Loading...
Paul Dhinakaran

సంతోషించండి, మనం ప్రభువుతో ఐక్యంగా ఉన్నాము!

Dr. Paul Dhinakaran
09 Aug
నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీ పట్ల ప్రభువు ఆనందించుచున్నాడు. ఎందుకంటే, మీ పట్ల ఆయన ప్రేమ కలిగియున్నాడు. అందుకే బైబిలేమంటుందో చూడండి, " ...పెండ్లికుమారుడు వధువును చూచి సంతోషించునట్లు, నీ దేవుడు నిన్ను సంతోషించును '' (యెషయా 62:5) అన్న వచనము ప్రకారము దేవుడు మీ పట్ల సంతోషించుచున్నాడు. ఈనాటి వాగ్దానము ద్వారా ప్రభువు మీ పేరున సంతోషించునని చెప్పుచున్నది. అవును, మనం ప్రభువుతో ఒకే ఆత్మ అని లేఖనాలు తెలియజేయుచున్నాయి. కాబట్టి, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు మీ జీవితాన్ని యేసునకు అర్పించినప్పుడు, మీ మార్గములన్నిటిని ఆయనకు అప్పగించి, ' ప్రభువా, నేను పాపము నుండి విడుదల పొందాలను కుంటున్నాను. పాపం ద్వారా వచ్చు శాపం నాకు వద్దు. పాపం యొక్క ఆనందాన్ని నేను కోరుకోను, నేను ఏ పాపపు స్వభావానికి బానిస కాకూడదు, నేను నీలా పరిశుద్ధంగా ఉండాలనుకుంటున్నాను ' అని చెప్పినప్పుడు, ప్రభువైన యేసు, నేడు ఈ సందేశము చదువుచున్న మీ పాపాలను ఆయన రక్తంతో కడుగుతాడు, ఆయన మీకు పాపం, దుర్‌వ్యసనాలు లేదా చెడు సంబంధాలు లేని నూతన జీవితాన్ని అనుగ్రహిస్తాడు. అప్పుడు మీరు ఇతరుల పట్ల చేసిన తప్పులన్నిటిని సరిదిద్దడానికి ప్రయత్నిస్తారు. మీ క్రియలు మరియు మీరు జీవించే విధానం ద్వారా మీరు దేవుని బిడ్డగా మారారని మరియు పాపం నుండి నీతివంతమైన జీవితానికి మారారని ప్రజలకు కనుపరచబడుతుంది.

అందువలన, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు ఇతరులపై చేసిన తప్పుకు క్షమాపణ కోరుకుంటారు లేదా వారికి చేసిన తప్పులను సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తారు. అప్పుడు ప్రభువు మీ జీవితం పట్ల సంతోషించి, " మీరు నా నీతిగల వదువు, మీరు నిష్కళంకమైన వారు. మీరు నిందారహితులు. మీరు పరిపూర్ణులు '' అని దేవుడు మనల్ని చూసి ఇంత చక్కటి మాటలు మాట్లాడినట్లయితే, మనకు ఎంత సంతోషం కదా! అవును, నేడు ఈ సందేశము చదువుచున్న మిమ్మును చూచి ఇదేలాగున ప్రభువు చెప్పాలనుకుంటున్నాడు, " నా బిడ్డలారా, మీరు అన్ని మార్గాలలో పరిపూర్ణులు. మీరు ఇప్పుడు నా పరిశుద్ధమైన అలంకారంతో నా సన్నిధిలోనికి ప్రవేశించవచ్చునని '' తెలియజేయుచున్నాడు. కాబట్టి, దేనిని గురించి మీరు చింతించకుండా, మీరు సంతోషించండి.
నా ప్రియులారా, ఈ రోజు, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు మీ జీవితాన్ని మార్చమని మరియు ఆయన కోసం మిమ్మల్ని నిష్కళంకమైన, పవిత్రమైన, పరిపూర్ణమైన వధువుగా మార్చమని ప్రభువును అడుగుతారా? ఆలాగుననే, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు అడిగినప్పుడు, ప్రభువు మీ పట్ల సంతోషిస్తాడు. అందుకే బైబిలేమంటుందో చూడండి, " నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు; ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును, నీయందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ యందలి సంతోషము చేత ఆయన హర్షించును '' (జెఫన్యా 3:17) అని ఈ వచనములో చెప్పబడినట్లుగానే అది నేడు మీ పట్ల జరుగుతుంది. నా ప్రియులారా, ప్రభువు నేడు ఈ సందేశము చదువుచున్న మీ పేరును బట్టి సంతోషించినప్పుడు, లోకం మీ జీవితంలో దేవుని అనుగ్రహాన్ని చూస్తుంది; ఆకాశము మరియు భూమి మిమ్మును ఘనపరచును. సకల దీవెనలు మీ మీదికి వస్తాయి. కాబట్టి, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు దేవుని ఎలా అనుసరించి, ఆయన హృదయాన్ని మరియు ఆయనను ఎలా సంతోషపెట్టగలరు? లూకా సువార్త 10 వ అధ్యాయములో, యేసు తన నామమును ఇతరులకు ప్రకటించడానికి తన శిష్యులను పంపినట్లు మనం లేఖనాల్లో చదువుతాము. అదేవిధంగా, శిష్యులు యేసు నామంలో అద్భుతాలు చేశారు; ఆయన నామము ద్వారా దయ్యాలు ప్రజలను విడిచి పారిపోవడం చూడగలము. శిష్యులు యేసు నామమున ఏమి జరిగించి యున్నారో తెలియజేసినప్పుడు, ఆయన సంతోషించినట్లు మనము లూకా సువార్త 10:21వ వచనములో చూడగలము. కాబట్టి ప్రభువు నేడు ఈ సందేశము చదువుచున్న మీ పేరును గురించి సంతోషించుచున్నాడు. ఈ రోజు ప్రభువు మీకు ఇటువంటి గొప్ప కృపను అనుగ్రహించును గాక.
Prayer:
ప్రేమామయుడవైన మా పరలోకమందున్న తండ్రీ,

నిన్ను స్తుతించుటకు నీవు మాకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు వందనాలు. ప్రేమగల మా ప్రభువైన యేస్తూ, నేడు నీవు మాకిచ్చిన వాగ్దానానికై మేము నిన్ను స్తుతించుచున్నాము. దేవా, మేము మా జీవితాన్ని నీ ప్రేమగల హస్తాలకు అప్పగించుకొనుచున్నాము. మేము మరల పాపం చేయకూడదను కుంటున్నాము. దేవా, మేము నీకు ప్రీతిగల జీవితాన్ని గడపాలనుకుంటున్నాము. కాబట్టి, నేడు నీవు మా జీవితాలను నీ అమూల్యమైన రక్తంలో మమ్మును కడిగి, మమ్మును నీ కళంకము లేని వధువుగా మార్చుము. దేవా, ఈనాటి నుండి మేము నీతివంతమైన జీవితాన్ని గడపడానికి మాకు నీ కృపను అనుగ్రహించుము. దేవా, నీవు మా పేరున సంతోషించాలని మేము కోరుకుంటున్నాము. దేవా, మేము నీ స్వరూపంలోనికి మార్చబడి, పరిపూర్ణులముగా మార్చబడునట్లుగాను, దయతో మమ్మును నీతో ఐక్యపరచుము. ప్రభువా, మేము నీ ఆత్మతో ఐక్యపరచబడునట్లుగా మమ్మును మార్చుమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

For Prayer Help (24x7) - 044 45 999 000