Loading...
Stella dhinakaran

దేవుడు అగ్నిస్తంభంగా ఉండి నీకు వెలుగిచ్చి నిన్ను నడిపించును!

Sis. Stella Dhinakaran
24 Jan
నా ప్రియులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే మనలను సరైన మార్గంలో నడిపించగలడు. ఆయనెంతో సుందరంగా మనలను నడిపించగలడని వాగ్దానము చేయుచున్నాడు. అందుకే బైబిలేమంటుందో చూడండి, ‘‘ మీరు కుడి తట్టయినను ఎడమ తట్టయినను తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి యొక శబ్దము నీ చెవులకు వినబడును ’’ (యెషయా 30:21) అని గ్రంధకర్త స్పష్టముగా తెలియజేయుచున్నాడు. ఇంతకంటె గొప్పగా ఎవరు మనలను నడిపించగలరు? తన స్వంత ప్రజలను ఆయన సరియైన మార్గములో నడిపించాడు.  ఆయన ఏర్పరచుకున్న ఇశ్రాయేలీయులను, పైన వ్రాయబడిన వాక్యము ప్రకారం నడిపించాడు. ఈనాడు ఈ సందేశము చదువుచున్న మీరు ఆయన ప్రజలుగా ఉండేందుకు నిర్ణయించుకుంటే, ప్రభువు మీ ప్రక్కనే ఉండి, మిమ్మల్ని ఆయన తన వెలుగు మార్గంలో నడిపిస్తాడు.
 
సరైన రవాణా సదుపాయాలు లేని అనాటి రోజులలో ఒక కుటుంబం వారి గ్రామం నుండి వేరే గ్రామానికి వెళ్లవలసి వచ్చింది. వారు మార్గమధ్యలో ఒక అడవి గుండా పయనించాల్సి ఉంది. ఆ సమయంలో వారు దారి తప్పారు. అప్పుడప్పుడు ఆ దారిలో అడవి జంతువులు తారసపడుతు ఉంటాయి. ఆ కుటుంబమంతా ప్రభువును విశ్వసించినవారు. అటువంటి నిస్సహాయ స్థితిలో వారందరు మోకరించి, ప్రభువునకు భక్తి శ్రద్ధలతో ప్రార్థించారు. ఆ సమయంలో, ఆకస్మాత్తుగా వారి ముందర ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్లిపోవడం వారికి ఆశ్చర్యమును కలిగించినది. అంతకు ముందు ఎవ్వరు కూడ అక్కడ లేరు. వారి ప్రార్థన తర్వాత ఈ సంఘటన జరిగింది. ప్రభువు తన దూతను వారికి ముందుగా పంపించినట్లు వారు గ్రహించారు. కనుకనే, వారు అతనితో మాటలాడి, అడవి నుండి బయటపడే మార్గమును తెలుసుకొన్నారు. ఆ విధంగా, వారు అద్భుతముగా నడిపించబడి, సురక్షితంగా, వారి గమ్యమునకు చేరుకొన్నారు.
నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు కూడ ఈ కుటుంబము వలె యథార్థముగా దేవుని వెదకినట్లయితే, ప్రభువు మీ ముందు అగ్ని స్తంభం వలె ఉండి, మీకు వెలుగునిచ్చి, సరైన మార్గములో మిమ్మల్ని నడిపించును. ఆయన యందు ఉన్న మీ నమ్మకము, మిమ్మల్ని ఎప్పటికిని నిరాశపరచదు. మీరు మీ జీవితంలో చీకటి లోయలలో కూర్చున్నప్పుడు, బైబిలేమంటుందో ఆ వాక్యమును గుర్తుచేసుకొనండి, ‘‘ నా దీపము వెలిగించువాడవు నీవే నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును ’’ (కీర్తనలు 18:28) అన్న వచనము ప్రకారము దేవుడు మీ చీకటిని వెలుగుగా మారుస్తాడు. దేవుడు నేడు ఈ సందేశము చదువుచున్న మీ చీకటినంతటిని వెలుగుగాను, కఠినమైన పరిస్థితులను మరియు ప్రదేశాలను సమ భూమిగా మారుస్తాడు.
 
నా ప్రియులారా, ప్రభువు తన స్వంత ప్రజలను ఆయన సరిగా నడిపించును. ఆయన ఏర్పరచుకున్న ఇశ్రాయేలీయులను,ఈ  క్రింది వాక్యము ప్రకారం నడిపించాడు. ఏలాగనగా, ‘‘ వారు పగలు రాత్రియు ప్రయాణము చేయునట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటివేళ మేఘ స్తంభములోను, వారికి వెలుగిచ్చుటకు రాత్రివేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడచుచు వచ్చెను  ’’ (నిర్గమకాండము 13:21). మీరు చేరుకోవాల్సిన గమ్యాన్ని చేరుకునే వరకు దేవుని సన్నిధి మీకు ఎదురుగా వచ్చు ప్రతి ఆటంకమును, శత్రువును మీ జీవితం నుండి అడ్డుకుంటుంది. జీవిత సుడిగాలితో నిరాశ చెందకండి. నేడు ఈ సందేశము చదువుచున్న మీరు గొప్ప శబ్దముతో, ‘‘ నా శత్రువా, నా మీద అతిశయింపవద్దు, నేను క్రిందపడినను, తిరిగి లేతును; నేను అంధకారమందు కూర్చున్నను యెహోవా నాకు వెలుగుగా నుండును ’’ (మీకా 7:8) అన్న వచనము ప్రకారము నేడు ఈ సందేశము చదువుచున్న మీరు అంధకారములో  కూర్చున్నను సరే, దేవుడు మీకు గొప్ప వెలుగుగా ఉండి, మీరు మీ గమ్యమును చేరుకునే వరకు అంధకారములో నుండి మిమ్మల్ని వెలుగులోనికి నడిపిస్తాడు.
Prayer:
వెలుగుగా ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రీ,
 
మా దైనందిన జీవితంలో మాకు ఎదురయ్యే విపత్కర సమయాలల్లో నీ చేతిని చాపి మమ్మల్ని నడిపించుము. దేవా, అనేక సమయాలలో చీకటి లోయలలో మేము చిక్కుకొని యున్నప్పుడు, నీ యొక్క గొప్ప వెలుగుచేత మా చీకటిని తొలగించి, మమ్మల్ని వెలుగులోనికి నడిపించుము. మమ్మల్ని చీకటిలోనికి నెట్టివేసిన మా పరిస్థితులు, వ్యాధులు, సమస్యలన్నిటిని మా నుండి తొలగించి, మాకు అగ్నిస్తంభముగాను మరియు మేఘ స్తంభముగాను ఉండి, మార్గము తెలియని మమ్మల్ని సరైన మార్గములో నడిపించుము. ఈనాడు మేము వెళ్లవలసిన గమ్యమును ఎలా చేరుకోవాలో తెలియని స్థితిలో ఉన్న మమ్మల్ని అగ్నిస్తంభముగా ఉండి నడిపించుము. మా యెదుటనున్న చీకటిని తొలగించి, మా జీవితాన్ని వెలుగుమయం చేయుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

For Prayer Help (24x7) - 044 45 999 000