Loading...
Dr Shilpa Samuel Dhinakaran

మీ కుటుంబానికి దేవుని మేలులను పొందుకొనండి!

Shilpa Dhinakaran
25 Sep

నా ప్రియ స్నేహితులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మిమ్మును దేవుడు తన యొక్క మేలులతో నింపాలని మీ పట్ల కోరుచున్నాడు. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 31:19వ వచనమును మీ కొరకు ఎన్నుకొనబడినది. ఆ వచనము, " నీ యందు భయభక్తులుగలవారి నిమిత్తము నీవు దాచియుంచిన మేలు యెంతో గొప్పది, నరుల యెదుట నిన్ను ఆశ్రయించువారి నిమిత్తము నీవు సిద్ధపరచిన మేలు ఎంతో గొప్పది '' అని నేటి వాగ్దాన వచనం ప్రకారము దేవుడు మిమ్మును దీవించాలని మీ పట్ల కోరుచున్నాడు. ఆయన తన యొక్క గొప్ప మేలులతో మిమ్మును ఆశీర్వాదించుటకు, మీరు ఆయనను ఆశ్రయించమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు. మనం సేవించే దేవుడు ఎంత గొప్పవాడు కదా! అవును, నేడు ప్రభువు తన పిల్లలను గొప్ప మేలులతో ఆశీర్వదించాలని కోరుచున్నాడు. ఒకవేళ, నేడు ఈ సందేశము చదువుచున్న మీ జీవితములో ఎక్కడైతే, ఏదైతే, మృతమైనదని మీరు తలంచుచున్నారో, వాటిని కూడా సజీవంగా మార్చడానికి ప్రభువు ఈరోజు మీ పట్ల సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి సంతోషించి, ఆనందించండి!

లేఖనాలలో లాజరు జీవితంలో దేవుని పునరుత్థానపు శక్తి ప్రత్యక్షపరచబడినట్లుగా మనం చూడగలము. లాజరు చనిపోయాడు; అతని సహోదరీలు ఇద్దరూ ఏడ్చారు. ' మన సోదరుడిని మళ్లీ చూడలేము; అతని జీవితం ముగిసి పోయింది ' అని అనుకున్నారు. అయితే, యేసు వచ్చి తన పునరుత్థానపు శక్తి చేత లాజరును తిరిగి బ్రతికించాడు. లాజరు జీవితం ముగిసిపోయిందని ఇరుగుపొరుగు వారు మరియు చుట్టుప్రక్కల ప్రజలు భావించి ఉండవచ్చును. అయితే, ప్రభువునకు లాజరు పట్ల వేరే ప్రత్యేకమైన ప్రణాళిక ఉన్నది. ఆయన తన పిల్లలకు మేలుకరంగా ఉండాలని మరియు మంచితనంతో వారిని నింపాలని కోరుకున్నాడు. కాబట్టి, నేడు మీజీవితములో మృతమైనదానిని గురించి చింతించకండి, మీరు ఆయనను ఆశ్రయించండి, ఆయన మీ జీవితములో మృతమైనదానిని సజీవంగా మారుస్తాడు. ఒకవేళ నేడు ఈ సందేశము చదువుచున్న మీ భవిష్యత్తు ఏమవుతుందో అని ఆందోళన చెందుతున్నారా? మీరు విన్నది మీకు కూడా జరుగుతుందా అని భయపడుతున్నారా? భయపడవద్దు. దేవుని ఆశ్రయం పొందిన మీరు తప్పకుండా ఆయన మేలులను మరియు మంచితనమును మాత్రమే అనుభవిస్తారని దేవుడు వాగ్దానము చేయుచున్నాడు.

అవును, నా ప్రియులారా, ఈ రోజు ఈ సందేశము చదువుచున్న మీరు కూడా ఇదే పరిస్థితిలో ఉండవచ్చును. ' ఈ వ్యాధి ద్వారా లేక అప్పులు ద్వారా లేక ఇతర కార్యముల ద్వారా మీ జీవితం ముగిసింది; ఇక లాభం లేదనియు డాక్టర్లు మరియు మీ ఇరుగుపొరుగు వారు చెప్పవచ్చును. మీ తల్లిదండ్రులు లేక మీ ఉపాధ్యాయులైన వారు కూడా మిమ్మల్ని ఇలాగున అనవచ్చును, ' మీరు ఎందుకు పనికిరానివారు, జీవించుట వ్యర్థమని ఇతరులు మీ చెవిలో చెప్పవచ్చును. ' నిరుత్సాహపడకండి. ప్రభువు మిమ్మును సమస్త మేలులతోను మరియు మీ కొరకు దాచి యుంచిన మంచి కార్యాలతో ఆశీర్వదించడానికి మీ పట్ల వేచి ఉన్నాడని సెలవిచ్చుచున్నాడు. ప్రభువు మీ కొరకు సమస్త మేలులను భద్రపరచియున్నాడు. నేడు ఈ సందేశము చదువుచున్న మీరు దేవుడు అనుగ్రహించు గొప్ప మేలులను పొందుకోవాలంటే, మీరు చేయవలసినకార్యమేదనగా, మీరు ఆయన యందు భయభక్తులు కలిగి ఆయనను ఆశ్రయించినట్లయితే, నిశ్చయముగా, దేవుడు మిమ్మును తన యొక్క మేలులతో మిమ్మును నింపి, వర్థిల్లజేస్తాడు.

Prayer:

ప్రేమామయుడవైన మా పరలోకమందున్న తండ్రీ,

నేటి వాగ్దానము ద్వారా మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువైన యేసు, మా పట్ల నీకున్న ప్రేమను బట్టి మేము నిన్ను స్తుతించుచున్నాము. దేవా, నీ శాశ్వతమైన కృపతో మమ్మును తృప్తిపరచా లని ప్రార్థించుచున్నాము. దేవా, ఈ లోకములో ఉన్నవారిని కాకుండా ఎల్లప్పుడు నిన్ను ఆశ్రయించునట్లు చేయుము. ప్రభువా, మమ్మును నీ యొక్క మేలులతో నింపుతావని మేము నీ యందు నమ్మిక యుంచి, నీ వైపు మాత్రమే చూస్తున్నాము. దేవా, ఈరోజు నీవు వాగ్దానం చేసినట్లుగా నీ ఆనందం మరియు నీ శాంతి మరియు నీ యొద్ద దాగి ఉన్న సమృద్ధియైన ఆశీర్వాదాలతో మమ్మును మరియు మా కుటుంబ జీవితాలను నింపుము. ప్రభువా, ఈ రోజులోని ప్రతి క్షణం మా చుట్టూ ఉన్న నీ సన్నిధిని మేము అనుభూతి చెందునట్లు చేయుము. యేసయ్యా, చనిపోయిన లాజరును సజీవంగా లేపినట్లుగానే, నేడు మా జీవితంలో మృతమైన వాటిని మరల జీవం పోసినందుకు మేము నిన్ను స్తుతించుచున్నాము. దేవా, మేము నీ ప్రేమ గల హస్తముల నుండి గొప్ప వరం పొందుకొనుటకు మాకు సహాయము చేయుము. దేవా, నీ యందు భయభక్తులు కలిగియుండుటకును మరియు నిన్ను ఆశ్రయించుటకును, తద్వారా నీవు మా కొరకు దాచియుంచిన మేలులను మేము పొందుకొని, ఆనందిం చునట్లు చేయుమని సమస్త స్తుతి ఘనత మహిమ నీకే చెల్లించుచు యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

For Prayer Help (24x7) - 044 45 999 000