Loading...
Paul Dhinakaran

దీర్ఘాయువు చేత మీకు తృప్తినిచ్చే జీవితం!

Dr. Paul Dhinakaran
12 May
నా ప్రియమైన మిత్రులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మిమ్మల్ని దీర్ఘావుయుచేత తృప్తిపరచాలని దేవుడు మీ పట్ల కోరుచున్నాడు. కాబట్టి, ఈ రోజు మీకు దేవుడు ఇచ్చిన వాగ్దానం బైబిల్ నుండి కీర్తనల గ్రంథము 91:16 వ వచనములో చూచినట్లయితే, " దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను నా రక్షణ అతనికి చూపించెదను '' అన్న వచనము ప్రకారము నేడు ఈ సందేశము చదువుచున్న మిమ్మల్ని దీర్ఘాయువు చేత సంతృప్తిపరిచే దేవుడు. అవును, మీరు తినే ఆహారము ద్వారా ఆయన మిమ్మల్ని సంతృప్తిపరుస్తాడు మరియు మిమ్మల్ని అద్భుతంగా నడిపించిన యెహోవా నామాన్ని మీరు స్తుతించెదరు. అందుకే బైబిలేమంటుందో చూడండి, " మీరు కడుపార తిని తృప్తిపొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు నేను పంపిన మిడుతలును గొంగళి పురుగులును పసరు పురుగులును చీడపురుగులును అను నా మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరల నిత్తును. నా జనులు ఇక నెన్నటికిని సిగ్గునొందరు '' (యోవేలు 2:25,26) అన్న వచనముల ప్రకారము మీరు కడుపార తిని తృప్తి పొందాలనియు, ఆయన మీ కొరకు వింత కార్యాలను జరిగించే దేవుని స్తుతించాలనియు మీరు ఎన్నటికిని సిగ్గునొందరనియు ఆయన మీ పట్ల కోరుచున్నాడు. కాబట్టి, ధైర్యముగా ఉండండి.

నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు దేవుని నిమిత్తము కోల్పోయిన ఆశీర్వాదములను ఆయన మీకు తిరిగి అనుగ్రహిస్తాడు. ఆయన ప్రతి ఆశీర్వాదం మీకు తిరిగి ఇవ్వడానికిని తినడానికి మరియు సంతృప్తికరంగా ఉండునట్లు చేస్తాడు. ఆయన ఎందుకు అలా చేస్తాడో మీకు తెలుసా? నేడు ఈ సందేశము చదువుచున్న మిమ్మల్ని అద్భుతంగా నడిపించిన ప్రభువు నామాన్ని మీరు స్తుతించేలా ఆయన అలా చేస్తాడు. ఆయన మిమ్మల్ని ఆశ్చర్యకార్యాలతో అద్భుతంగా నడిపిస్తాడు మరియు మీకు ఆహారం ఇస్తాడు, తద్వారా మీరు పొందుకొనే ప్రతి ఆశీర్వాదంతో సంతృప్తి చెందునట్లు చేస్తాడు. అందుకే బైబిలేమంటుందో చూడండి, " పక్షిరాజు యౌవనమువలె నీ యౌవనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు '' (కీర్తనల గ్రంథము 103:5) అన్న వచనములో ఈలాగున చెబుతుంది. అదేమనగా, మీ హృదయ కోరికలను మేలులతో సంతృప్తిపరిచేవాడు, తద్వారా పక్షిరాజు వలె మీ యవ్వనం పునరుద్ధరించబడుతుంది. దేవుడు సమస్త మేలులతో మిమ్మల్ని సంతృప్తిపరుస్తాడు. అంతమాత్రమే కాదు, " అతిశ్రేష్ఠమైన గోధుమల ననుగ్రహించి నేను వారిని పోషించుదును కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును '' (కీర్తనల గ్రంథము 81:16) అన్న వచనము ప్రకారము అతిశ్రేష్ఠమైన గోధుమల ననుగ్రహించి ఆయన మిమ్మల్ని పోషించి, మిమ్మల్ని తృప్తిపరుస్తాడు.
అవును, నా ప్రియులారా, దేవుడు సమస్తమును మీ పట్ల మేలు జరిగించాలని ఆయన కోరుచున్నాడు. అందుకే బైబిలేమంటుందో చూడండి, " దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పముచొప్పున పిలువబడినవారికి, మేలుకలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము '' (రోమీయులకు 8:28) అన్న వచనము ప్రకారము మీకు సమస్తమును మేలుకొరకే జరిగిస్తాడు. ఇంకను యిర్మీయా గ్రంథము 32:40 వ వచనములో కూడా ఇలాగున చెబుతోంది, " నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను; వారు నన్ను విడువకుండునట్లు వారి హృదయములలో నా యెడల భయభక్తులు పుట్టించెదను '' అని సెలవిచ్చినట్లుగానే, ఈ రోజు ప్రభువు నుండి అద్భుతంగా సమస్తమును మీకు మేలు జరిగిస్తాడు. అవును, కీర్తనల గ్రంథము 81:16వ ప్రకారము కొండ తేనెతో ఆయన మిమ్మల్ని తృప్తిపరుస్తాడు. నేడు ఈ సందేశము చదువుచున్న మీరు ఎన్నటికిని చేరుకోలేని ఎత్తైన కొండ నుండి మీకు సమస్త మేలులను అనుగ్రహిస్తాడు. యేసు అంటే ఒక బండ మరియు ఆయనలో దాగి ఉన్న మేలులను ఆయన మీకు అనుగ్రహిస్తాడు. ఆయన మిమ్మల్ని అతీంద్రియంగా ఉన్నత స్థానానికి హెచ్చించబోవుచున్నాడు మరియు మిమ్మల్ని మీ జీవితంలో అత్యున్నత స్థాయికి తీసుకెళ్లడం ద్వారా మిమ్మల్ని సంతృప్తిపరుస్తాడు. మీరు ఎల్లప్పుడూ ప్రభువు నామాన్ని స్తుతించెదరు. కాబట్టి, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు దేవుని యొక్క మేలులను పొందాలంటే, నిశ్చయముగా, మీరు దేవుని మీ పూర్ణ హృదయముతో వెదకుచు, ఆయన దివ్య హస్తాలకు మిమ్మల్ని మీరు సమర్పించుకున్నట్లయితే, నిశ్చయముగా, ఆయన మీ పట్ల సమస్త మేలులను జరిగించి మిమ్మల్ని ఉన్నత స్థానమునకు హెచ్చిస్తాడు.
Prayer:
ప్రేమా నమ్మకమైన మా పరలోకమందున్న తండ్రీ,

నిన్ను స్తుతించుటకు మా కిచ్చిన ధన్యతను బట్టి నీకు వందనములు చెల్లించుచున్నాము. దేవా, ఈ రోజు నీవు మాకు ఇచ్చిన గొప్ప వాగ్దానాలను బట్టి నీకు వందనములు చెల్లించుచున్నాము. దేవా, మేము నీ వాక్యాన్ని మేము అంగీకరించునట్లు మాకు సహాయము చేయుము. దేవా, ఈ లోకములో క్లిష్కమైన పరిస్థితులనుండి మమ్మల్ని తప్పించుము. ఇంకను మా వ్యాధులను నీ గాయపడిన హస్తముల ద్వారా ముట్టి, స్వస్థతను దయచేసి, దీర్ఘాయువు చేత మమ్మల్ని తృప్తిపరచుము. మా జీవితములో సమస్త మేలులతో నింపి, మమ్మల్ని నిజంగా తృప్తిపరుచుము. దేవా, మా జీవితములో మమ్మల్ని ఉన్నత స్ధానమునకు హెచ్చించుము. దేవా, మా ద్వారా నీ నామము ఘనపరచునట్లు చేయుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

For Prayer Help (24x7) - 044 45 999 000