Loading...
Samuel Paul Dhinakaran

మీ అసమర్థతలను అధిగమించండి!

Samuel Dhinakaran
29 May
నా ప్రియమైన స్నేహితులారా, నేడు మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ సందేశము చదువుచున్న మిమ్మల్ని ఎత్తైన స్థలములలో నిలపాలని మీ పట్ల కోరుచున్నాడు. కాబట్టి, ఈ రోజు దేవుడు మీకు చేసిన వాగ్దానం కీర్తనలు 18:33 నుండి తీసుకొనబడినది. ఆ వచనము, " ఆయన నా కాళ్లు జింక కాళ్లవలె చేయుచున్నాడు ఎత్తయిన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు.'' అవును, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు ఈరోజు మంచాన పడి, కాళ్లు కూడా కదల్చలేక, మీ పనిని మీరు చేయలేని, మీ పరిచర్యను చేయలేని వ్యక్తి కావచ్చును. కానీ, దేవుడు మిమ్మల్ని లేడి కాళ్లవలె మారుస్తానని మీ పట్ల వాగ్దానము చేయుచున్నాడు. అప్పుడు మీరు వేగంగా పరుగెత్తుతారు మరియు మీ పని చేయడానికి ఎత్తయిన స్థలముల మీదికి మీరు లేవనెత్తబడుదురు.

నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీ బలహీనత మీ అభివృద్ధిని ఇకపై ఎన్నడును ఆపలేదు. మీరు ఇకపై మీ బాధలతో దుఃఖించరు. కానీ, మీ జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోడానికి మీ స్వంత ప్రయత్నాలు మరియు సామర్థ్యాలపై ఆధారపడినట్లయితే, ఇది ఎల్లప్పుడూ ఫలించదు. మిమ్మును ఆశీర్వదించమని మరియు ఆయన మార్గాలలో మిమ్మల్ని నడిపించమని ప్రభువును కోరడం చాలా అవసరం. ఈ రోజు ఆయన వాగ్దానాన్ని బట్టి దేవుని మీ జీవితములో ప్రధమ స్థానముగా ఎన్నుకొనండి. దేవుడు తానే మీ పాదాలను జింక పాదాల వలె చేస్తానని వాగ్దానము చేయుచున్నాడు. ఆయన మీ పాదాలను, శరీరాన్ని బలపరుస్తాడు మరియు మిమ్మల్ని పైకి లేవనెత్తుతాడు మరియు ఆయన మిమ్మల్ని ఎత్తయిన స్థలముల మీద నిలబడేలా చేస్తాడు. మీరు అనారోగ్యంతో మరియు వ్యాధి పడకలో ఉండి లేవలేని స్థితిలో ఉన్న కాలమంతయు మీకు మరల పునరుద్ధరించబడుతుంది. రెట్టింపు వేగంతో, ఆయన మిమ్మల్ని ఎంతో ఎత్తయిన స్థలమునకు ఎక్కిస్తాడు.
నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు పోగొట్టుకున్నవన్నీ దేవుడు మిమ్మును తిరిగి పొందేలా చేస్తాడు. ఆయన జీవితంలోని అన్ని రంగాలలో మిమ్మల్ని స్థిరపరుస్తాడు. మీరు ఎత్తయిన స్థలములకు ఎత్తబడుదురు. బేతెస్ద కొలను ప్రక్కన పక్షవాతానికి గురైన ఒక వ్యక్తికి సరిగ్గా ఇదే జరిగింది. అక్కడ ముప్పది యెనిమిది ఏండ్ల నుండి వ్యాధిగల యొక మనుష్యుడుండెను. అతనికి సహాయం చేయడానికి లేదా అతనిని స్వస్థపరచడానికి ఎవరూ లేరు. అయినప్పటికి అతను యేసుచే తృణీకరించబడలేదు. యేసు, వాడు పడియుండుట చూచి, వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలోనున్నాడని యెరిగి స్వస్థపడగోరుచున్నావా? అని వాని నడుగగా, యేసు " నీవు లేచి నీ పరుపెత్తికొని నడువుమని వానితో చెప్పగా, '' వెంటనే వాడు స్వస్థతనొంది తన పరుపెత్తికొని నడిచెను. యేసు ప్రభువు అతనిని తృణీకరించలేదు. అవును, మన ప్రభువు అతని దగ్గరకు వెళ్లి స్వస్థతను చేకూర్చాడు. తద్వారా, అతను తనంతట తానే స్వయంగా లేచి నిలువబడి తన చేతులతో శ్రమించి పని చేయగలిగాడు. అవును, ప్రియమైన స్నేహితులారా, దేవుడు నేడు ఈ సందేశము చదువుచున్న మీ కోసం కూడా అలాగే చేయబోతున్నాడు. కాబట్టి, ఉత్సహించండి మరియు ఘనపరచడానికి ఎత్తయిన స్థలములకు లేవనెత్తబడుటకు నేడు ఈ సందేశము చదువుచున్న మీరు దేవుని నమ్ముకొనినప్పుడు మీ దీవెనలు శాశ్వతమైనవిగా ఉంటాయి. మీ స్వంత ప్రయత్నాల ద్వారా మీరు కూడబెట్టిన సంపద మరియు కీర్తి కాలక్రమేణా నశించిపోవచ్చును. కానీ, ప్రభువు యొక్క ఆశీర్వాదం మీకు తగిన సమయంలో ఫలాలను ఇచ్చి, మిమ్మును ఎత్తయిన స్థలములకు ఎక్కునట్లుగా, నడుచునట్లుగా చేసి మిమ్మును వర్థిల్లజేయును.
Prayer:
ప్రేమామయుడవైన మా పరలోకపు తండ్రీ,

