Loading...
Paul Dhinakaran

భూలోకమందంతట దేవుని నామమును ప్రచురము చేయండి!

Dr. Paul Dhinakaran
16 Jul

నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు భూలోకమందంతట దేవుని నామమును ప్రచురము చేయునట్లుగా ఆయన మిమ్మల్ని పిలుచుచున్నాడు. బైబిలేమంటుందో చూడండి, " నా బలమును నీకు చూపునట్లును, భూలోకమందంతట నా నామమును ప్రచురము చేయునట్లును ఇందుకే నేను నిన్ను నియమించితిని '' (నిర్గమకాండము 9:16) అన్న వచనము ప్రకారము మీరు దేవుని సువార్తను ప్రకటించాలని ఆయన మీ పట్ల కోరుచున్నాడు. కాబట్టి మీరు ఆయన పిలుపునకు లోబడండి, దీవెనలు పొందండి. 

బైబిల్‌లో యోసేపును గూర్చి మనము చదివినట్లయితే, యోసేపు అను అతడు నిరుత్సాహముగాను మరియు మతిచలించినవానిగా ఉండటానికి అనేక కారణాలు ఇవ్వబడినవి. దేవుడు ఇచ్చిన వాగ్దానముల మీద నమ్మకము ఏలాగుంటుందనగా, ఒక వ్యక్తి చీకటి సమయాలలో దేవునికి చాలా దగ్గరగాను మరియు చివరి నమ్మకమై యున్నట్లుగా ఉంటుంది. అయితే, యోసేపు జీవితంను చూచినట్లయితే, అతడు ఉన్నతమునకు లేవదీయబడుటకు కారణము, తాను కన్న కల మరియు దేవుడు చేసిన వాగ్దానము తర్వాతనే అతడు ఒంటరితనమును మరియు తగ్గింపును ఎదుర్కొన్నాడు. " నేను నీ కాజ్ఞయిచ్చియున్నాను గదా, నిబ్బరముగలిగి ధైర్యముగా నుండుము, దిగులుపడకుము జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును '' (యెహోషువ 1:9). దేవుడు తన బిడ్డల పట్ల చేయు వాగ్దానములన్నియు శాశ్వతమైనవిగా ఉన్నట్లయితే, అది తన సోదరులు అతడిని గోతిలో పడవేసిన తత్ఫలితంగా అతన్ని బానిసగా అమ్మిన రోజున యోసేపు పట్ల ఎందుకు కార్యము చేయలేదని ఆశ్చర్యపోవచ్చును. 

ఇంకను యోసేపు తన సోదరులు యొద్ద వేడుకొన్నప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నాడు? అతడు ఒక బానిసగా అమ్మబడినప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నాడు? రాజు అతనిపై దోషారోపణలు చేసి అతనిని చెరసాలలో ఉంచినప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నాడు? ప్రజలు అతని మరచిపోయినప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నాడు? అని మీరు అనుకొనవచ్చును. " ప్రతి కార్యములోను దేవుడు యోసేపుతో కూడనే యుండెను '' అని దీనిని మీ హృదయమను పలక మీద చెక్కుకొనవలెను. యోసేపు యువకుడుగా ఉన్నప్పుడు తండ్రిచేత ప్రేమించబడి మరియు తన తోబుట్టువుల చేత ద్వేషించబడ్డాడు. దేవుడు యోసేపు జీవితములో సరైన సమయములో తన వాగ్దానమును నెరవేర్చుటలోను మరియు కార్యసిద్ధికలుగ జేయుటలోను తెరవెనుక మౌనముగా చూస్తూ యుండెను. ఆ సమయములో యోసేపును ఎవరును ప్రేమించలేదు మరియు అంగీకరించను కూడ లేదు. నా ప్రియులారా, కొన్నిసార్లు మిమ్మల్ని ద్వేషించిన వ్యక్తులే మీ లక్ష్యమునకు మిమ్మల్ని నెట్టివేస్తారు. దేవుని బిడ్డగా ఉన్న మిమ్మల్ని, తన చేతులతో మోసుకెళ్లడం ద్వారా తన సంరక్షణలో నిరంతరము మీరు ఆయనతో ఉండండి. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగినవాడు. కాబట్టి, ఒకరోజు, సంక్షోభం ప్రారంభానికి ముందే ఐగుప్తు దేశములో రాబోయే కరువునకు పరిష్కారం చూపమని దేవుడు యోసేపునకు తెలియజేసెను. ఒకానొక సమయములో చెరసాలలో శిక్షను అనుభవించిన అదే స్థలములో దేవుడు ఐగుప్తు దేశమునకు అతనిని అధిపతిగా నియమించెను. 
 

