Loading...
Paul Dhinakaran

ఉత్సాహముగా ఇచ్చువారిని దేవుడు ప్రేమించును!

Dr. Paul Dhinakaran
26 Jan
నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు ఉత్సాహముగా దేవునికి ఇవ్వాలని మీ పట్ల కోరుచున్నాడు. ఉత్సాహముగా ఇచ్చువారిని దేవుడు ప్రేమిస్తాడు. ఇంకను అవసరతలో ఉన్నవారికి మనము చేయగలిగినది ఇచ్చుట కొరకే దేవుడు మనలను పిలుచుచున్నాడు. కాబట్టి, నేడు ఈ సందేశము చదువుచున్న మీకు కలిగియున్న దానిలో నుండి ఇతరులను ఆశీర్వదించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. మనము కలిగియున్న శక్తి సామర్థ్యాలకు మరియు తలాంతులకును, నిపుణతకు మూలధనం ప్రభువు మాత్రమే. కాబట్టి, ఆయన మనకు ఇవ్వబడిన తలాంతులను దేవుని మహిమ కొరకు మాత్రమే ఉపయోగించవలెను. దేవుని పిల్లలైన మనం ఇచ్చుట అనునది ఒక అలవాటుగా అలవరుచుకోవాలి. అందుకు బైబిలు ఇలా చెబుతోంది, ‘‘ సణుగుకొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను; దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును ’’ (2 కొరింథీయులకు 9:7) అన్న వచనము ప్రకారము సహాయము కొరకు ఎదురు చూచే నిరుపేదలకు మరియు దీనత్వములో క్రుంగియున్న వారికి సహాయం చేయడం ద్వారా ఈ భూమిపై తన రాజ్యాన్ని నిర్మించాలని ప్రభువు మీపట్ల ఆశించుచున్నాడు. మీరు ఎంత ఎక్కువగా దేవునికి ఇస్తారో, అంత అత్యధికముగా పొందుకుంటారని వాక్యము మనకు స్పష్టముగా తెలియజేయుచున్నది. అందుకే బైబిలేమంటుందో చూడండి, ‘‘ ఇయ్యుడి, అప్పుడు మీకియ్యబడును; అణచి, కుదిలించి, దిగజారునట్లు నిండు కొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరల కొలువబడునని చెప్పెను ’’ (లూకా సువార్త 6:38) అన్న వచనము ప్రకారము మనము ఇచ్చినదానికి ప్రభువే మనకు మహాభివృద్ధిని కలుగజేస్తాడు.

 అనేక సంవత్సరాలుగా తన అత్యధికమైన ఆదాయంలో సుమారు 25 శాతము క్రైస్తవ అవసరాల కోసం ఇచ్చిన, క్రాఫ్ట్ చీజ్ కార్పొరేషన్ అధిపతి ఎల్. క్రాఫ్ట్ ఇలా అన్నారు, ‘‘ స్థిరంగా పెరుగుతూ వస్తున్న లాభాల మొత్తము డబ్బులో నేను పెట్టుబడి చేసిన ఏకైక మూలధనం ప్రభువునకు చెల్లించినది మాత్రమే. ’’ ఇంకను జె.డి. రాక్‌ఫెల్లర్ మాట్లాడుతూ, ‘‘ నాకు వచ్చే జీతములో మొట్టమొదటగా, వారానికి ఒకసారి 1.50 డాలర్ల చొప్పున దశమభాగము ఇవ్వకపోతే, నేను ఈ ఒక మిలియన్ డాలర్లను పొంది యుండలేను ’’ అని రూఢిగా తెలియజేయుచున్నాడు. ‘‘ అత్యధికముగా ఇచ్చువారి పట్టికలో ’’ అనేకమంది లక్షాధికారులు మరియు బిలియనీర్ల పేర్లను చరిత్రలో నమోదు చేయబడియుంటుంది. అందుకే లేఖనములో చూచినట్లయితే, ‘‘ ఎవనికి ఎక్కువగా ఇయ్యబడెనో వాని యొద్ద ఎక్కువగా తీయజూతురు ’’ (లూకా 12:48) అని బైబిల్‌లో మనం చదువుచున్నాము. ఎవరికి ఎక్కువ ఇవ్వబడినా, వాని యొద్ద ఎక్కువగా తీయజూతురు అన్న వచనము ప్రకారము ప్రజలకు మీరు సహాయము చేయగలిగినంత కాలం అన్ని కోణాలలో నుండి వారికి ఎల్లప్పుడు మీరు మేలు చేయడానికి సిద్ధంగా ఉండండి. అప్పుడు దేవుడు తప్పకుండా మీకు అత్యధికముగా తిరిగి ఇస్తాడు.

