Loading...
Paul Dhinakaran

పరిపూర్ణమైన ఆశీర్వాదాలు!

Dr. Paul Dhinakaran
14 Oct
నా ప్రియమైన స్నేహితులారా, దేవుని వాగ్దానంగా ఈ రోజు ఈ సందేశము చదువుచున్న మీకు యెహెజ్కేలు 34:26 నుండి ఎన్నుకొనబడినది. నేడు ఈ వచనమును దేవుడు వాగ్దానం చేయుచున్నాడు. " వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చేయుదును. ఋతువుల ప్రకారము వర్షము కురిపించెదను, దీవెనకరమగు వర్షములు కురియును.'' నా స్నేహితులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు దేవుని పర్వతము మరియు మీరు ఆయన సీయోను. దేవుడు సీయోనును ప్రేమించుచున్నాడు. మీరు ఆయనను మీ హృదయంలో కలిగి ఉన్నప్పుడు, మీరు దేవుని నివాస స్థలముగా మార్చబడెదరు! దేవుడు " నేను ఎక్కడ ఉంటానో, అక్కడ ఒక ఆశీర్వాదం ఉంటుంది '' అని చెప్పుచున్నాడు. అందుకే ప్రతిరోజు ఉదయాన్నే మీరు ఆయనను స్తుతించాలి.

నా ప్రియులారా, దేవుడు నేడు ఈ సందేశము చదువుచున్న మీలో మరియు మీ కొరకు పరిపాలన చేయుచున్నాడు. " ఆయన రెక్కలు ఆరోగ్యము కలుగజేయుటకు ఆయన మీలో లేచియున్నాడు. గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేయుదురు.'' ప్రభువు మీ కాళ్ల క్రింద వారిని చితుకత్రొక్కుతాడు. ఎందుకనగా, ఈ సందేశము చదువుచున్న మీరు దేవుని పర్వతము. కాబట్టి, ఇది మీకు లభించిన గొప్ప ఆశీర్వాదం. అప్పుడు దేవుడు, " ఋతువుల ప్రకారము వర్షము కురిపించెదను, '' అని సెలవిచ్చుచున్నాడు. మీరు ప్రసంగి 3:11 చదివినట్లయితే, దేవుడు, " దేనికాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించియున్నాడు '' అని తెలియజేయుచున్నాడు. ఇంకను ఆయన, ' ఒక గొప్ప పంటను మరియు చక్కటి ఫలములను తీసుకొని వచ్చునట్లుగా నేను మీ జీవితంలో దేనికాలమునందు అది చక్కగా నుండునట్లు దీవెనకరమైన జల్లులను పంపుతాను,' అని సెలవిచ్చుచున్నాడు.
అవును నా ప్రియులారా, యెహెజ్కేలు 34 మరియు యోవేలు 2:23 లో, బైబిల్‌నందు, " సీయోను జనులారా, ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి; తన నీతినిబట్టి ఆయన తొలకరి వర్షమును మీకనుగ్రహించును, వాన కురిపించి పూర్వమందువలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకనుగ్రహించును. '' కాబట్టి, నేడు ఈ సందేశము చదువుచున్న మీరందరు చేయవలసినదల్లా, దేవుని యందు సంతోషించడమే. ఎందుకంటే, దేవుడు తన పర్వతమును అలంకరించడానికి నమ్మదగినవాడు, ఇది దేవుని హృదయం! యెషయా 60:22 లో దేవుడు ఈలాగున సెలవిచ్చుచున్నాడు, " వారిలో ఒంటరియైనవాడు వేయిమందియగును ఎన్నికలేనివాడు బలమైన జనమగును యెహోవానగు నేను తగినకాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును.'' ఫలములు మరియు పంట ద్వారా దేవుడు మిమ్మల్ని సంతోషపెట్టడమే కాదు; ఆయన మిమ్మల్ని వెయ్యి రెట్లుగా విస్తరింపజేయడానికి కూడా సమృద్ధినిస్తాడు. భయపడవద్దు. కారణము, యేసు మిమ్మల్ని ప్రేమించుచున్నాడు. మీరు ఆయన పర్వతము. నేడు ఈ సందేశము చదువుచున్న మీరు ఆశీర్వాదపు జల్లులతో ఘనపరచబడతారు.
Prayer:
సర్వకృపలకు ఆధారభూతుడవైన మా ప్రియ పరలోకపు తండ్రీ,

ప్రభువా, అన్ని విషయాలలో కూడ మేము మనుష్యుల యందు నమ్మకముంచకుండా, నీ వైపు చూచుచు, నీ యందు మాత్రమే నమ్మకముంచుటకు మాకు అటువంటి హృదయమును దయచేయుము. మా యొక్క విశ్వాసమును చూచి, మేము పోగొట్టుకున్న వాటన్నిటిలో నూరంతలు ఫలమును మాకు దయచేయుము. దేవా, నీ యొక్క ఆశీర్వాదములను మేము పొందునట్లుగా, మమ్మును సిద్ధపరచుము. ప్రభువా, మేము నీ ఎల్లప్పుడు సంతోషించునట్లుగా చేయుము. దేవా, మా జీవితములో దేనికాలమందు అది చక్కగా ఉండునట్లుగా మా మీద నీ ఆశీర్వాదపు జల్లులను కురిపించుము. ప్రభువా, ఒంటరియైన మమ్మల్ని వేయిమందియగునట్లుగాను, ఎన్నికలేని మమ్మల్ని బలమైన జనమగునట్లు యెహోవానైన నీవు తగినకాలమున ఈ కార్యమును త్వరపెట్టుట్టుమని సమస్త, స్తుతి ఘనత మహిమ నీకే చెల్లించుచు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.
 

For Prayer Help (24x7) - 044 45 999 000