Loading...
Paul Dhinakaran

ప్రార్థించు, స్తుతించు, కృతజ్ఞతలు చెల్లించు!

Dr. Paul Dhinakaran
14 May
నా అమూల్యమైన స్నేహితులారా, ఈ రోజు మీ ఆశీర్వాదం కోసం ప్రభువు ఇప్పటికే సమస్తమును ప్రణాళిక వేసియున్నాడు. ఈ రోజు మీకు ఇవ్వబడిన వాగ్దానం కీర్తన 45:17 నుండి ఎన్నుకొనబడినది. ఇందులో, ‘‘ తరములన్నిటను నీ నామము జ్ఞాపకముండునట్లు నేను చేయుదును. కావున జనములు సర్వకాలము నీకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుదురు ’’ అని కీర్తనకారుడు చెప్పుచున్నాడు. నా స్నేహితులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు దేవుని ఆశీర్వాదం కోసం ప్రార్థించడమే కాకుండా ఆయనను స్తుతించాలి. మరియు మూడవదిగా, ఆయన చేసిన దానికి మీరు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేయవలెను.

నా ప్రియులారా, ఆయన స్తుతులకు కర్తయైనందున, ఆయన మహిమ కొరకు, ఆయన శక్తి కొరకు, మొదలైన వాటి కోసం ఆయనను స్తుతించండి. ఆలాగే, నేడు మీ జీవితంలోని ప్రతి క్షణము ఆనందించడానికి ఆయన మీకు ఇచ్చిన గొప్ప కృపను బట్టి, మీరు ఆయనకు కృతజ్ఞతలు చెల్లించండి. అప్పుడు మీ ద్వారా ప్రభువు నామము ఘనపరచబడును. కాబట్టి, ఈ మూడింటిని గుర్తుంచుకోండి. కనుకనే, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు ప్రతిరోజు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, ఆయన స్తుతులకు దేవుడైనందున మీరు ఆయనను స్తుతించండి.
నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు ఆయనను పై స్థానములో ఉంచినప్పుడు, మీ జీవితంలో ఆయనను మీరు గొప్ప దేవునిగా అనుభవిస్తారు. ‘‘ ప్రభువా, నీవు బలమైన దేవునివి మరియు ప్రతి పర్వతము వంటి సమస్యలను బ్రద్దలు చేయగల శక్తి నీకు కలదు ’’ అని మీరు చెప్పినట్లయితే, ఆయన మీ జీవితంలో ఒక శక్తివంతమైన దేవునిగా తన శక్తిని మీ పట్ల బయలుపరుస్తాడు. అంతమాత్రమే కాదు, నేడు ఈ సందేశము చదువుచున్న మీ జీవితంలోని పర్వతము వలె ఉన్న ప్రతి విషయాన్ని బ్రద్దలు చేస్తాడు. ‘‘ మా పట్ల నీకున్న గొప్ప ప్రేమ నిమిత్తము నేను నిన్ను స్తుతిస్తున్నాను ’’ అని మీరు చెప్పినప్పుడు మీ హృదయంలో ఆయన సన్నిధి యొక్క ఆనందం పొంగిపొర్లునట్లు మీరు అనుభూతి చెందుతారు మరియు మీరు ఈ లోకములో జీవించుటకు కావలసిన సమస్తమును బట్టి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించెదరు. ఆయన, మీకిచ్చిన కుటుంబమును బట్టి కృతజ్ఞతలు చెల్లించండి. మరియు మీ ఉద్యోగాన్ని బట్టి మరియు మీ పిల్లలను బట్టి, మీకు కలిగిన యావత్తును బట్టి, ఆయనకు కృతజ్ఞతలు చెల్లించండి. మీ వద్ద ఉన్న ఒక్క బియ్యం గింజకు కూడా మీరు దేవునికి కృతజ్ఞతలు తెలియజేయండి. అప్పుడు దేవుని ఆశీర్వాదాలు మీ జీవితంలో ప్రతిదానిలో విస్తరింపబడతాయి. అందుకు మీరు ఆయనకు కృతజ్ఞతలు చెల్లించినప్పుడు, మీ పట్ల దేవుని కృప విస్తరింపబడి, వృద్ధిపరచబడుతుంది. ఇంకను మీరు ఈ లోకములో ఉన్న వాటన్నిటిలోను సమృద్ధిని కలిగి ఉంటారు మరియు దేవునితో మీ ఆధ్యాత్మిక పయనములో కూడా మీరు సమృద్ధిని కలిగి జీవిస్తారు. ఆ తరువాత, దేవునికి ప్రార్థించండి. దేవుని చిత్తం మీకు బయలుపరచాలని ప్రార్థించండి. మీ జీవితంలోని ఏ విషయములోనైనా సమస్యలు ఎదురైనప్పుడు, దానిని గురించి ఆయన చిత్తాన్ని మీకు చూపించమని దేవుని అడగండి. అప్పుడు ప్రభువు దానిని మీకు చూపిస్తాడు. అదియుగాక, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు ఆయన చిత్తాన్ని చేసినప్పుడు, ప్రభువు మీతో పని చేస్తాడు మరియు దేవుని శక్తి ద్వారా మీ కోసం సమస్తమును నెరవేర్చబడును. మీరు తన చిత్తాన్ని నెరవేర్చడానికి మరియు ఆశీర్వాదకరముగా ఉండుటకు దేవుడు మీకు కృపను అనుగ్రహిస్తాడు.
Prayer:
మా ప్రేమగల పరలోకపు తండ్రీ,
 
నేటి వాగ్దానానికై నీకు వందనాలు. ప్రభువా, నీవు శక్తిమంతుడవు, బలవంతుడవు, దయగలవాడవు మరియు శాశ్వతుడవు. కాబట్టి, మేము నిన్ను స్తుతించుచున్నాము. ప్రభువా, మా జీవితంలో నీవు మాకు ఇచ్చిన సకల ఆశీర్వాదాలకు మేము నీకు కృతజ్ఞతలు తెలియజేయుచున్నాము. మేము ఎదుర్కొంటున్న అవసరాలు మరియు శోధనలు నీకు తెలుసు. ప్రభువా, వాటిని గురించి నీ చిత్తాన్ని మాకు బయలుపరచుము, దానిని నెరవేర్చడానికి మరియు నీ నామానికి మహిమను తీసుకురావడానికి మాకు సహాయం చేయుమని సమస్త స్తుతి ఘనత మహిమ నీకే చెల్లించుచు యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

For Prayer Help (24x7) - 044 45 999 000