నా ప్రియులారా, దేవుని మహిమను బయలుపరచుట కొరకే ఆయన బలహీనులను మరియు దీనులను ఎనుకుంటాడు. యోసేపు ఐగుప్తులో బానిసగా ఉండెను. అయితే, దేవుడు తన మహిమను బయలుపరచు నిమిత్తము అతనిని ఎన్నుకొనెను. ఈనాడు మీరు అందరి చేత తిరస్కరించబడి యున్నారా? మీరు ఆనాధలుగా ఉన్నారని తలంచుచున్నారా? చదువులో మరియు ఉద్యోగంలో మీరు ఉన్నత స్థానానికి చేరుకోలేని స్థితి, ప్రతిరోజు మిమ్మల్ని సిగ్గుపరచేలా చేయుచున్నదా? లేక పాపపు అలవాట్లు మరియు దురవ్యసనం యొక్క తాడు ఉచ్చువలె మీ మెడకు చుట్టబడియున్నదా? మీరు మానసిక ఒత్తిడి లేదా నిరాశ నిస్ప ృహ లోయలో పడియున్నారా? భయపడకండి, ఈనాడు సర్వశక్తిమంతుడైన దేవుడు అట్టి మిమ్మల్ని చూచి, " నా బలమును నీకు చూపునట్లును, భూలోకమందంతట నా నామమును ప్రచురము చేయునట్లును ఇందుకే నేను నిన్ను నియమించితిని '' అన్న వచనము ప్రకారము ఆయన నామ మహిమ కొరకు దేవుడు నేడు ఈ సందేశము చదువుచున్న మిమ్మల్ని ఉన్నత స్థానమునకు హెచ్చిస్తాడు. ఇతరుల యెదుట మిమ్మల్ని ఉన్నత స్థానమునకు హెచ్చించడానికి ఆయన మీలోనికి ప్రవేశించిన ఆ క్షణమే, మీ గాయాలన్నియు అదృశ్యమవుతాయి, మీరు ఆనందంగా ఉండండి. యోసేపు వలె దేవుడు మిమ్మల్ని దీవించును గాక.
Prayer:
సర్వశక్తిమంతుడవైన మా ప్రియ పరలోకపు తండ్రీ, 

నిన్ను స్తుతించుటకు ఇచ్చిన గొప్ప కృపను బట్టి నీకు స్తోత్రములు. దేవా, ఈ లోకములో యోసేపు వలె మేము అందరి చేత తృణీకరింపబడియున్నాము. అందరి యెడల మేము అవమాన భరితులముగాను మరియు నిందాస్పాదులముగా ఉన్నాము. నేడు మా జీవితములో నీవు చేసిన వాగ్దానములను నెరవేర్చుటకు సమర్థుడవై యున్నాము. కాబట్టి, దయతో ఈనాడు మేము తగిన సమయములో హెచ్చింపబడుటకు నీ బలిష్టమైన చేతి క్రింద దీనమనస్కులై జీవించునట్లు మాకు అటువంటి హృదయమును దయచేయుము. మేము యోసేపు వలె నీ వాగ్దానముల యందు నమ్మిక యుంచి, నీ మాటకు లోబడి జీవించునట్లు మాకు సహాయము చేయుము. దేవా, నీ బలమును మాకు చూపునట్లును, భూలోకమందంతట నీ నామమును ప్రచురము చేయునట్లును మమ్మల్ని నియమించినందుకై నీకు వందనాలు చెల్లిస్తూ, సమస్త స్తుతి ఘనత నీకే చెల్లించుచు యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్. 

For Prayer Help (24x7) - 044 45 999 000