Loading...

మీరు ఎల్లప్పుడు దేవుని స్తుతించండి!

Shilpa Dhinakaran
20 Oct
నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు ఎల్లప్పుడు దేవుని స్తుతించినప్పుడు, ఆయన మీ పట్ల గొప్ప కార్యములను జరిగిస్తాడు. ఆలాగుననే, నేటి వాగ్దాన వచనము కీర్తనలు 51:15 నుండి ఎన్నుకొనబడినది. " ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువుము. '' అవును, నా ప్రియస్నేహితులారా, ఈ వాగ్దానం ప్రకారం, మీ జీవితంలో ఏది జరిగినా, మీకు ఎటువంటి చింత మరియు మీకు ఏటువంటి ఇబ్బంధులు కలిగించినా, మీరు చేయాల్సిందల్లా దేవుని స్తుతించడం మరియు కృతజ్ఞతలు తెలియజేయడం. ఆలాగున చేసినట్లయితే, నిశ్చయముగా, దేవుడు మీ జీవితములో అద్భుతములను కనుపరుస్తాడు.
 
నా కుమార్తె క్యెట్లిన్ జన్మించినప్పుడు నాకు గుర్తుంది మరియు మేము ఆమెను మొదటి చెకప్ (పరీక్ష) కోసం తీసుకొని వెళ్లాము. డాక్టర్లు ఆమెను పరీక్ష చేసి, ఆమె కాళ్ళలో ఏదో లోపం ఉందని, వారు ఆమెను మరోసారి పరీక్ష చేస్తూనే ఉన్నారని చెప్పారు. వారి మాటలకు మేము భయపడి, ఆందోళన చెందినప్పటికిని, ఆమె దేవుని యొద్ద నుండి వచ్చిన సంపూర్ణమైన బహుమతి అని మాకు తెలుసును. కాబట్టి, ఆమెను ఎటువంటి బలహీనతలు తాకలేవు లేదా ఏ హాని ఏమి చేయలేవని మాకు తెలుసు. మాలో ఆమెను గురించిన బాధ ఉన్నప్పటికిని, మేము దేవుని స్తుతిస్తూ, క్యెట్లిన్ కోసం కృతజ్ఞతలు తెలుపుతూనే ఉన్నాము. చివరికి ఏమి జరిగిందో తెలుసా? మరొకసారి మేము ఆమెను పరీక్షించుకొనుటకు తీసుకొని వెళ్ళినప్పుడు, డాక్టర్లు ఆమె బాగానే ఉన్నదని, ఆమెకు ఎటువంటి బలహీనత లేదు, మీరు దేనిని గూర్చి భయపడవలసిన అవసరం లేదని చెప్పారు. దేవునికే మహిమ కలుగును గాక.
కాబట్టి, నా ప్రియ స్నేహితులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీకు కూడా అదేలాగున జరుగుతుంది. కాబట్టి, నేడు మీకు ఏ సమస్యలు వచ్చినా, మీరు చేయవలసిందల్లా, దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ, ఆయనను స్తుతించినప్పుడు, ప్రభువు మీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. మనము బైబిల్‌లో యెరికో గోడలను గురించి చదువుగలము. " ఆ కాలమున ఇశ్రాయేలీ యుల భయముచేత ఎవడును వెలుపలికి పోకుండను లోపలికి రాకుండను యెరికోపట్టణ ద్వారము గట్టిగా మూసి వేయబడెను. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను చూడుము; నేను యెరికోను దాని రాజును పరాక్రమముగల శూరులను నీచేతికి అప్పగించుచున్నాను. మీరందరు యుద్ధసన్నద్ధులై పట్టణమును ఆవరించి యొకమారు దానిచుట్టు తిరుగ వలెను. ఆలాగు ఆరు దినములు చేయుచు రావలెను. ఏడుగురు యాజకులు పొట్టేలుకొమ్ము బూరలను పట్టుకొని ముందుగా నడువవలెను. ఏడవ దినమున మీరు ఏడు మారులు పట్టణముచుట్టు తిరుగుచుండగా ఆ యాజకులు బూరల నూదవలెను. మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా మీరు బూరలధ్వని వినునప్పుడు జను లందరు ఆర్భాటముగా కేకలు వేయవలెను, అప్పుడు ఆ పట్టణ ప్రాకారము కూలును గనుక జనులు తమ యెదుటికి చక్కగా ఎక్కుదురు అనెను. '' ప్రభువు కేవలం గోడ చుట్టూ తిరుగుతూ స్తుతించమని ఆజ్ఞాపించాడు. ఇశ్రాయేలీయులు అలాగున చేసినప్పుడు, యెరికో గోడలు కూలిపోయినవి. అదే విధంగా, ప్రభువు ఈ రోజు మీ జీవితంలో ఇలాంటి గొప్ప కార్యములను జరిగిస్తాడు. 1 థెస్సలొనీకయులకు 5:18 లో బైబిలు ఇలా చెబుతుంది, " ప్రతి విషయమునందును కృతజ్ఞతా స్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము '' అన్న వచనము ప్రకారము కాబట్టి, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు ఎదుర్కొంటున్న క్లిష్టమైన పరిస్థితులన్నిటిని బట్టి ప్రభువుకు కృతజ్ఞతలు తెలుపుతూ, ఆయనను స్తుతించినట్లయితే, యెరికో గోడలు కూలినట్లుగా, ఆయన మీ సమస్యలన్నియు కుప్పకూలిపోవునట్లు చేసి, మీ భయాందోళన నుండి మిమ్మల్ని విడిపించి, ఆనందముతో పరవశించునట్లు చేస్తాడు.
Prayer:
కృపాకనికరము కలిగిన మా పరలోకమందున్న తండ్రీ,
 
ప్రభువా, మేము ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి, ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞతలు మరియు స్తుతులు చెల్లించడానికి మాకు సహాయము చేయుము. ప్రభువైన యేసయ్యా, నీవు మా జీవితమును ఎల్లప్పుడు నీ కట్టుబాటులో ఉంచుకున్నందుకై నీకు వందనములు చెల్లించుచున్నాము. దేవా, మా పరిస్థితులను చూచి, భయపడకుండా, నిన్ను ఎప్పుడూ స్తుతించటానికి మాకు నీ యొక్క గొప్ప కృపను అనుగ్రహించుము. మా పెదవుల నుండి స్తుతులు మరియు కృతజ్ఞతలు మాత్రమే ఉండనివ్వుము. కష్టాలన్నిటిలోను ఎల్లప్పుడు మేము వాటిని చూచి, చింతించకుండా మరియు ఎప్పుడూ భయముతో ఉండకుండా, ప్రభువైన యేసు నిన్ను ఎల్లప్పుడు స్తుతించడానికి మరియు కృతజ్ఞతలు తెలియజేయుటకు మాకు సహాయము చేయుము. మరోసారి, ప్రభువా, ఈ వాగ్దాన వచనములపై నమ్మకము కలిగి జీవించునట్లుగా మాకు సహాయము చేయుమని సమస్త స్తుతి ఘనత మహిమ నీకే చెల్లించుచు యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

For Prayer Help (24x7) - 044 45 999 000