Loading...
Stella dhinakaran

శ్రమలో నుండి మిమ్మల్ని రక్షించే ప్రభువే మీ దాగు చోటు!

Sis. Stella Dhinakaran
01 Nov
నా ప్రియులారా, నేడు నూతన మాసములోనికి అడుగిడిన మిమ్మల్ని శ్రమలో నుండి విడిపించాలని ప్రభువు మీ పట్ల కోరుచున్నాడు. దేవుడు గత పది మాసములుగా మీకు కావలసిన దీవెనలను కుమ్మరించియున్నాడు. ఆయన మిమ్మల్ని మరియు మీ కుటుంబాన్ని రక్షించియున్నాడు మరియు తన రెక్కల క్రింద మిమ్మల్ని సురక్షితముగా ఉండునట్లుగా దాచియున్నాడు. ఇంకను ఆయన మీ ప్రతి అవసరమును తీర్చియున్నాడు. కాబట్టి, మీ జీవితములో ఆయన చేసిన మేలులను బట్డి, మీ ఆత్మ, శరీరము మరియు జీవముతో మీరు ఆయనను ఎందుకు స్తుతించకూడదు? ఈ నవంబరు నూతన మాసములోనైన మీరు దేవుని వైపు చూస్తూ, " ప్రభువా, నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు; విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు '' (కీర్తనలు 32:7) అని ఆయనకు ప్రార్థించండి. అప్పుడు ప్రభువు మీకు ఆశ్రయముగాను ఉంటూ, మీ దగ్గరకు ఎటువంటి హాని వచ్చుటకు అనుమతించడు. " మేఘచ్ఛాయ వలన ఎండ అణచి వేయబడునట్లు బలాత్కారుల జయకీర్తన అణచివేయబడును. కాబట్టి బలిష్ఠులైన జనులు మిమ్మల్ని ఘనపరచునట్లుగా, భీకర జనముల పట్టణస్థులు మీకు భయపడునట్లు దరిద్రులకు కలిగిన శ్రమలో వారికి శరణ్యముగాను గాలివాన తగులకుండ ఆశ్రయముగాను వెట్ట తగుల కుండ నీడగాను ఉంటివి '' (యెషయా 25:3-5) అన్న వచనముల ప్రకారము, మీకు ఈ నెలంతయు అపవాది శ్రమలు కానీ మరియు ఎటువంటి వెట్ట తగుల కుండా మీకు నీడగాను మరియు ఆశ్రయముగా ఉంటాడు.

