Loading...
Dr. Paul Dhinakaran

వ్యర్థమైన మాటలు మానీ, మీ విలువైన సమయాన్ని దేవునికివ్వండి!

Dr. Paul Dhinakaran
07 Jun
నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు విస్తారమైన మాటలు మాట్లడకుండా, మీ పెదవులను మూసికొనవలెనని దేవుడు మీ పట్ల కోరుచున్నాడు. అందుకే బైబిలేమంటుందో చూడండి, " విస్తారమైన మాటలలో దోషముండక మానదు తన పెదవులను మూసికొనువాడు బుద్ధిమంతుడు '' (సామెతలు 10:19) అన్న వచనము ప్రకారము అప్రయోజనకరమైన మాటలకు వ్యతిరేకంగా బైబిల్ మనలను హెచ్చరిస్తుంది. ఇంకను, " దుష్టుల ఆలోచనచొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు '' ( కీర్తనలు 1:1,2) అన్న వచనముల ప్రకారము విస్తారమైన మాటలు మాట్లాడకుండా, దేవుని వాక్యమును ధ్యానించండి. ఇతరులు మాట్లాడే లేదా చేసే పనులను మనం ఎగతాళి చేసినప్పుడు అది దేవుని ఆనందింపజేయదు. సరదాగా ప్రజలను పట్ల ఆనందించడం దేవుని నొప్పించినవారమౌతాము. బైబిల్‌లో చూచినట్లయితే, " అంత్య దినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి, తమ స్వకీయ దురాశలచొప్పున నడుచుకొనుచు, ఆయన రాకడను గూర్చిన వాగ్దాన మేమాయెను? పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభముననున్నట్టే నిలిచియున్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలిసికొనవచ్చును '' (2 పేతురు 3:3) అన్న వచనము ప్రకారము మనము చివరి రోజుల్లో ఉన్నప్పుడు అపహాస్యం చేయడం ఎంతో పొగడదగినది కాదు. ప్రజలు కనిపించే తీరు మరియు అనేక ఇతర విషయాలను అపహాస్యం చేస్తుంటారు. ఇవన్నీ దేవుని హృదయాన్ని దుఃఖింపజేస్తాయి. అందుకే దేవుడు ఇలా అంటున్నాడు, " కృతజ్ఞతావచనమే మీరుచ్చరింపవలెను గాని మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు; ఇవి మీకు తగవు ''(ఎఫెసీయులకు 5:4) అన్న వచనము ప్రకారము దేవుడు ఇలా అంటున్నాడు, నేడు ఈ సందేశము చదువుచున్న మీ నోటి నుండి ఎటువంటి అవినీతి మాటలు రాకూడదు, అయితే, మీ మాటలు ఏలాగున ఉండాలో బైబిల్‌లో చూడండి, " వినువారికి మేలు కలుగునట్లు అవసరమునుబట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూలవచనమే పలుకుడి గాని దుర్భాషయేదైనను మీ నోట రానియ్యకుడి '' (ఎఫెసీయులకు 4:29) అన్న వచనము ప్రకారము నేడు ఈ సందేశము చదువుచున్న మీ నోటి మాటలు వినువారికి మేలు కలుగునట్లుగా, అవసరమునుబట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూలవచనమే పలుకవలెను.

