Loading...

మీకు సమాధానమును మరియు సమృద్ధినిస్తాడు!

Shilpa Dhinakaran
30 Oct
నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీ సరిహద్దులలో సమాధానమును మరియు తృప్తిపరచి మరియు మంచి గోధుమలతో మిమ్మల్ని సంతృప్తిపరుస్తానని దేవుడు ఈ రోజు వాగ్దానం చేయుచున్నాడు. అందుకే బైబిలేమంటుందో చూడండి, " నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయువాడు ఆయనే మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే '' (కీర్తనలు 147:14) అన్న వచనము ప్రకారము ప్రభువు మీ ఇంటిలోను, మీ కార్యాలయంలోను మరియు మీ పొరుగువారితోను మీకు సమాధానమును ఇవ్వబోతున్నాడు. చింతించకండి. అయినను, ఏదియు మీకు హాని కలిగించదు. ఒక రాజు, తన దేశంలోని ప్రతి ఒక్కరిని పిలిచి, సమాధానమును వర్ణించే చిత్రాలను గీయమని చెప్పిన ఒక కథ నాకు గుర్తుకు వచ్చినది. ప్రతి ఒక్కరికి శాంతియుతంగా అనిపించే చిత్రపటాలను వారు గీయమని ఆయన తెలిపారు. ప్రతి వ్యక్తి వేర్వేరు విషయాలను వర్ణించే చిత్రాలను గీశారు. అయితే, కొందరు పర్వతాలను ఆకర్షించునట్లుగా గీశారు. మరికొందరు పువ్వులు గీశారు. ఇంకను మరికొందరు పక్షులను ఆకర్షించునట్లుగా ఒక చిత్రపటమును గీశారు.

ప్రతి ఒక్కరూ ఒక ప్రత్యేకమైన చిత్రపటం వైపు చూచినప్పుడు, అందులో అందమైన పర్వతాలు మరియు నదులను చూశారు. ఈ చిత్రపటం తప్పకుండా రాజు చేత ఎన్నుకోబడి, గెలుస్తుందని వారు భావించారు. కానీ, రాజు వచ్చి వేరే చిత్రపటంను చూపించాడు. ఆ చిత్రపటంలో వర్షపాతం, ఉరుములు, మెరుపులు ఇలాగున ఎన్నో గీయబడియున్నాయి. కానీ, ఆ చిత్రపటం యొక్క అందం ఏమిటంటే, ఒక చెట్టుపై ఒక చిన్న గూడులో పక్షులు సంతోషంగా ఎంతో నెమ్మదిగా కిచకిచలాడుచు ఉండుట కనిపించాయి. ఆ చిత్రపటం రాజు యొద్ద నుండి బహుమానము పొందుకొనెను. నా ప్రియమైన స్నేహితులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు ఎల్లప్పుడు గుర్తుంచుకోండి, ప్రపంచంలో ఎప్పుడూ హడావిడి మరియు గందరగోళం ఉన్నప్పటికిని, ప్రభువు మీకు సమాధానమును మరియు శాంతిని ఇస్తానని వాగ్దానము చేయుచున్నాడు. కాబట్టి, శాంతి సమాధానము లేదని చింతించకండి!
నా ప్రియులారా, పక్షులు తమ గూడులో ఎలా సంతోషంగా కూర్చొని కిచకిచలాడుకుంటూ సమాధానముతో కనిపించాయో, ఆలాగుననే నేడు ఈ సందేశము చదువుచున్న మీ చుట్టు ఏమి జరిగినా దేవుడు మీ హృదయాన్ని ఆనందంగా మరియు సమాధానముగా ఉంచుతాడు. ఈ లోకములో పరిస్థితులు కీడు కల్పించునవిగా ఉన్నప్పటికిని, దేవుని శాంతి సమాధానము మీ హృదయాన్ని నిత్యము కాపాడుతుంది. అందుకే యేసు, " శాంతి మీ కనుగ్రహించి వెళ్లుచున్నాను; నా శాంతినే మీ కనుగ్రహించుచున్నాను; లోకమిచ్చునట్టుగా నేను మీ కనుగ్రహించుటలేదు; మీ హృదయమును కలవరపడనియ్యకుడి, వెరవనియ్యకుడి '' (యోహాను సువార్త 14:27) అన్న వచనము ప్రకారము కాబట్టి ప్రభువు మిమ్మల్ని లోకము ఇచ్చే శాంతితో కాకుండా, ఆయన మిమ్మల్ని తన శాంతితో నింపుతాడు. ఆయన మీకు కావలసిందల్లా అనుగ్రహిస్తాడు మరియు మిమ్మల్ని అభివృద్ధిపరుస్తాడు. ప్రభువుపై మీ మనస్సును ఆనుకొని జీవించునట్లుగా చేయండి. అంతమాత్రమే కాదు, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు చేయవలసిందల్లా, ఆయన హస్తాలకు మిమ్మల్ని సమర్పించుకొని, ఆయనను ఆనుకొని జీవించినట్లయితే, అందుకే బైబిలేమంటుందో చూడండి, " ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణశాంతిగలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి యున్నాడు '' (యెషయా 26:3) అన్న వచనము ప్రకారము కాబట్టి ఈ వాగ్దానాన్ని విశ్వసించి, ఈ వాగ్దానానికి ఆయనకు కృతజ్ఞతలు తెలియజేయండి. నిశ్చయముగా, ఆయన మీ సరిహద్దులలో సమాధానమును కలుగజేసి, మంచి గోధుమలతో మిమ్మల్ని తృప్తిపరచి, సమృద్ధి దీవెనలతో మిమ్మల్ని వర్థిల్లజేస్తాడు. 
Prayer:
కృపకు పాత్రుడవైన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ,

నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకై నీకు వందనములు చెల్లించుచున్నాము. ప్రభువా, నీ మాటలను మా హృదయములో భద్రపరచుకొనుటకు మాకు సహాయము చేయుము. దేవా, మా చుట్టు ఉన్న గందరగోళపు పరిస్థితులను మేము చూడకుండా, నీ వైపు చూచుటకును మరియు నిన్ను ఆనుకొని జీవించుటకు మాకు సహాయము చేయుము. పై చెప్పబడిన చిత్రపటంలో ఉన్న పక్షుల వలె మా చుట్టు పరిస్థితులు ఎలాగున ఉన్నను సరే, మా హృదయమును, కుటుంబాన్ని మరియు కార్యాలయాన్ని నీ యొక్క శాంతితో నింపుము. మాకు ఏమీ హాని కలిగించకుండునట్లుగాను లేదా మా మనస్సునకు భంగం కలిగించే కార్యాలు ఏవైనను సరే, వాటి వైపు మేము చూడకుండా, నిన్ను విశ్వసించి, నీలో విశ్రాంతి పొందటానికి మాకు సహాయం చేయుము. గాలిలో పక్షులు మరియు పొలంలోని పువ్వులు నీ సంరక్షణలో విశ్రాంతి తీసుకున్నట్లే మా హృదయం మరియు మనస్సు కూడా నీ శాంతి సమాధానములతో కాపాడి సంరక్షించుమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

For Prayer Help (24x7) - 044 45 999 000