Loading...
Dr. Paul Dhinakaran

మీపై ఆశీర్వాదపు జల్లులను కురిపిస్తాడు!

Dr. Paul Dhinakaran
19 Oct
నా అమూల్యమైన స్నేహితులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీ జీవితములో తగిన కాలమందు ఆశీర్వాదపు జల్లులను కురిపిస్తానని దేవుడు మీ పట్ల వాగ్దానము చేయుచున్నాడు. అందుకే దేవుడు ఇలా అంటున్నాడు, " మీ వర్షకాలములలో మీకు వర్షమిచ్చెదను, మీ భూమి పంటల నిచ్చును, మీ పొలములచెట్లు ఫలించును '' (లేవీయకాండము 26:4) అన్న వచనము ప్రకారము ఈ రోజు మీకు ఇవ్వబడిన ఇది దేవుని వాగ్దానం మరియు ఆశీర్వాదం. మీరు కరువులో ఉన్నారా? మీరు ఆశీర్వదింపబడకుండా బాధపడుతున్నారా? అటువంటి మిమ్మల్ని చూచి, దేవుడు ఇలా అంటున్నాడు, " నా బిడ్డా, మీ మీద వర్షాన్ని పంపడానికి ఇది సరైన సమయం.'' దేవుడు ఋతువులకు తగిన సమయాన్ని నియమించాడని బైబిలు చెబుతోంది, " ఈ భూమి మీద ప్రతిదానికి సమయము కలదు. ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. పుట్టుటకు, చచ్చుటకు; నాటుటకు నాటబడినదాని పెరికివేయుటకు, చంపుటకు బాగుచేయుటకు; పడగొట్టుటకు కట్టుటకు; '' (ప్రసంగి 3:1,2) అన్న వచనముల ప్రకారము ఈ భూమి మీద ప్రతిదానికి ఒక సమయము కలదు. నీతిమంతులపై, అన్యాయమైన వారిపై దేవుడు వర్షాన్ని పంపుతున్నాడని కూడా ఈ వాక్యము చెబుతుంది. " ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి, నీతిమంతుల మీదను, అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు '' (మత్తయి 5:45) అన్న వచనము ప్రకారము ఆయన తన సూర్యుడిని చెడ్డవారి మీద మరియు మంచి వారి మీద ఉదయించేలా చేయుచున్నాడు. అంతమాత్రమే కాదు, ఆయన, " నేను మీకు ఆశీర్వాదాల వర్షాన్ని పంపుతాను అని దేవుడు సెలవిచ్చుచున్నాడు. '' ఆ ఆశీర్వాదాలు మీపై ఎల్లప్పుడు నిలిచి ఉంటాయి. ఇందు కోసం యేసు వర్షంలా, నదిలా ప్రవహించునంతగా సిలువలో తన రక్తాన్ని చిందించాడు. యేసు రక్తం మీ పక్షమున మంచి పలుకులనే పలుకుతుంది. కాబట్టి, ధైర్యంగా ఉండండి.
 
బైబిల్‌లో చూచినట్లయితే, యెహెజ్కేలు 34:26 లో ఇలా చెబుతుంది, " వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చేయుదును. ఋతువుల ప్రకారము వర్షము కురిపించెదను, దీవెనకరమగు వర్షములు కురియును.'' అవును, దేవుడు నేడు ఈ సందేశము చదువుచున్న మిమ్మల్ని ఆలాగుననే ఆశీర్వదిస్తాడు. ఆయన మీ చుట్టుపట్ల ఉన్న స్థలములను కూడ విస్తారమైన పంటతో దీవిస్తాడు. అదియుగాక, ఋతువుల ప్రకారము సరైన సమయములో వర్షములను కురిపిస్తాడు. మనము బైబిల్‌లో యోవేలు 2:23 లో చదివినట్లయితే, " సీయోను జనులారా, ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి; తన నీతినిబట్టి ఆయన తొలకరి వర్షమును మీకనుగ్రహించును, వాన కురిపించి పూర్వమందువలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకనుగ్రహించును '' అన్న వచనము ప్రకారము దేవుడు మీ జీవితములో ఆశీర్వాదపు జల్లులను తగిన సమయమందు కురిపిస్తాడు. అంతమాత్రమే కాదు, తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకనుగ్రహించును.
నా ప్రియులారా, సాధారణంగా, తొలకరి వర్షం, విత్తడానికి ముందు భూమిని సిద్ధం చేయడానికి కురుస్తుంది. ఆ తరువాత ధాన్యం విత్తినప్పుడు, పంట పెరగడం ప్రారంభమవుతుంది, అటుపిమ్మట, కడవరి వర్షము వస్తుంది, ఇది భారీ వర్షం. ఆ జల్లులతో ధాన్యం సమృద్ధిగాను మరియు పంట పుష్కలంగాను పెరుగుతుంది. విత్తుటకు తగిన కాలమందు వర్షము మరియు పంట పెరుగుటకు కావలసిన వర్షము ఋతువుల ప్రకారము వర్షాలు సమయానికి కురుస్తాయి. అప్పుడే పంట పుష్కలంగా పెరుగుతుంది. కాబట్టి, నేడు ఈ సందేశము చదువుచున్న మీకు దీవెనకరమైన వర్షం ఎప్పుడు అవసరమో దేవునికి తెలుసు. మీకు అవసరమైనప్పుడల్లా ఆయన సరైన సమయంలో వర్షాన్ని మీ యొద్దకు పంపుతాడు మరియు మీరు దాన్ని ఎప్పటికీ కోల్పోరు. భయపడవద్దు. దేవుడు సరైన సమయానికి పంపే వర్షాల కారణముగా, మీకు లభించే విస్తారమైన పంట ద్వారా మీరు ప్రభువును స్తుతిస్తారు. ఒకవేళ నేడు ఈ సందేశము చదువుచున్న మీ జీవితములో ఆశీర్వాదపు దినములు లేవని చింతించుచున్నారా? పుష్కలమైన జీవితమును అనుభవించలేకపోతున్నారని చింతించుచున్నారా? దిగులుపడకండి, మీ జీవితాలను దేవుని చేతులకు సమర్పించుకొన్నట్లయితే, నిశ్చయముగా, మీ జీవితములో తగిన కాలమందు, వాన కురిపించి పూర్వమందువలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకనుగ్రహించి, మీ కరువు కాలములో మీకు సంతృప్తిని కలిగించి మిమ్మల్ని వర్థిల్లజేస్తాడు.
Prayer:
సర్వోన్నతుడవైన మా పరలోకమందు తండ్రీ,
 
ప్రభువా, మేము నిన్ను మరియు నీ వాగ్దానాన్ని నమ్ముచున్నాము. మాకు అవసరమైనప్పుడు సరైన సమయంలో ఆశీర్వాదపు వర్షాన్ని పంపించుమని వేడుకొనుచున్నాము. ప్రభువా, మా జీవితములో తగిన కాలమందు, వాన కురిపించి పూర్వమందువలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మాకనుగ్రహించి, మా కరువు కాలములో మాకు సంతృప్తిని కలిగించి మమ్మల్ని వర్థిల్లజేసి నీ నామమునకు ఘనత కలుగునట్లు చేయుము. సంపూర్ణమైన మరియు సంతృప్తికరమైన ఆశీర్వాపు జల్లులను పొందడానికి మాకు సహాయం చేయుము. దేవా, నీవు మమ్మల్ని చూస్తున్నావని సంతోషించటానికి మాకు సహాయం చేయుమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

For Prayer Help (24x7) - 044 45 999 000