నా ప్రియులారా, ‘ ఇవ్వాలి ’ అనే తన యొక్క కోరికను దేవుడు ప్రతి బిడ్డలోను ఇప్పటికే ఉంచియున్నాడు. కానీ, ఏదో తెలియని భయం, మిమ్మల్ని వెనుకకు లాగుతుంది. ‘ ఇవ్వడం’ ద్వారా ఇతరులను ఆశీర్వదించాలన్న దేవుని పిలుపునకు మీరు ప్రతిస్పందించినప్పుడు, ఆయనపై ఉన్న నమ్మకం ద్వారా అది ఎన్నటికిని కదిలించబడదు. బైబిల్ నుండి మీకు ఇచ్చిన వాగ్దానాన్ని చూడండి, ‘‘ ఔదార్యముగలవారు పుష్టినొందుదురు. నీళ్లు పోయువారికి నీళ్లు పోయబడును ’’ (సామెతలు 11:25) అన్న వచనము ప్రకారము ఇవ్వడం ద్వారా, సంపద మరియు ఐశ్వర్యము సమృద్ధిగా నేడు ఈ సందేశము చదువుచున్న మీ కుటుంబంలోనికి ప్రవేశిస్తుంది మరియు మీకు ఏ మేలును కొదువై ఉండదు. మీరు ఇప్పటి వరకు దేవుని హస్తాల నుండి పొందుకొని యున్న మేలులన్నిటిని మీరు లెక్కించలేనంత రీతిలో ఉన్నట్లు మీరు తలంచినట్లయితే, ఖచ్చితముగా మీరు దేవునికి ఇవ్వాలనుకుంటారు! కాబట్టి, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు ప్రభువునకు ఇచ్చు సమయము లేక డబ్బు కానీ, ఏదైన సరే, మీరు దేవునికి ఇచ్చిన దానిని రెండంతలుగా విస్తరింపబడుతుంది. కాబట్టి, దేవునికి ఇవ్వండి, అత్యధికమైన మేలులను తిరిగి పొందుకొని ప్రభువునందు సంతోషించండి. ఉత్సాహముగా ఇచ్చు మిమ్మల్ని ప్రేమించే దేవుడు, మీకు కొలతలేకుండా విస్తారముగా ఇచ్చి, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు.

Prayer:

కృపాకనిరకములు గల దేవా, దీవెనలకు పాత్రుడవైన మా తండ్రీ,
 
దేవా! నీవు మా జీవితములో చేసిన మేలులకు మేము నీకు కృతజ్ఞులముగా ఉండుటకు మాకు అటువంటి కృపను దయచేయుము. నీ ప్రసన్నత ఎల్లవేళల యందు మేము పొందునట్లు మాలోనికి రమ్ము. మేము నీ కానుకలిచ్చుటకు మా హృదయములను తెరువుము. మాకు కలిగిన లేమిలోను, కలిమిలోను నీకిచ్చుటకు మాకు నేర్పుము. పై చెప్పబడిన వ్యక్తుల వలె మేము కూడ మాకు కలిగినదానిలో నుండి నీ రాజ్యమును కట్టుటకు సహాయము చేయుము. ఉత్సాహముగా ఇచ్చే ధారాళమైన హృదయమును మాకు దయచేయుము. నీకిచ్చుట ద్వారా మేము సమస్త మేలులను పొందుకొనుటకు మాకు అటువంటి గొప్ప ధన్యతను దయచేయుము. మేము నీకిచ్చుట ద్వారా మా హృదయమును సంపూర్ణ మేలులతోను, సమృద్ధితోను నింపుము. మా జీవితములోని అవసర త లను తీర్చి, మేము ఇచ్చినదానికి కొలతలేకుండా విస్తారముగా మాకు దయచేయుమని మా రక్షకుడవైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

For Prayer Help (24x7) - 044 45 999 000