Loading...
Paul Dhinakaran

మీ చేతి క్రియలను సఫలము చేయు దేవుడు!

Dr. Paul Dhinakaran
14 Aug
నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీ కన్నీళ్లను తుడిచి, మీ క్రియ సఫలము చేయాలని ప్రభువు మీ పట్ల ఆశించుచున్నాడు. అందుకే బైబిలేమంటుందో చూడండి, " ...కన్నీళ్లు విడుచుట మానుము; నీ క్రియ సఫలమైనది...ఇదే యెహోవా వాక్కు'' (యిర్మీయా 31:16) అన్న వచనము ప్రకారము, మీ చేతులతో చేసిన పనిని ఎవరును అంగీకరించలేదనియు మరియు ఘనపరచబడలేదనియు నిరుత్సాహపడకండి. మా చేతులతో చేసిన ఏ పనికి కూడ ఫలము లభించలేదని మీరు చింతించకండి. మీ పట్ల కార్యము సఫలము చేయడానికి మీరు దేవునిని మీ జీవితాలలోనికి ప్రవేశించునట్లుగా అనుమతించినట్లయితే, మీ జీవితములో ప్రతి దశలోను మీరు అభివృద్ధి చెందుట చూచెదరు. అందుకే బైబిలేమంటుందో చూడండి, " అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలెనుండును అతడు చేయునదంతయు సఫలమగును '' (కీర్తనలు 1:3) అన్న వచనము ప్రకారము ఈనాడు ఈ సందేశము చదువుచున్న మీరు దేనిని చేసినను, దేవుడు మీ పట్ల దానిని సఫలపరుస్తాడు. తన వృత్తిలో దేవుడు తనకు ఏలాగున సహాయం చేశాడో ఒక వ్యక్తి యొక్క సాక్ష్యమును ఇక్కడ చూడండి.

