Loading...
Evangeline Paul Dhinakaran

నిత్యము నిలుచు దేవుని వాక్యముచేత మీరు ఫలించెదరు!

Sis. Evangeline Paul Dhinakaran
09 Dec
నా ప్రియులారా, దేవుని వాక్యము నిత్యము నిలుచును. మన దేవునికంటే మరియు బైబిల్ కంటె ఇతర గ్రంథములు ప్రత్యేకమైనవి కాదు. ఎందుకంటే, మన దేవుని యొక్క సజీవముగల వాక్యములో సత్యం కలిగి ఉంటుంది. ఇది శోధనల సమయములో నిలిచియుండునట్లు చేస్తుంది! ఇది అద్భుతమైన గ్రంథం, ఇది జీవితాలను మార్చగల శక్తిని కలిగి ఉన్నది. " ఏలయనగా సర్వశరీరులు గడ్డినిపోలినవారు, వారి అంద మంతయు గడ్డిపువ్వువలె ఉన్నది; గడ్డి ఎండును దాని పువ్వును రాలును, అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడును నిలుచును '' (1 పేతురు 1:23) అన్న వచనము ప్రకారము మీరు ఆ మాటలను విశ్వసించి, యేసుక్రీస్తును మీ వ్యక్తిగత రక్షకుడిగా అంగీకరించినప్పుడు, " మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు, నిర్మలమైనదియు, వాడ బారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు, ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరల జన్మింపజేసెను '' (1 పేతురు 1:3) అన్న వచనము ప్రకారము అటువంటి నశించని దేవుని వాక్యం నుండి మీరు మళ్ళీ జన్మించెదరు. " గడ్డి యెండిపోవును దాని పువ్వు వాడిపోవును మన దేవుని వాక్యము నిత్యము నిలుచును '' (యెషయా 40:8) అన్న వచనము ప్రకారము దేవుని పరిశుద్ధమైన దేవుని వాక్యము కంటే, తక్కువగా ఉన్న మరి దేనినైనా మరియు మీ ఆత్మనైను నమ్మవద్దు.

అమెరికాలోని కాలిఫోర్నియా అను ప్రాంతములో ఒక గొప్ప లోయ ఉన్నది. దానిని ' మరణ లోయ' అని పిలుస్తారు. ఆ లోయను చూచుటకే భయం వేస్తుంది. అది అంత చీకటిగా ఉంటుంది. కానీ, కొంత కాలము గడిచిన తరువాత ఒక గొప్ప వర్షము కురిసింది. వర్షకాలము ముగిసిన తరువాత, ఆ లోయను చూచినప్పుడు అదే చెట్లతోను, పువ్వులతోను పండ్లతోను ఉన్నది. దానిని ఒక గొప్ప వార్తగా చెప్పుకొన్నారు. ఈ మరణ లోయలో ఏ విధంగా ఇన్ని పువ్వులు పండ్లు వచ్చినవి అని అందరు ఆశ్చర్యపోయారు. " లోయలో ఇన్ని విత్తనములు ఉన్నందునే వ ర్షము వచ్చినప్పుడు అవి మొలకెత్తి చెట్టుగా పెరిగి, వికసించి, పండ్లు కాసి, అందంగా మారింది. చాలా విత్తనములు క్రింద ఉండి, యుండవచ్చును అని ఆశ్చర్యముతో చెప్పుకొన్నారు.
నా ప్రియులారా, మరల జన్మించిన తరువాత, అనేక సందర్భాలు, ప్రభువు తన నిత్య వాగ్దానాల ద్వారా మీతో మాట్లాడి యుండవచ్చును. అయితే, ఆయన వాగ్దానాలు విత్తనాలు లాంటివి. ఈ రోజు, వాటిని మీ హృదయంలో నాటాలని నిర్ణయించుకోండి. కేవలం దేవుని వాక్యాన్ని చదివేవారు మరియు వినేవారుగా కాకండి. మీ జీవితంలో ఏదైనా ఒక భాగం ప్రాణాంతక స్థితిలో ఉంటే, నశించని విత్తనాలు అయిన దేవుని వాగ్దానాలను నమ్మడం మరియు అంగీకరించడం ప్రారంభించినట్లయితే, ఈ విత్తనాలు మొలకెత్తి మొక్కలుగా పెరుగుతాయి, పువ్వులుగా వికసిస్తాయి మరియు పండ్లుగా కాస్తాయి. అందుకే బైబిలేమంటుందో చూడండి, " రాబోవు దినములలో యాకోబు వేరుపారును ఇశ్రాయేలు చిగిర్చి పూయును. వారు భూలోకమును ఫలభరితముగా చేయుదురు '' (యెషయా 27:6) అని దేవుడు వాగ్దానం చేసినట్లుగా, ఇది జరుగుతుంది. ప్రభువు, ' వాక్యము' అను విత్తనమును మీలో విత్తుచున్నాడు. ' పరిశుద్ధాత్మ ' అను వర్షము మీలో కుమ్మరించబడినప్పుడు, ఆ విత్తనములు మొలచి చెట్టుగా పెరిగి, పువ్వులు పూసి, ఫలములిచ్చుచున్నవి. తద్వారా, మీరు వృద్ధిపొంది, అనేక ఆశీర్వాదములను పొందుకొని హెచ్చించబడునట్లు చేసి, మీరు అన్నిటి యందు వర్థిల్లునట్లుజేయును.
Prayer:
సర్వసృష్టికి ఆధారభూతుడవైన మా ప్రియ పరలోకపు తండ్రీ,

మేము నీ యొక్క నశించని వాక్యానికి బదులుగా మనుష్యులపై మరియు మా యొక్క నైపుణ్యాలపై నమ్మకం ఉంచిన రోజులకు చింతిస్తున్నాము. మేము నీ సన్నిధి యెదుట మా ఘోరమైన పరిస్థితులను తీసుకు వస్తున్నాము. మేము నీ అద్భుతమైన వాగ్దానాలన్నింటిని తీసుకొని నీ యందు విశ్వాసంతో అంగీకరిస్తున్నాము. మా జీవితం ఎంతో చక్కగా వికసిస్తుందని మేము నమ్ముచున్నాము. నీ వాక్యము ఎన్నటికిని విఫలం కాదు. ఇది మా జీవితములో పంపబడిన నీ యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చునట్లు చేయుము. ' రాబోవు దినములలో యాకోబు వేరుపారును ఇశ్రాయేలు చిగిర్చి పూయును. వారు భూలోకమును ఫలభరితముగా చేయుదురు ' అని లేఖనము చెప్పినట్లుగానే, మేము వేరుపారి చిగిర్చి పూయునట్లుగాను భూలోకములో ఫలభరితముగా ఉండునట్లు మా జీవితాలను మార్చుమని యేసు నామంలో ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.
 

For Prayer Help (24x7) - 044 45 999 000