Loading...
Evangeline Paul Dhinakaran

దేవునిని ఆనుకొన్నవారికి పరిపూర్ణ సమా‘దానం!

Sis. Evangeline Paul Dhinakaran
25 Sep
ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచియున్నాడు.
నా ప్రియమైనవారలారా, ఈ వె‘్‌సైట్ మీరు దేవుని యొద్ద నుండి సంపూర్ణమైన సమా‘దానమును శాంతిని పొందాలని ఆయన మీ పట్ల వాంఛ కలిగియున్నాడు.  ఆయన సమా‘దానము మాత్రమే కాకుండా, పరిపూర్ణమైన శాంతిని అనుగ్రహించే దేవుడైయున్నాడు. కావుననే, ఆయన యొక్క పరిపూర్ణమైన శాంతిని మీకనుగ్రహించి మిమ్మును పరవశింపజేస్తాడు. ఈ వె‘్‌సైట్ చూచు మీ కుటుంబములో సమా‘దానములేకుండా అశాంతితో నిండుకొనియున్నదా? మా కుటుంబములో సమా‘దానమే లేదు అంటున్నారా? ఇంకను మేము ఏ వి‘దముగా ఈ దైవిక సమా‘దానమును పొందగలము? అని చింతించుచున్నారా? కలవరపడకండి, మన దేవుడు ‘‘ సమా‘దాన కర్తయగు అ‘దిపతి’’ అటువంటి దేవునిని ఆనుకొనవలెనని వాక్యము చెబుతుంది,  ‘‘ ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణశాంతిగలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీయందు విశ్వాసముంచి యున్నాడు ’’ (యెషయా 26:3) అన్న వచనము ప్రకారము దేవుడు మనలను పరిపూర్ణ సమా‘దానముతో నింపుతాడు. ఎంతో మంది గహిణులు, ‘‘ నా భర్త/భార్య నన్ను విడిచిపెట్టిపోయాడు ’’, ‘‘ మా కుటుంబములో ఎల్లప్పుడు గొడవలే, అని చెప్పి ‘ా‘దపడుచున్నారు. అయితే, మీరు దేవుని ఆశ్రయించి, పూర్ణ హదయముతో దేవుని వెదకుచున్నారు గనుక దేవుడు మిమ్మును పరిపూర్ణ సమా‘దానముతో నింపును. గనుక ఆనందముగా ఉండండి.
 
ఒకసారి ఒక భార్య తన భర్తచే విడిచిపెట్టబడినందున తన పుట్టింటికి వెళ్లిపోయింది. అక్కడ ఆమె రోజులు, నెలలు కన్నీటితోను ఒంటరితనముతోను గడిపినది. భర్త ఎక్కడకు వెళ్లిపోయాడో కూడ తనకు తెలియదు. అతని నుండి ఎటువంటి సమాచారం లేదు. ఆమె తన కన్నీటిని దేవుని యొద్ద కుమ్మరించుచు, విశ్వాసమును కోల్పోకుండ, ప్రార్థించుచూనే ఉన్నది.  కానీ, తన చుట్టు ఉన్న ప్రజలు ఆమెపై జాలితో, ‘‘ అనవసరముగా నీ భర్త తిరిగి వస్తాడని ఆశించి ఇన్ని సంవత్సరములు వ్యర్థముగా కన్నీటితో గడిపావు. ఇకపై వస్తాడనే నమ్మకము లేదు. నీవు అతనితో కొన్ని సంవత్సరములు మాత్రమే జీవించావు. గనుక, ఆ విషయమును మరచిపోయి మరొక వ్యక్తిని వివాహం చేసుకొని, నీ జీవితమును తిరిగి ప్రారంభించు ’’ అని చెప్పారు. కానీ, ఆమె ‘‘ నా దేవుడు నాకు సహాయం చేస్తాడు ’’ అని చెప్పి వారి మాటలను తిరస్కరించింది. సంవత్సరము గడిచి పోయింది. అద్భుతం జరిగింది. తన భర్త తన వద్దకు తిరిగి వచ్చి, తనతో జీవించుటకు ప్రారంభించాడు. అందరు అది చూచి, ఆశ్చర్యపోయారు. ‘‘ దేవుడే ఆ కార్యము చేశాడు ’’ అని చెప్పి, వారు దేవుని మహిమపరచారు. ఆమె దేవుడే తన భర్త తిరిగి వచ్చుటకు సహాయము చేశాడని సా‘ ్యం చెప్పుటకు ప్రారంభించింది. అంతమాత్రమే కాదు, ఆమె దేవునిని ఆనుకొన్నందున ఆమె పరిపూర్ణ ఆనందముతోను సమా‘దానముతోను నింపబడినది.
అదేవి‘దంగా, నా ప్రియులారా, నేడు ఎంత మంది కుటుం‘ాలలో సమా‘దానము లేదో వారందరు కూడ, ‘‘ తండ్రీ, మాకు వేరే మార్గములేదు ’’ అని దేవుని ఆశ్రయించినట్లయితే, ఎటువంటి సమస్య మీకు ఎదురవ్వదు. మీరు సమస్తమును దేవునికి అప్పగించినప్పుడు, ‘‘ నీ భారము యెహోవా మీద మోపుము; ఆయనే నిన్ను ఆదుకొనును; నీతిమంతులను ఎన్నడును కదలనీయడు’’ ( కీర్తనలు 55:22) అను వచనము ప్రకారము ఆయన ఆశ్రయములో మీరు నడుచుకొనినప్పుడు, మీ పరిస్థితి ఏదైనను, దేవుడు మీ హదయమును పరిపూర్ణ సమా‘దానముతో నింపుతాడు.  అప్పుడు మీ సమస్య నుండి సులభముగా మీరు విడిపించబడి సంపూర్ణ సమా‘దానముతోను శాంతితోను నింపబడుదురు. అప్పుడు మీ సమస్య నుండి సులభముగా బయటపడెదరు.
 