కొన్నేళ్ల క్రితం న్యూజిలాండ్‌లో ఒక విమానం విషాదకరంగా కూలిపోయినది. అగ్నిపర్వతం బ్రద్దలు కావడం వలన దీని ద్వారా 257 మంది మరణించారు. ఆ అగ్నిపర్వతం పైభాగంలో ఉన్న ఆటోమేటిక్ హెచ్చరిక పరికరం మూడుసార్లు హెచ్చరిక సిగ్నల్‌ను స్పష్టంగా తెలియజేసినది. నాల్గవసారి, దాని హెచ్చరిక పైలట్ల తేలికగా తీసుకొనుట ద్వారా ఆ విమానము ప్రమాదమునకు గురియైనది. దాని ఫలితంగా, విమానం అగ్నిపర్వతంపైకి దూసుకెళ్లుట ద్వారా అందరు మృతి పొందునట్లు కారణముగా ఉండెను. ఆ సమయానికి పైలట్ మాత్రమే హెచ్చరిక సిగ్నల్‌కు జాగ్రత్త పడియున్నట్లయితే, ఆ అమాయకమైన ప్రయాణికుల ప్రాణాలు కాపాడబడి ఉండేవి. అయ్యో! వారి నిర్లక్ష్యము ద్వారా ఇంత ప్రమాదము జరిగినది. అంతా నాశనమై పోయినది.
అవును నా స్నేహితులారా, అప్రయోజనకరమైన మాటలు, అనవసరమైన వ్యాఖ్యలు మరియు వ్యర్థమైన పుకారులు పుట్టించడము అవి మనకు హానికరం. ఈ ప్రశ్నలకు మీరే సమాధానం ఇవ్వడానికి ఈ రోజు సమయంను కేటాయించండి. ప్రతిరోజు, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు ప్రభువుతో ఎలా గడుపుచున్నారు? నేడు ఈ సందేశము చదువుచున్న మీరు పరిహాసపు మాటలు, వ్యర్థమైన పుకారులు లేదా ఇతరులతో పనికిరాని సంభాషణలకు సమయం వృధా చేస్తున్నారా? గుర్తుంచుకోండి! ఈ ఫలించని మాటల ద్వారా, సాతాను మీ జీవితంలోనికి నిశ్చయంగా ప్రవేశిస్తాడు. అప్పుడు, మీరు ఆయనతో కలిగియున్న సహవాసమునకు ప్రతిఫలం, మీరు యేసు వెనుక భాగాన్ని మాత్రమే కలిగి ఉంటారు. కాబట్టి, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు మీ సమయాన్ని ప్రభువుతో ఉపయోగకరంగా గడపడానికి సమయం దొరికినప్పుడల్లా మరియు ఆయనతో, మీ కుటుంబంతో మరియు దైవజనులతో సహవాసం కలిగి జీవించండి. ఈ విలువైన సమయం నిశ్చయముగా మిమ్మల్ని మంచి వ్యక్తులనుగా మారుస్తుంది. కాబట్టి, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు విస్తారమైన మాటలు మాట్లాడకుండా, మీ పెదవులను మూసికొని, మీ విలువైన సమయమును దేవునికి సమర్పించినట్లయితే, నిశ్చయముగా, ఆయన మీ జీవితాల పట్ల ఆనందించి, మిమ్మల్ని ధన్యులనుగా మారుస్తాడు.
Prayer:
కృపకు పాత్రుడవైన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ,

మేము ఇంతవరకు వ్యర్థమైన మాటలు మాట్లాడినట్లయితే, నేడు మమ్మల్ని క్షమించుమని వేడుకొనుచున్నాము. మా నోట నుండి బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకుండ, కృతజ్ఞతావచనమే మేము ఉచ్చరించునట్లు మాకు సహాయము చేయుము. అంతమాత్రమే కాదు, వినువారికి మేలు కలుగునట్లు అవసరమునుబట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూలవచనమే మా నోట నుండి పలుకునట్లు చేయుము. గానీ, దుర్భాషయేదైనను మా నోట రానియ్యకుండా మానోటి మూసుకొనునట్లు గొప్ప కృపను దయచేయుము. ఇంకను ఎటువంటి పుకార్లు పుట్టించకుండా, నీ పరిశుద్ధాత్మ మమ్మల్ని నింపాలనియు మరియు విస్తారమైన మాటలు మాట్లాడకుండా మా పెదవులను కాపాడుకోవాలని మేము ప్రార్థించుచున్నాము. మా మాటలు ఇతరుల జీవితాలకు ఉప్పు వేసినట్లుగా ఉండునట్లు చేయుము. విరిగిన హృదయాలకు మా నాలుక ఔషదము వలె ఉండునట్లు చేయుమని సమస్త స్తుతి ఘనత మహిమ నీకే చెల్లించుచు యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

For Prayer Help (24x7) - 044 45 999 000