1875 వ సంవత్సరములో, ఇరా సాంకే, డెలావేర్ నది స్టీమ్బోట్లో ప్రయాణిస్తున్నప్పుడు, కొంతమంది ప్రయాణికులు అతడు గొప్ప గాయకుడు అని గుర్తించారు. ఎందుకంటే, అతడు ప్రసిద్ధగాంచిన సువార్తికుడైన డి.ఎల్. మూడీ గారి పాటల బృందములో నాయకుడుగా ఉండెను. అయితే, వారు తాను పాడిన పాటలలో ఒక పాటను పాడమని అతనిని కోరారు. కానీ, సాంకే దానిని పాడకుండా, విలియం బి.బ్రాడ్బరీ యొక్క పాటలలో ఒక పాటను పాడటానికి ఇష్టపడ్డాడు, ' గొఱ్ఱెల కాపరిలా మా రక్షకుడు మమ్మల్ని నడిపిస్తాడు ' అని పాడాడు. అతను పాడేటప్పుడు, మరొక పాటలోని ఒక చరణం ఇలాగున ప్రారంభమైంది, ' మేము నీవారము; నీవు మాతో స్నేహం చేస్తావా? మా మార్గమునకు సంరక్షకుడిగాను మరియు కాపరిగా ఉండి మమ్మల్ని నడిపించుము ' అనే పాటను అతడు పాడి పూర్తి చేయగానే, ఒక వ్యక్తి అతని యొద్దకు వచ్చి, 1862 లో యూనియన్ ఆర్మీలో ప్రకాశవంతమైన వెన్నెల రాత్రిజామున మీరు ఎప్పుడైనా పని చేసియున్నారా? అని అడిగాడు. అందుకు, సాంకేగారు ఎంతో ఆశ్చర్యముతో ' అవును, నేను కూడ అందులో పని చేశాను అని జవాబిచ్చారు. ' అందుకు అతడు, నేను కూడ సమాఖ్య సైన్యములో పనిచేస్తున్నాను అని చెప్పాడు. మీరు అధికారములో నిలువబడి ఉండడాన్ని నేను చూసినప్పుడు, ' ఇక ఇతడు ప్రాణముతో ఉండకూడదు ' అని తలంచి, నేను నీడలో నిలబడి, పూర్తిగా దాగుకొని, నేను నా చేతితో తుపాకీని పైకెత్తి మిమ్మల్ని కాల్చుటకు గురిపెట్టాను. కానీ, అర్థరాత్రి వెన్నెల జామున చంద్రుని పూర్తి కాంతి మీపై పడుతుంది. ఆ క్షణంలోనే, మీరు ఆకాశము వైపు చూస్తూ, మీ కళ్ళు పైకెత్తి పాడటం ప్రారంభించారు. ।ఒక క్షణం క్రితం, ' నేను అతనిని వెనుక నుండి కాల్చగలను. అతడు నాకు బలిగా మారతాడు. నా తుపాకీ అతన్ని గురి తప్పదు ' అని నాలో నేను తలంచుకున్నాను. కానీ, అప్పుడు మీరు పాడిన పాట, మీరు ఇప్పుడే పాడిన పాట కూడ అదే. నేను ఆ పదాలను స్పష్టముగా విన్నాను, అదేమనగా, ' మేము నీవారము; నీవు మాతో స్నేహం చేస్తావా? మా మార్గమునకు సంరక్షకుడిగా ఉండుము ' అని పాడారు. ఆ మాటలు దేవునికి భయపడే నా తల్లితో ఉన్న చాలా చిన్ననాటి జ్ఞాపకాలను నాలో రేకెత్తించాయి. ఆమె నాకు చాలాసార్లు ఆ పాటను పాడి వినిపించేది. మీరు మీ పాటను పూర్తి చేసిన తర్వాత, నేను మళ్ళీ గురిపెట్టడం అసాధ్యముగా ఉండెను. అప్పుడు, నేను ' ఆ వ్యక్తిని నిశ్చయముగా మరణం నుండి రక్షించగల ప్రభువు తప్పనిసరిగా గొప్పవాడు మరియు శక్తిమంతుడై ఉండాలి ' అనుకున్నాను. తద్వారా, నేను మిమ్మల్ని కాల్చలేకపోయాను మరియు నా చేతులు వాటంతట అవే క్రింద దిగిపోయినవి అని సాంకేతో చెప్పాడు.
నా ప్రియులారా, చూడండి, శత్రువుల హృదయాన్ని కరిగించే సరైన పదాలను పాడటానికి దేవుడు అతన్ని ఎంత చక్కగా నడిపించాడు కదా! స్నేహితులారా, మీరు కూడ మీ శత్రువులను మరియు వ్యాధి బాధలను చూచి భయపడుచున్నారా? నేడు దేనికిని మీరు భయపడవద్దు. ఈ నూతన మాసమంతా, ఆయన మీకు తోడుగా ఉంటాడు, " మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు '' (కీర్తన 91:1-4) అన్న వచనముల ప్రకారము ఆయన మీకు ఏ హాని కలుగుకుండా తన రెక్కలతో మిమ్మల్ని కప్పుతాడు. " శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము నిత్యముగనుండు బాహువులు నీ క్రిందనుండును... '' (ద్వితీయోపదేశకాండము 33:27) అన్న వచనము ప్రకారం, ఈ నెలలో ప్రభువు తన చేతుల క్రింద మిమ్మల్ని దాచి, రక్షిస్తాడు మరియు మీకు ఆశ్రయం కలిగిస్తాడు. కాబట్టి, మీ దాగు చోటు మీ జీవితములో ఆయనే కావాలంటే, నేడే మీరు ఆయన యందు భయభక్తులు కలిగి, ఆయనను ఆశ్రయము ఉండుటకు మీ హృదయములోనికి ఆయనను ఆహ్వానించినట్లయితే, ఆయన మీ దాగు చోటు ఉండి, శ్రమలో నుండి మిమ్మల్ని ఆయనే రక్షించి; విమోచన గానములతో మిమ్మల్ని ఆవరించునట్లు చేసి పరవశింపజేస్తాడు.
Prayer:
మహోన్నతుడవైన మా ప్రియ పరలోకపు తండ్రీ,

నీవు మా పట్ల చూపిన ప్రేమకు మేము నీకు కృతజ్ఞతలను తెలియజేయు చున్నాము. నీవు మా పట్ల అద్భుతములను జరిగించే దేవుడవు. కాబట్టి, ఈనాడు మేము ఎదుర్కొంటున్న సమస్యలు పర్వతాలవంటివైనను సరే, గడిచిన నెలలు మరియు సంవత్సరాల్లో మేము ఎదుర్కొన్న ప్రతి అవమానం మరియు భయాన్ని నీ యెదుటకు తీసుకొని వస్తున్నాము. నీ ప్రేమ నుండి మమ్మల్ని దూరం చేయడానికి ఉద్దేశించిన ప్రతి కీడును అడ్డుకోవటానికి సాధనములుగా ఉన్న నీ యొక్క దయ కనికరమును మాపై కుమ్మరించుము. ఈ నూతన మాసములో మా యొక్క ప్రతి అవసరాన్ని తీర్చుము. ఈ రోజు నుండి మేము నీ చేతుల నుండి అద్భుతాలను పొందుకుంటామని నమ్ముతున్నాము! మమ్మల్ని మరియు మా కుటుంబమును, మాకు చెందినవన్నీయు రక్షించే నీ రెక్కల క్రింద దాచుము. నీవే మాకు ఆశ్రయం మరియు దుర్గం. ఏ అపాయము మాకు కలిగించవని మేము నమ్ముచున్నాము. నీవు మా దాగు చోటు మరియు ఆశ్రయమైన నీ రెక్కల నీడలో మాకు ఆశ్రయమును కలుగజేయుమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

For Prayer Help (24x7) - 044 45 999 000