Loading...
DGS Dhinakaran

ప్రార్థన శక్తిచేత మీరు ఎక్కడికి వెళ్లినను విజయం మీదే!

Bro. D.G.S Dhinakaran
07 Dec
నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు ఎక్కడికి వెళ్లినను, దేవుడు మిమ్మును కాపాడుతాడు. బైబిల్లో ఆవిధంగా, కాపాడబడిన వ్యక్తులలో ఒక వ్యక్తిని చూద్దాము. " దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను '' (2 సమూయేలు 8:6) అన్న వచనము ప్రకారము, రాజైన దావీదు బైబిల్లోనే అందరికి బాగా తెలిసిన ఒక వ్యక్తి. అతని జీవితము ఎంతో బాధతోను మరియు ఎంతో ఆనందముతోను నింపబడినది. అతనికి అనేక పేర్లు కలవు: దావీదు గొప్ప విజేత, దావీదు పరిశుద్ధుడు; దావీదు మధురమైన సంగీత గాయకుడు; దావీదు మంచి కాపరి; దావీదు పశ్చాత్తాపం గల వ్యక్తి; దావీదు ఓర్పుగలవాడు; అతని జీవితము అనేకులకు ఆదర్శము; ఇశ్రాయేలీయులకు రాజు; మరియు అతని మార్గములను దేవుని యెదుట ఉంచాడు. అతడు దేవుని యందు భయభక్తులు కలిగియుండెను. కావుననే, దావీదు ఎక్కడకు పోయినను దేవుడు అతనికి విజయమును అనుగ్రహించాడు. 

ఎంతో మానసిక ఒత్తిడితో నిండిన ఒక కుటుంబము నన్ను వ్యక్తిగతంగా కలుసుకొనుటకు నా యొద్దకు వచ్చారు. " సహోదరుడా, నా భర్తగారు 2 సంవత్సరముల తరువాత పదవి విరమణ చేస్తారు. కానీ, ఇప్పుడు అధికారులు ఆయనను ఉత్తర ప్రాంతమునకు బదిలీ చేశారు. తద్వారా మేమందరము ఎంతగానో బాధపడుచున్నాము. ఆయనగారు మరల మద్రాసుకు తిరిగి వస్తే మా అందరికి ఎంతో ఆనందంగా ఉంటుంది అని ఆ సహోదరి చెప్పారు. " ఈ బదిలీ చేయడానికి ఎవరు కారకులు? '' అని నేను ఆమెను అడిగాను. ఆ వ్యక్తి దేశ నాయకుడు అని చెప్పెను. ఇది జరిగే కార్యము కష్టమైనను, వారి కోరికను తీర్చమని ఎంతో భారముగా ప్రార్థన చేశాను. ఒకరోజు, నేను ఢిల్లీకి వెళ్లాల్సిన అవసరం ఏర్పడింది. నాకు హోటల్లో అన్ని వసతులు ఏర్పాటు చేయబడినవి. అక్కడికి వెళ్లగానే నేను ఊహించని రీతిగా, ఒక మంత్రి తన భార్యతో కలిసి, నన్ను వ్యక్తిగతంగా కలుసుకొనుటకు వేచియున్నారని తెలియవచ్చినది. ఆ మంత్రి పైన చెప్పబడిన కుటుంబములో బదిలీని కోరుతున్న వ్యక్తి పనిచేస్తున్న విభాగమునకు బాధ్యతను వహిస్తున్నాడని తెలుసుకొని, ఆ మంత్రిగారిని వ్యక్తిగతంగా కలుసుకొని, బదిలీని కోరుతున్న ఆ వ్యక్తి యొక్క ధరఖాస్తును అందించాను. నేను చెప్పినట్లుగానే, అధికారికంగా, ఆ మంత్రిగారు, నాతో, " మీ మాట ప్రకారము ఒక్క గంటలో మీరు చెప్పిన ఆ వ్యక్తి మద్రాసులో ఉంటాడని హామి ఇస్తున్నానని '' చెప్పాడు. వెంటనే ఆ వ్యక్తి చెన్నైకు బదిలీ అయ్యేందుకు ఉత్తర్వులు జారిచేయబడినవి. నిజంగానే, ఆ కుటుంబము వారు ఆనందముతో మునిగిపోయారు.
నా ప్రియులారా, ప్రార్థన చేయుటకు సమయము, విరామము లేని మీ జీవితములో నేడు ఈ సందేశము చదువుచున్న మీరు ప్రతిదినము దేవుని వెదకినట్లయితే, ఆయన మీ అవసరతలన్నిటిని తీరుస్తాడు. ఎల్లప్పుడు ప్రార్థించకుండా, సోమరితనముగా కూర్చోకూడదు. దానికి బదులుగా, మీరు దేవుని వైపు చూస్తూ, ఆయన సన్నిధిని వెదకుచూ, మీ పనులలో పరిశుద్ధాత్మ నడిపింపు కొరకు ప్రార్థించండి. దావీదు ఎక్కడకు వెళ్లినను, ఎందుకు దేవుడు విజయమును అనుగ్రహించాడు? జవాబు సాధారణమైనదే, తన జీవిత కాలములో దావీదు ఎల్లప్పుడు దేవునిని వెదకాడు. దావీదు గానీ, దేవుని వెదకనట్లయితే, అతడు వ్యభిచారమునకు బానిసగా మారేవాడు. అతడు ప్రార్థనకు ప్రాముఖ్యతను ఇచ్చినందుననే, అపవాది ఉచ్చుల నుండి తప్పించబడ్డాడు. కాబట్టి, ఈనాటి నుండి, మీ జీవితములో ప్రార్థనకు ప్రాముఖ్యతను ఇవ్వండి. అప్పుడు ప్రభువు చేత మీరు ఆశీర్వదింపబడుట మాత్రమే కాదు, అపవాది శక్తుల నుండి సంరక్షించబడతారు. 
Prayer:
కృపకు పాత్రుడవైన మా ప్రియ పరలోకపు తండ్రీ, 

నిన్ను ఘనపరచుటకు మాకిచ్చిన గొప్ప తరుణమును బట్టి నీకు వందనములు చెల్లించుచున్నాము. విరామము లేని మా జీవితములో మేము ప్రార్థనకు ముఖ్యత్వమును ఇచ్చుటకు కృపను దయచేయుము. దావీదు ఏలాగున ఎల్లప్పుడు నీ సన్నిధిని వెదకాడో, ఆలాగుననే, మేము కూడ మనుష్యుల సహాయము కోరకుండా, నిన్ను నిత్యము వెదకుటకు మాకు అటువంటి హృదయమును దయచేయుము. మా జీవితములో మేము ఎదుర్కొంటున్న ఓటమిల మధ్యలో దావీదు నీయందు భయభక్తులు కలిగి జీవించు మరియు విజయాన్ని పొందుకొనినట్లుగా అటువంటి గొప్ప ధన్యతను మాకు కూడ దయచేయుము. అపవాది తంత్రముల ద్వారా మేము పాపములో పడకుండా, మమ్మును నీ కాపుదల క్రింద భద్రపరచుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్. 

1800 425 7755 / 044-33 999 000