Loading...
Dr. Paul Dhinakaran

విజయమను రక్షణ కేడెమును మీకు దయచేస్తాడు!

Dr. Paul Dhinakaran
17 Oct
నా అమూల్యమైన స్నేహితులారా, దేవుడు తన ఆశీర్వాదాలను మీపై కుమ్మరించడానికి సిద్ధంగా ఉన్నాడు, దానిని మీరు మోయలేనంతగా ఆయన మీకు ఆశీర్వాదపు జల్లులను మీ మీదికి పంపుతాడు. ఇది ఎంత గొప్ప ఆనందం కదా! ఎందుకనగా, యేసు నేడు ఈ సందేశము చదువుచున్న మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. బైబిల్ గ్రంథములో కీర్తనలు 18:35 వ వచనములో ఇవ్వబడిన నేటి వాగ్దానాన్ని ధ్యానిద్దాం, అదేమనగా, " నీ రక్షణ కేడెమును నీవు నాకందించుచున్నావు నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనెను, నీ సాత్వికము నన్ను గొప్పచేసెను '' అని బైబిల్ గ్రంథంలో చెబుతోంది. మనలను గొప్ప చేయుటకు దేవుడు సాత్వికము గలవాడై యున్నాడన్న వాగ్దానం ప్రకారం ఆయన విజయ కేడెమును మనకు దయచేస్తాడు. మరొక అనువాదంలో, ' ఇది రక్షణ కవచం ' అని చెప్పబడినది. మీకు ఈ కేడెము ఎందుకు అవసరం? నేడు ఈ సందేశము చదువుచున్న మిమ్మల్ని నాశనం చేయడానికి దుష్టుడైన సాతాను మీపై మండుచున్న అగ్ని బాణాలు పంపించడం దీనికి కారణం. మీ ఆత్మను లోపరచుకోవడానికి మరియు మీ దృష్టిని తన వైపునకు త్రిప్పడానికి అపవాది మీపై మోసపూరితమైన బాణాలను విసురుతాడు. అందుకే, నేడు దేవుడు విజయ కేడెమును మీకు అనుగ్రహించుచున్నాడు. మరియు ఈ కేడెము మీ చుట్టూ ఒక కవచంవలె ఆవరించియుంటుంది. ఈ రక్షణ కేడెమును యేసు సిలువపై సిద్ధపరచాడు. దీనినే యేసు రక్తం యొక్క కేడెము అని పిలువబడుతుంది, ఇది మిమ్మల్ని నాశనం చేయడానికి వచ్చే దుష్టత్వానికి వ్యతిరేకంగా మంచి విషయాలనే మాట్లాడుతుంది. అందుకే బైబిల్‌లో చూచినట్లయితే, " క్రొత్తనిబంధనకు మధ్య వర్తియైన యేసు నొద్దకును హేబెలుకంటె మరి శ్రేష్ఠముగ పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చియున్నారు '' (హెబ్రీయులకు 12:24) అన్న వచనము ప్రకారము మీ ఆత్మలను నశింపజేయుటకు పంపబడిన అపవాది ఒత్తిడిలను నాశనము చేయుట కొరకే యేసుక్రీస్తు రక్తము మంచిమాటలనే పలుకుతుంది.
 
నా ప్రియులారా, అపవాది అబద్దికుడు. ఇంకను, అపవాది అబద్ధాలకు జనకుడు. అందుకే అనేకసార్లు అపవాది, మిమ్మల్ని చూచి, " దేవుడు నిన్ను పట్టించుకోడు మరియు దేవుడు నిన్ను ప్రేమించడు అని '' అపవాది ఎల్లప్పుడు అబద్ధాలు పలుకుతుంటాడు. ఇంకను దేవుని శక్తి కంటే, మీ శక్తి ఎంతో ఎక్కువ అని, ఆయన మిమ్మల్ని అర్థం చేసుకోలేడనియు మరియు కొన్నిసార్లు, దేవుని కోసం ఎదురుచూడకుండా మరియు దేవుని ప్రేమను విశ్వసించకుండా మీ ఆత్మను కోల్పోయేలా చేస్తాడు. అయితే, లోకములో ఉన్నవానికంటె మీలో ఉన్నవాడు గొప్పవాడనియు వాక్యము స్పష్టముగా తెలియజేయుచున్నది. అవును! అందువలన, ప్రభువు మీకు రక్షణ కేడెమును అనుగ్రహించుచున్నాడు. మరియు యేసుక్రీస్తు రక్తమును గురించి పరిశుద్ధాత్మ మంచి పలుకులనే మాట్లాడుతుంది, ఇది మీ జీవితంలో మంచి కార్యాలను బయటకు తీసుకొని వస్తుంది. తద్వారా, మీ ఆత్మలు రక్షించబడతాయి.
నా ప్రియులారా, అదేలాగున, బైబిల్‌లో " యెహోవా, నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు, కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు '' (కీర్తనలు 5:12) అన్న వచనము ప్రకారము దేవుని కరుణా కటాక్షము మీ మీదికి వచ్చినప్పుడు దీనిని ' కరుణా కటాక్షము ' అని పిలువబడుచున్నది. తమిళ్ బైబిల్లో దీనిని ' కారుణ్యం ' అని అంటారు. దేవుని కరుణా కటాక్షము మనలను గొప్పవారిని చేస్తుంది. అందుకే బైబిల్‌లో చూచినట్లయితే, " వారు ఎంతో క్షేమముగా ఉన్నారు, ఎంతో సొగసుగా ఉన్నారు; ధాన్యముచేత యౌవనులును క్రొత్త ద్రాక్షారసముచేత యౌవన స్త్రీలును వృద్ధి నొందుదురు '' (జెకర్యా 9:17) అన్న వచనము ప్రకారము దేవుని మంచితనం లేదా స్వాతికము, దయ, కరుణా కటాక్షము మీ మీదికి వస్తున్నప్పుడు, ధాన్యముచేత యౌవనులును క్రొత్త ద్రాక్షారసముచేత యౌవన స్త్రీలును వృద్ధి నొందుదురు అని చెప్పబడినట్లుగానే, దేవుడు ఈ కృపను మీకు అనుగ్రహించును గాక.
Prayer:
కృపకు పాత్రుడవైన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ,
 
నీ సాత్వికము మమ్మల్ని గొప్ప చేస్తుందని నీ వాక్యము చెప్పినట్లుగానే, నీ సాత్వికము చేత నేడు గొప్ప చేయుటకు మమ్మల్ని నీ దివ్య హస్తాలకు సమర్పించుకొనుచున్నాము. ప్రభువా, నీవలె మేము సాత్వికము కలిగి జీవించునట్లుగా మాకు అటువంటి హృదయమును దయచేయుము. దేవా, అపవాది ఈ లోకములో మమ్మల్ని నాశనము చేయుటకై పంపుచున్న ప్రతి అగ్ని బాణములను మా మీదికి రాకుండా, నీ రక్షణ కేడెముతో మమ్మల్ని కప్పుము. రక్షణ కేడెము, మా చుట్టు ఆవరించునట్లుగాను, మాకు విజయ కేడెమును ధరింపజేయుము. మా జీవితంలో నీ యొక్క మంచితనమును కుమ్మరించునట్లు చేయుమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

For Prayer Help (24x7) - 044 45 999 000