Loading...
Dr. Paul Dhinakaran

దేవుని పోలికలోనే మిమ్మును ప్రతిఫలింపజేస్తాడు!

Dr. Paul Dhinakaran
08 Apr
నా ప్రియమైనవారలారా, నేడు ఈ సందేశము చదువుచున్న మిమ్మును ప్రభువు తన యొక్క స్వరూపమునకు మార్చి, అద్దము వలె మిమ్మును ప్రతిఫలింపజేయాలని ఆశించుచున్నాడు. అయితే, మీరు ఆలాగున ఉండాలంటే, మీరు దేవుని వాక్యమునకు, ఆయన ఆజ్ఞలకు లోబడి జీవించాలి. అందుకే, " ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను; దేవుని స్వరూపమందు వాని సృజించెను; స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను '' (ఆదికాండము 1:27). కానీ, ఆదాము హవ్వలు దేవుని ఆజ్ఞలకు లోబడక, అవిధేయత చూపారు. ఆది మానవుడైన ఆదాము దేవుని పిలుపుకు అవిధేయత చూపినవాడైనందున ఆయన ఆదాముతో నీవు నీ భార్యమాట విని తినవద్దని నేను నీ కాజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడియున్నది; ప్రయాసముతోనే నీవు బ్రదుకు దినములన్నియు దాని పంట తిందువు (ఆదికాండము 3:8-13) అని సెలవిచ్చాడు. అయినను దేవుడు తన గొప్ప కనికరము చేత, మానవాళి అంతయు నిత్యనరకము నుండి రక్షించబడాలని మన పట్ల వాంఛ కలిగి యుండెను. కావుననే, దేవుడు తన యొక్క ఏకైక కుమారుడైన యేసక్రీస్తును ఈ లోకానికి పంపించాడు. 

అంతమాత్రమే కాదు, ఆ దేవాది దేవుడు మనలను అద్దమువలె ప్రతిఫలింజేయాలని ఆశించుచున్నాడు. ఇంకను ఈ నూతన మాసములో మన ప్రభువైన యేసుక్రీస్తు తన స్వరూపమునకు మిమ్మును మారుస్తాడు. ఆయన స్వరూపములోనే వుండాలని ఈ విశాలమైన భూమి మీద నరుని సృజించాడు. " మనమందరమును ముసుకు లేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దమువలె ప్రతిఫలింపజేయుచు, మహిమనుండి అధిక మహిమను పొందుచు, ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము '' (2 కొరింథీయులకు 3:18) అన్న వచనము ప్రకారము దేవుని పోలికను ప్రతిఫలింపజేయుటకు సృష్టిలో ఎవరికి లేని భాగ్యము మానవునికి ఉన్నది. కానీ, అతను పాపములో పడిపోయినందున, దేవుని పోలికను ప్రతిఫలింపజేయుటకు విఫలుడయ్యాడు. 
ఒకసారి, యేసు ముఖమును చిత్రించాలని ఆశించిన ఒక చిత్రకారుడు, అటువంటి ముఖము కలిగిన వానిని కనుగొని, అతనిని చూచి, యేసు చిత్రమును గీసి, అతనిని పంపించి వేశాడు. కొంతకాలం తరువాత, అదే చిత్రకారుడు, యేసును అప్పగించిన యూదా చిత్ర పటమును గీయవలెనని, అటువంటి, ముఖము కలిగిన వ్యక్తిని కనుగొని, " నీ ముఖము సరిగ్గా యూదా ముఖము వలె ఉంది '' అని చెప్పాడు. అప్పుడు ఆ యువకుడు, " అయ్యా, కొంతకాలం క్రితం ఒక చిత్రపటము కొరకు నేను మీకు సహాయము చేశాను. అప్పుడు మీరు నా ముఖము అచ్చం యేసు వలె ఉన్నదని చెప్పారు '' అని అడిగాడు. అది విని చిత్రకారుడు కారణమేమిటని అడుగగా? అతడు, " మీరు నాకు ఇచ్చిన డబ్బు వలన మార్గము తప్పాను. నా హృదయంలో యేసును కలిగియున్నప్పుడు, యేసువలె కనిపించాను. కానీ, ఇప్పుడు యూదా వలె కనిపించుచున్నాను'' అని చెప్పాడు. 

నా ప్రియులారా, అవును, నేడు ఈ సందేశము చుదువుచున్న మీరు యేసును కలిగియున్నప్పుడు మీ ముఖము ఆయన పోలికను ప్రతిఫలింపజేయును. ఈనాడు మీరు ఆయనకు దూరముగా ఉన్నట్లయితే, తిరిగి రండి, మిమ్మును చేర్చుకొనుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు. దేవుని కలిగియుండి, ఆయన పోలికను అద్దమువలె ప్రతిఫలింపజేయుడి. యేసు అను నాయకుని వలె మిమ్మును రూపాంతరపరుస్తాడు. ఆయన రక్తము ద్వారా మీ పాపములను కడుగుతాడు. పాపి అని అందరు మిమ్మును నిందించే మీలోనికి నేడు దేవుడు దిగివస్తున్నాడు. ఆయన రక్తము ద్వారా, ఒకే క్షణములో మిమ్మును ఆయనవలె రూపాంతరపరుస్తాడు. మీలో పాపాన్ని, వ్యాధులను తొలగిస్తాడు, యేసుని స్వరూపము మీలోనికి దిగివస్తుంది. ఈ వెబ్‌సైట్ చూచు మీరందరు యేసుని స్వరూపమునకు మార్చబడాలంటే మీరు దేవుని ఆత్మచేత నింపబడినట్లయితే, ఆయన ఆత్మ ద్వారా, రక్తము ద్వారా మిమ్మును తన స్వరూపమునకు మారుస్తాడు. నేడు మీరు దేవుని స్వరూపము కావాలని కోరుకున్నట్లయితే, యేసువలె మిమ్మును రూపాంతరపరచి మీరు పోగొట్టుకున్న వాటిని తిరిగి మీకిచ్చి, నూతన జీవితాన్ని మీరు అనుభవించునట్లు మిమ్మును తన పోలిక చేత అద్దము వలె ప్రతిఫలింపజేసి దీవిస్తాడు. 
Prayer:
కృపలకు అధారభూతుడవైన దేవా ! 
ప్రేమగల ప్రభువా, ఈనాడు ఈ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకై నీకు స్తోత్రములు. ప్రభువా, నీ పరిశుద్ధాత్మతోను మరియు నీ కృపతో మమ్మును నింపుము. మా హృదయములో నిన్ను కలిగియుండి, నీ మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుటకు మాకు సహాయము చేయుము. మా కఠిన హృదయాన్ని మార్చి వేసి మమ్ములను సంపూర్తిగా నూతన జీవిగా రూపొందించుము. మా పాపములు అతిక్రమములు నీ ప్రేమగలిగిన హృదయాన్ని నొప్పించి బాధపెట్టనివ్వకుండా వుండుటకు సహాయము చేయుము. నీ నీతిని రాజ్యమును మొట్టమొదటిగా వెదకుటకు మాకు సహాయము చేయుము. నీ పరిశుద్ధాత్మ ద్వారా మా పాప జీవితములను మార్చి మాకు నూతన జీవితమును అనుగ్రహించి మమ్మును బలమైన పరికరములుగా వాడుకొనుము. మమ్మును కూడ నీ వలె రూపాంతరపరచి ఆత్మీయంగాను, శారీరకంగాను ఆశీర్వదించుమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.
 

1800 425 7755 / 044-33 999 000