి మాకు సహాయము చేయుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

For Prayer Help (24x7) - 044 45 999 000