నా పేరు ఢిల్లీ బాబు, నేను పాండిచ్చేరిలో ఉన్నాను. నా తండ్రి వ్యాపారము చేసేవారు. ఆయన ఈ లోకమును విడిచి వెళ్లేవరకు ఆ వ్యాపారమును గూర్చి నాకు ఏమియు తెలియదు. అకస్మాత్తుగా, నా తండ్రి మరణించినందున నేను మాత్రమే ఆ వ్యాపార బాధ్యతను తీసుకొని నడిపించవలసిన పరిస్థితి ఏర్పడినది. ఇంతకు ముందు ఎటువంటి అనుభవము లేనందున, ఏమి చేయవలెనని తెలియక వేదన నేను అనుభవించాను. అన్ని వైపుల అప్పుల బాధలు నన్ను చుట్టుకొనినవి. మాకు వస్తువులు ఇచ్చిన వారికి డబ్బు ఏ విధంగా తిరిగి చెల్లించవలెనని తెలియలేదు. ఆ సమయంలో, ' యేసు పిలుచుచున్నాడు ప్రార్థన గోపురమునకు ' వచ్చి ప్రార్థించుకున్నాను. వారికి నా సమస్యలను గురించి చెప్పాను. అక్కడ నా సమస్యలను ఆలకించిన ప్రార్థన యోధులు ' వ్యాపార ఆశీర్వాద పధకమును ' గూర్చియు, దాని కొరకు నిర్వహించబడుచున్న కూటములను గూర్చి నాకు తెలియజేశారు. నా వ్యాపార సంస్థను ' యేసు పిలుచుచున్నాడు వ్యాపార ఆశీర్వాద పధకములో చేర్చాను.' అప్పుడు నా వ్యాపారమును నిర్వహించగల జ్ఞానమును మరియు ప్రతిభను దేవుడు నాకు అనుగ్రహించి నన్ను ఆశీర్వదించాడు. నా వ్యాపారము ఆశీర్వదింపబడినందున నేను కూడ ఆశీర్వాదకరముగా ఉన్నాను. నేడు ' వ్యాపార ఆశీర్వాద పధకము ' ద్వారా దేవుడు నాకు అనుగ్రహించిన ఆశీర్వాదాలన్నిటి కోసం నేడు మా కుటుంబముతో కలిసి ఆయనను స్తుతించుచున్నాము. సమస్త మహిమ దేవునికే కలుగును గాక. 
నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీ వృత్తి యందు మరియు వ్యాపారమునందు దేవుడు మీ పట్ల క్రియ సఫలము చేయాలంటే, మీ మార్గములను దేవునికి సమర్పించుకొన్నట్లయయితే, ప్రతి ఫలము మీకు లభించును. నేడు అభివృద్ధిలేని మీ జీవితాలలో కన్నీళ్లు విడుచుచున్నట్లయితే, అటువంటి మిమ్మును చూచి, " ...కన్నీళ్లు విడుచుట మానుము; నీ క్రియ సఫలమైనది...ఇదే యెహోవా వాక్కు '' (యిర్మీయా 31:16) అన్న వచనము ప్రకారము మీరు యజమాని లేదా ఉద్యోగి అయినా సరే, జ్ఞానం కోసం దేవునిపై ఆధారపడండి. మీరు తప్పకుండా గొప్ప అభివృద్ధిని చూస్తారు. అందుకే బైబిలేమంటుందో చూడండి, " సొమ్మసిల్లినవారికి బలమిచ్చువాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే '' (యెషయా 40:29) అన్న వచనము ప్రకారము మీరు చేసే ప్రతి పనికి దేవుడు తప్పకుండా బహుమానమును అనుగ్రహిస్తాడు. బైబిల్లో చూచినట్లయితే, " యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును; ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివి; ఆయన నీకు సంపూర్ణమైన బహుమాన మిచ్చునని ఆమెకుత్తర మిచ్చెను '' (రూతు 2:12) అన్న వచనము ప్రకారము దేవుడు రూతుకు తగిన బహుమానమును ఇచ్చి ఆమెను ఆశీర్వదించాడు. కాబట్టి, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు కూడ రూతు వలె ఆయన ఆశ్రయపు రెక్కల క్రిందకు వచ్చినట్లయితే, నిశ్చయముగా, రూతు పొందుకున్న సంపూర్ణమైన బహుమానము మీరు కూడ పొందుకుంటారు. " నిశ్చయముగా ముందు గతి రానే వచ్చును నీ ఆశ భంగము కానేరదు '' (సామెతలు 23:18) అన్న వచనము ప్రకారము నిరుత్సాహపడవద్దు, మీ నమ్మకము వ్యర్థము కానేరదు. మీరు గొప్ప అభివృద్ధిని చూస్తారు. దేవుడు మీ కన్నీళ్లను తుడిచి, మీ క్రియ సఫలమగునట్లు చేసి మిమ్మల్ని వర్థిల్లజేస్తాడు. 
Prayer:
సర్వోన్నతుడా, సర్వకృపలకు ఆధారభూతుడవైన మా తండ్రీ,

నిన్ను స్తుతించుటకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు వందనములు చెల్లించుచున్నాము. నేడు మా జీవితములో మేము చేయుచున్న ప్రతి పనిలోను నీ కృపను మాకు అనుగ్రహించుటకును మరియు మా క్రియలను సఫలపరచుటకును మమ్మును మేము నీ చేతులకు సమర్పించుకొనుచున్నాము. నీ యందు మేము ఉంచిన నిరీక్షణ ఎన్నటికిని వ్యర్థము కాకుండా మా పట్ల నీ కార్యములను జరిగించుము. అనుదినము మేము ఎదుర్కొనుచున్న కష్టాలను మరియు క్లిష్ట పరిస్థితులలో మా కన్నీళ్లను చూచుచున్న దేవా, ఈనాడే మా కన్నీళ్లకు ముగింపు దయచేయుము. మా వ్యాధులను స్వస్థపరచుము. మా వృత్తిని మరియు పనులలో మేము గొప్ప విస్తారమును చూచునట్లుగా మాకు సహాయము చేయుమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్. 

For Prayer Help (24x7) - 044 45 999 000