ఈ చక్కటి వాగ్దానానికై నీకు వందనాలు. నేడు దీన స్థితికి దిగిజారిపోయిన మమ్మును ఎత్తయిన స్థలమునకు ఎక్కించుము. దేవా, ఎంతో కాలము నుండి స్వస్థపరచలేని దీర్ఘకాలిక వ్యాధులను కలిగియున్న మమ్మల్ని నీవు స్వస్థపరుస్తున్నందుకై నీకు వందనాలు. దేవా, నీ నామ మహిమ కొరకు ఈ లోకములో మమ్మును ఎత్తయిన స్థలములకు ఎదుగునట్లు చేయుము. దేవా, మా పనుల భారము నీ మీద మోపుటకు మాకు సహాయము చేయుము. దేవా, మా పట్ల నీ ఉద్దేశములు సఫలమగునట్లు మా హృదయములోనికి నిన్ను ఆహ్వానించు చున్నాము. దేవా, బలహీనమైన మా కాళ్లను మరియు మా జీవితాలను బలపరచుటకును మరియు మేము ఎక్కలేని ఉన్నత స్థానమునకు ఎక్కించుటకు నీవు మాత్రమే సమర్థుడవు. నీవు తప్ప మాకు ఎవ్వరు లేరు. కాబట్టి, నీ కృపాసింహాసనము యొద్దకు మేము వస్తున్నాము, దయతో మా కాళ్లను లేడి కాళ్లవలె చేయుము. ఈనాడు మేమున్న దీనస్థితిని మార్చి, ఎత్తయిన స్థలములకు మమ్మల్ని ఎక్కించుము. ప్రభువా, నీవు మా యందు ప్రీతికలిగియుండునట్లు, మాలో ఉన్న ప్రతి కల్మషమును కడిగి శుభ్రపరచి, నీ రక్షణతో మమ్మల్ని అలంకరించుము. దేవా, నేడు మేము తలపెట్టిన ప్రతి ప్రణాళికను మరియు లక్ష్యాలను, ఉద్దేశములను నీకు ప్రీతిగా ఉండునట్లును మరియు నీ చిత్తప్రకారము మా పట్ల కార్యములను సఫలపరచుమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

For Prayer Help (24x7) - 044 45 999 000