 ఆవి‘దంగానే, నా ప్రియులారా, దేవుడు వాగ్దానము చేసినట్లయితే, ఆయన నిశ్చయముగా  ఆయన వాక్కును నెరవేరుస్తాడు. అందుకే ‘ైబిలేమంటుందో చూడండి,  ‘‘ ఆయన మాట సెలవియ్యగా దాని ప్రకారమాయెను ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను’’ (కీర్తనలు 33:9) అని దేవుని వాక్యము సెలవిచ్చుచున్నది. కనుక దేవుడు మీ జీవితములోని సమస్యలను సులభముగా తొలగిస్తాడు. ఎప్పుడనగా, మీరు పరిశుద్ధాత్మ అభిషేకమును పొందినప్పుడు, దేవుడు మీ సమస్యలన్నిటిని తొలగించి, మిమ్మును విడిపిస్తాడు. నేడు మీ కుటుంబములో కొరతలు ఏవైన వున్నట్లయితే, నేడు ఆయన పరిపూర్ణుడు కనుకనే, ఆయన పరిపూర్ణత మీలోనికి వచ్చినప్పుడు, ‘‘ అవును పరిపూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది, నిరర్థకమగును’’  (1 కొరింథీయులకు 13:10) అన్న వచనము ప్రకారము మీరు దేవునిని వేడుకొన్నట్లయితే, సంపూర్ణమైన సంతోష సమా‘దానములతో ఆయన మిమ్మును నింపుతాడు.
 
నా ప్రియులారా, ఈలోక ప్రజలకు శాంతికర్తయైన దేవుడు ఆ ప్రభువు మాత్రమే. ఆయన అన్నివేళల మీకు తోడుగా వుంటే ఎంత ‘ాగుండు కదా! అని తలంచుచున్నారా? ఈ వె‘్‌సైట్ చూచు మీకు సమస్యలు తెచ్చే ఈ అపవాది శక్తులను అంతం చెయ్యడానికి ప్రభువు మీ చుట్టూ కంచె వేస్తున్నాడు, కావుననే, నేడు మీరు చేయవలసిన కార్యమేదనగా, మీరు ఆయనను ఆనుకొనియుండాలి. తద్వారా మీకు పరిపూర్ణ శాంతి కలుగుతుంది. ‘ ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణశాంతి గలవానిగా కాపాడుదువు ’ అని ‘ైబిల్ చెప్పినట్లుగా ఈ వె‘్‌సైట్ చూచు మీ మనస్సులు దేవునిని ఆనుకొనునట్లు చేయండి, అప్పుడు మీ కుటుంబములోను, మీ వ్యక్తిగత జీవితములోను అపవాది మిమ్మును అంటదు, దేవుడు మీకు పూర్ణ శాంతిని కలుగజేస్తాడు. ఎటువంటి మానవ శక్తులైనను, అపవాది శక్తులు, ఇంకను మంత్ర శక్తులు, శాంతిని పాడు చేయు అపవాది శక్తులు మిమ్మును ఇక ఎన్నటికిని ముట్టుకోవు. ఆయన పూర్ణ శాంతిగలవారినిగా నింపి మిమ్మును సమద్ధిగా దీవిస్తాడు.
Prayer:
సర్వోన్నతుడవైన దేవా, దయగల తండ్రీ,
 
నీ పాదాలకు స్తుతులు చెల్లించుచున్నాము. ఈ లోకములో జీవించే మాకు ఎటుచూ చిన శాంతి లేదు. శాంతి లేని ఈలోకములో జీవించే మాకు నీవు పరిపూర్ణ శాంతిని అనుగ్రహించుము. మా భారములు పర్వతమువలె మా ఎదురుగా కనిపించుచున్నవి. వాటిని మంచు వలె కరిగించి మాకు పరిపూర్ణ శాంతిని దయచేయుము.  ఎల్లప్పుడు నీవు పొందిన శ్రమలను తలపోయుటకు మా దష్టిని కల్వరి సిలువలో వ్రేలాడుచున్న నీవైపు చూచుటకు మాకు సహాయము చేయుము. నీ ముఖకాంతి మాపై ప్రకాశింపజేసి మా దుఃఖాలన్నిటిని, భారాలన్నిటిని, సమస్యలన్నిటి నుండి మమ్మును విడిపించి మమ్మును పరిపూర్ణ శాంతితో నింపుము. మా పరిసర ప్రాంతాలలోను, మా ఉద్యోగ స్థానములోను, మా వ్యక్తిగత జీవితాలలో అలుముకున్న ఆశాంతిని తొలగించి మమ్మును పరిపూర్ణ శాంతితోను దైవీకమైన సమా‘దానముతో నింపుమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

For Prayer Help (24x7) - 044 45 999 000