Loading...

మిమ్మును గూర్చి చింతించే దేవుడు!

Bro. D.G.S Dhinakaran
06 Feb
నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు అనేక  కార్యములను గూర్చి చింతించుచుండవచ్చును. అయితే మన ప్రభువు మిమ్మును గూర్చి చింతించుచున్నాడని మీరు మరచిపోకండి. కారణము, ఆయన మిమ్మును ఆదుకునే దేవుడు. కాబట్టి, నేడు మీ చింతలను దేవుని మీద మోపినప్పుడు ఆయన మిమ్మల్ని ఆదుకుంటాడు. అంతమాత్రమే కాదు, మన భారాలను, చింతలను దేవుని మీద మోపకుండా, మనమే వాటిని భరిస్తాము. మీ సమాధానమునకు నాశనము కలిగించే అనేక విషయాలు ఉండవచ్చును మరియు మీరు నిద్రలేని రాత్రులు ఎన్నో కలిగియుండవచ్చును. అయితే, చిన్న మరియు పెద్ద విషయాలకు ‘ ఆందోళన ’ అనునది ఒక పెద్ద నీడ వలె మిమ్మల్ని వెంబడిస్తుందని గుర్తుంచుకోండి. మీ జీవిత పరిస్థితులను తన ఆధీనములో ఉంచుకొనుటకు దేవుడు సమర్థుడు. ఈ కారణంగా, ‘‘ ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తును ఆయన మీద వేయుడి ’’ (1 పేతురు 5:7) అన్న వచనము ప్రకారము కాబట్టి, చింతించడం విడిచిపెట్టి, ప్రార్థన ద్వారా యేసు వైపు మీ దృష్టిని మరల్చండి. ఎందుకంటే, ఆయన ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడు. మీ ప్రార్థనలకు తప్పకుండా ఈనాడు జవాబిస్తాడు.

