Loading...
Paul Dhinakaran

మీ పట్ల ఉన్న దేవుని ప్రణాళికను వెంబడించండి!

Dr. Paul Dhinakaran
24 Sep

నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీలో కార్యసిద్ధి కలుగజేయుటకు దేవుడు మీ పట్ల సిద్ధముగా ఉన్నాడు. అందుకే నేటి వాగ్దానంగా, బైబిల్ నుండి ఫిలిప్పీయులకు 2:13 వ వచనము తీసుకొనబడినది. ఆ వచనములో, " ఎందుకనగా, మీరు ఇచ్ఛయించుటకును కార్యసిద్ధి కలుగజేసికొనుటకును, తన దయాసంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే '' అని చె ప్పబడినది. అవును, ఈ వాగ్దాన వచనం ప్రకారం, దేవుడు మీలో కార్యసిద్ధిని కలుగజేయుచున్నాడు! ఆయన యొక్క దయాసంకల్పము ప్రకారం మీ కోరిక నెరవేర్చబడుతుంది మరియు మీ పట్ల ఆయన తన యొక్క మంచి ప్రణాళికలను నెరవేర్చగల శక్తిని కలిగియున్నాడు. కాబట్టి ఎంతో ఆనందంగా ఉండండి! దేవుని ఆధిపత్యంలో ఉన్నది.

నా ప్రియులారా, ప్రభువు నేడు ఈ సందేశము చదువుచున్న మీలో ఎప్పుడు కార్యసిద్ధిని చేయగలడు? మీ జీవితానికి, దేవునికి మధ్య ఒక మంచి ప్రకణాళిక ఉన్నదని మీరు మొదట గ్రహించాలి. మీ జీవితంలో ఎన్నో కార్యాలు వ్యతిరేకంగా జరిగిపోయి ఉండవచ్చును. నేడు ఈ సందేశము చదువుచున్న మీ చుట్టూ చెడు కార్యాలు జరగవచ్చును మరియు ప్రతిచోట మీరు అవమానముతోను తలదించుకొని వెళ్ళవలసి వచ్చి యుండవచ్చును. మీరు మీ జీవితంలో అనేక నష్టాలను ఎదుర్కొని యుండవచ్చును. దేవుడు దానిని ఎందుకు అనుమతించాడో తెలుసా? తద్వారా, మీరు శూన్యంగా చేయబడుట చేత, మీ శక్తి మీద ఉన్న నమ్మకమును కోల్పోతారు. నా ప్రియ స్నేహితులారా, దేవుడు నేడు ఈ సందేశము చదువుచున్న మీ జీవితంలో క్రియ చేయడం ప్రారంభించుట చేత ఆయన మిమ్మల్ని మొదట శూన్యం చేస్తాడు. ఆ తర్వాత, ఆయన మిమ్మల్ని తన యొక్క సంపూర్ణతతో నింపుతాడు. తద్వారా, ఆయన తన యొక్క మంచి ప్రణాళికలను మీ జీవితంలో మరియు మీ జీవితం ద్వారా నెరవేరుస్తాడు. ఆలాగుననే, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. కానీ, వారి శక్తిచేత, వారి ఇష్టప్రకారం చేసేవారు కొంతకాలం మాత్రమే నిలుస్తారు. ఎందుకంటే, మానవుని ప్రణాళికలు ఎల్లప్పుడు నిత్యము నిలిచి ఉండవు. కానీ దేవుడు శాశ్వతుడు. " ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీర మందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి, నా కొరకు తన్నుతాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసమువలన జీవించుచున్నాను '' అని చెప్పగలుగుతారు.

బైబిల్‌లో, హేబెలు అను వ్యక్తి ఉండెను. అతడు చనిపోయినను, మాట్లాడుచున్నాడు అని చెప్పబడినది. " విశ్వాసమునుబట్టి హేబెలు కయానుకంటె శ్రేష్ఠమైన బలి దేవునికి అర్పించెను. దేవుడతని అర్పణలను గూర్చి సాక్ష్యమిచ్చి నప్పుడు అతడు ఆ విశ్వాసమునుబట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా మాటలాడుచున్నాడు '' (హెబ్రీయులకు 11:4) అని వ్రాయబడింది. యేసు ప్రభువును గురించి కూడా అదేవిధముగా వ్రాయబడియున్నది. యేసు తన శక్తి, తన బలం, రక్తం, ఆయన శరీరంలో ఉన్న జీవము, ఆయన కీర్తి అంతా, తాను కలిగి ఉన్న ఆరోగ్యం మరియు ఆయన కలిగి ఉన్న సమస్త ఘనత మరియు ఐశ్వర్యమును గురించి పూర్తిగా శూన్యం చేయుట కొరకే యేసు తనను తాను సిలువపై బలిగా సమర్పించుకున్న దేవుని కుమారుడు. నేడు ఈ సందేశము చదువుచున్న మీ శూన్యతను మరియు మీ శూన్యమైన జీవితాన్ని అర్థం చేసుకోవడా నికి మరియు మీ జీవితంలో మిమ్మల్ని మీరు శూన్యం చేసుకొనే సమయంలో మీకు సహాయం చేయడానికి యేసు ఇలాగున తనను తాను శ్యూనం చేసుకున్నాడు. కానీ, ఆయన చనిపోయి మూడవరోజు పునరుత్థానుడై జీవజలముగా మారుట కొరకే పరిశుద్ధాత్మ శక్తి చేత తన ప్రాణమును త్యాగము చేశాడు.
 
నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీ కోసం మరియు నా కోసం కలిగియున్న మంచి ప్రణాళికను నెరవేర్చే ఉద్దేశ్యం ఆయనకు ఉన్నందున ఇప్పుడు యేసు నిరంతరము మనతో కూడ జీవించుచున్నాడు. కాబట్టి, దేవుడు మీ జీవితంలో కొన్ని పరిస్థితులను మిమ్మల్ని శూన్యం చేయడానికి అనుమతిస్తున్నప్పుడు, యేసు మీకు సహాయం చేయడానికి మీ యొద్దకు వస్తాడు. అందుకే బైబిల్‌లో, " మృతులలో నుండి యేసును లేపినవాని ఆత్మ మీలో నివసించిన యెడల, మృతులలో నుండి క్రీస్తుయేసును లేపినవాడు చావునకులోనైన మీ శరీరములను కూడ మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును '' (రోమీయులకు 8:11) అన్న వచనం ప్రకారం మీరు ఆయనకు మొఱ్ఱపెట్టినప్పుడు దేవుని ఆత్మ మిమ్మల్ని శూన్యములో నుండి మరల పైకి లేపుతాడు. ఇకపై ' మీరు ' కాదు, కానీ మీలో నివసించే క్రీస్తు. ఇది శక్తి ద్వారా లేదా బలము ద్వారా కాదు, కానీ మీరు దేవుని ఆత్మ ద్వారానే జీవించుటకు ప్రారంభించడం జరుగుతుంది. దేవుడు మీలో క్రియ చేయడం ప్రారంభించినప్పుడు, మీరు శరీరానుసారంగా కాకుండా దేవుని ప్రణాళిక ప్రకారం క్రియలు చేయాలనే కోరికను ఆయన మీకు కలుగజేస్తాడు. మరియు మిమ్మును ప్రేమిస్తున్న యేసుక్రీస్తు ద్వారా మీరు ఇచ్ఛయించుటకును కార్యసిద్ధి కలుగజేసికొనుటకును, విజయవంతం కావడానికి మరియు జయించటానికి ఆయన మీకు తన పరిశుద్ధాత్మ శక్తిని ఇచ్చి, తన దయాసంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే. అయినను మిమ్మును ప్రేమించినవాని ద్వారా మీరు వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుదురు నా స్నేహితులారా. యేసుక్రీస్తు ద్వారా దేవుడు మీ కోసం కలిగి ఉన్న ' మంచి ప్రణాళిక జీవితం' ఇదియే. కాబట్టి, సంతోషించండి, దేవుడు మిమ్మును దీవించును గాక.
Prayer:

మా ప్రశస్తమైన పరలోకమందున్న ప్రియ తండ్రీ,

నీ అద్భుతమైన వాగ్దానం మా పట్ల చేసినందుకై నీకు వందనాలు. ప్రభువా, మా జీవితము పట్ల నీకు మంచి ఉద్దేశ్యం కలిగియున్నావని మేము నమ్ముచున్నాము. ఇప్పుడు కూడా, ప్రభువా, మేము నీ సిలువ యొద్దకు వచ్చి, మా జీవితములో ఉన్న సమస్యలను తొలగించుమని ప్రార్థించుచున్నాము. దేవా, శూన్యములో ఉన్న మమ్మును నీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మును నింపుము. ప్రభువా, నీవు మాలో కార్యసిద్ధి కలుగజేయుటకు ప్రారంభించాలని మేము ప్రార్థించుచున్నాము. ఇది ఇకపై మేము కాదు, మాలో నివసించే క్రీస్తు, ఎందుకంటే, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసువైపు చూచునట్లు చేయుము. ప్రభువా, మమ్మును ఇబ్బంది పెట్టే ప్రతి పరిస్థితి నుండి మమ్మును పునరుత్థానం చేయుము. దేవా, మా జీవితములో నీ మంచి ఉద్దేశములను ఈ రోజు నుండి నెరవేర్చుము. ప్రభువా, నీ నామము మాత్రమే మా ద్వారా మహిమపరచునట్లు చేయుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

For Prayer Help (24x7) - 044 45 999 000