మిన్నెసోటాలో, 1876 వేసవిలో, మిడతల సమూహాలు వచ్చి పంటలను నాశనం చేశాయి. కానీ, అదే వేసవి కాలము మరల వచ్చినప్పుడు, మిడతలు తిరిగి వస్తాయన్న భయం వారిలో ఉండెను. అందువలన, ప్రతి స్త్రీ మరియు పురుషులు, చిన్న బిడ్డలందరు కూడ, ప్రతి ఒక్కరు దేవుని కాపుదల కొరకు విజ్ఞాపనము చేయమని గవర్నర్ జాన్ ఎస్. పిల్స్‌బరీ 1877 ఏప్రిల్ 26 తేదీన ఉపవాస ప్రార్థన దినాన్నిగా ప్రకటించాడు. నియమించబడిన రోజు వచ్చినప్పుడు, ఆ రాష్ట్రములో ఉన్న పాఠశాలలు మరియు వ్యాపారాలు మూసివేయబడ్డాయి మరియు దేవునితో వారు సహవాసము కలిగి యుండాలని ప్రజలు దైవిక ప్రసన్నత కొరకు ప్రార్థించారు. మరుసటి రోజు అనుకోని రీతిగా, వాతావరణము వెచ్చగా ఉండుటకు ప్రారంభమైంది. ఇది వసంతకాలం కంటెను, వేసవి కాలమువలె ఉండెను. మూడు రోజుల వెచ్చని వాతావరణం ద్వారా మిడత లార్వా పొదిగి, మిడతల సమూహము ఎక్కవై ఎగురుచుండెను. అప్పుడు వారి ప్రార్థన మరియు ఉపవాసాలకు దేవుడు ఎందుకు జవాబు ఇవ్వలేదని ప్రజలందరు ఆశ్చర్యపోయారు. అయితే, నాల్గవ రోజు ఉష్ణోగ్రత అకస్మాత్తుగా తగ్గిపోయినది. మిన్నెసోటా రాష్ట్రమంతయు మంచు తుఫానులో మునిగిపోవుట చేత మిడతలన్నియు ఎగిరిపోయినవి.  తద్వారా వారు ఆనందాన్ని పొందుకున్నారు.
నా ప్రియులారా, ప్రార్థనలు ఆలకించే దేవుని ఆశ్చర్యకరమైన మార్గములు ఎవరినైనా ఆశ్చర్యపరుస్తుంది. ఇది ఒక రాజు లేదా పిల్లల లేక ప్రజలందరి ప్రార్థన అయినను, ఆకాశమును భూమిని సృష్టించిన సృష్టికర్త ప్రతి ఒక్కరి విజ్ఞాపన ప్రార్థనలకు జవాబు ఇచ్చుట ద్వారా వారు ఎంతో ఆనందించారు. కాబట్టి, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు ఇప్పటికి మీ సమస్యలపై ఎందుకు చింతించుచున్నారు? అత్యధికమైన కోరికల ద్వారా భారం ఎక్కువై తడబడకండి. మీ చింతలన్నిటికి ఒక ముగింపునకు దైవిక మార్గము యేసు మాత్రమే. కనుకనే, మీ భారము దేవుని మీద మోపాలని బైబిల్‌లో ఒక చక్కటి వాగ్దానము తెలియజేయబడియున్నది, ‘‘  నీ భారము యెహోవా మీద మోపుము ఆయనే నిన్ను ఆదుకొనును నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు ’’ (కీర్తనలు 55:22) అన్న వచనము ప్రకారము నేడు దేనికిని కదిలింపబడకుండా ఉండాలంటే, ఈ సందేశము చదువుచున్న మీరు మీ భారమును మరియు చింతలను ప్రభువుపై వేయడానికి మీ హృదయం సిద్ధంగా ఉన్నదా? ఆయన మిమ్మల్ని ప్రేమించుచున్నాడు. గనుకనే దేవుని యొక్క సంరక్షణ ద్వారా మీ జీవితంలో ప్రతి క్లిష్టమైన పరిస్థితులను మీ నుండి తొలగింపజేయుటకు ఎల్లప్పుడూ మీతో కూడ ఉంటానని వాగ్దానము చేయుచున్నాడు. అందుకే బైబిలేమంటుందో చూడండి, ‘‘ నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నానని...చెప్పెను ’’ (మత్తయి 28:20) అన్న వచనము ప్రకారము మీ చింతలన్నిటిని తొలగించుటకు ఆయన మీతో కూడ సదాకాలము ఉంటాడు. నిజానికి మీరు ఈ లోకములో అనేక సమస్యలను, వ్యాధులను ఎదుర్కొంటున్నారన్న వాస్తవాన్ని ఎవరు తిరస్కరించలేరు. అయితే, మన ప్రభువైన యేసు మీ జీవితములో మీకు ఇవ్వబడిన వాగ్దానము ప్రకారము మీకు సమస్యలను కలిగించే అపవాది మీద మీకు విజయమును కలిగిస్తాడు. మీ జీవితము జయజీవితముగా మారునట్లు చేస్తాడు. అందువలన, మీరు ఆనందించండి, మీరు ఆనందించాలంటే, మీ చింతయావత్తును దేవుని మీద మోపండి, మిమ్మును గురించి చింతించే దేవుడు మీ పట్ల జాగ్రత్త వహించి, మిమ్మును ఆనందింపజేస్తాడు.
Prayer:
ప్రేమాకనికరముగల మా పరలోకపు తండ్రీ,
 
ఇతరులపై మా నమ్మకమును వుంచకుండ ఎల్లప్పుడు నీ యందు నమ్మికయుంచుటకు సహాయము చేయుము. మా చింతయావత్తును నీపై వేయుటకు మాకు నేర్పించుము. విశ్వాసములో ఎదుగుటకు శక్తిననుగ్రహించుము. ఎటువంటి సమయములోను మమ్మును విడువవని మేము విశ్వసించుచున్నాము. సదాకాలము మాతో కూడ ఉండుటకు కృపను దయచేయుము. ఎటువంటి క్లిష్ట పరిస్థితులలో కూడు మేము నీకు సమీపముగా నుండుటకును, నీలో ఎదుగుటకును మాకు అట్టి కృపనిమ్ము. మా సమస్త భారములన్నిటిని నీ మీద మోపుటకు మాకు సహాయము చేయుము. దేవా, మేము మోయుచున్న భారములన్నిటిని మా నుండి తొలగించి, మాకు విశ్రాంతిని కలుగజేయుమని రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

For Prayer Help (24x7) - 044 45 999 000