Loading...

మీకు ఏ హాని కలుగకుండా కాపాడే శక్తిగల దేవుడు!

Shilpa Dhinakaran
09 Nov
నా ప్రియులారా, నేడు సర్వశక్తిమంతుడైన దేవుడు మీతో కూడ ఉన్నాడు. ఆయన మీకంటే ముందుగా వెళ్లి, మీరు ఎదుర్కొనే ప్రతి సమస్యను పరిష్కరిస్తాడు. " నన్ను బట్టి మనుష్యులు నీకు భయపడునట్లు చేసెదను. నీవు పోవు సర్వ దేశముల వారిని ఓడగొట్టి నీ సమస్త శత్రువులు నీ యెదుట నుండి పారిపోవునట్లు చేసెదను '' (నిర్గమకాండము 23:27) అన్న వచనము ప్రకారము నేడు ఈ సందేశము చదువుచున్న మీకు వ్యతిరేకంగా ఏ వ్యక్తి నిలబడలేడు. మీకు వ్యతిరేకంగా కోపంగా ఉన్నవారు పారిపోవునట్లు చేస్తాడు.

ఆఫ్రికాకు చెందిన ఒక మిషనరీ గురించి ఒక ప్రసిద్ధ కథ ఉన్నది. అతను ఒక చిన్న క్షేత్ర ఆసుపత్రిలో పనిచేస్తున్నాడు మరియు రెండు వారాలకు ఒకసారి అతను తన సైకిల్‌ను తీసుకొని అడవి గుండా సమీప నగరానికి తనకు కావలసిన సరుకులు కొనడానికి వెళ్లేవాడు. అతను తిరిగి వచ్చేటప్పుడు ఇద్దరు వ్యక్తులు మార్గమున ఒకరితో ఒకరు అడవి మధ్యలో పోట్లాడుకొనుచుండగా, ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. తాను వెంటనే అతని గాయాలకు చికిత్స చేశాడు మరియు అతనితో క్రీస్తు ప్రేమను పంచుకున్నాడు మరియు అతన్ని తిరిగి తన నగరానికి పంపాడు.

కొన్ని వారాల తరువాత, గాయపడిన వ్యక్తి నగరానికి వచ్చినప్పుడు ఆ మిషనరీని కలిశాడు. మిషనరీని చూసినప్పుడు, అతడు చేయబోయిన ఒక నేరాన్ని గుర్తుచేసుకున్నాడు, ఇదే మిషనరీ అడవి మధ్యలో గాయపడిన అతనికి చికిత్స చేయుటకు కొంతకాలం క్రితం జరిగిన ఒక సంఘటన ఇది. అతను మరియు అతని స్నేహితులు ఆ మిషనరీ డబ్బును దోచుకొని, అడవి మధ్యలో చంపడానికి యోచిస్తున్నారని అతను చెప్పాడు. వారు తమ కత్తులను బయటకు తీసి అతని మీద దాడి చేయాలని చూసినప్పుడు, అతని చుట్టు 26 మంది సైనికులు కాపలా కాస్తున్నట్లుగా కనిపించారని అతను ఆ మిషనరీతో చెప్పాడు. అది విని, మిషనరీ నవ్వుతూ తాను ఒంటరిగా ప్రయాణిస్తున్నందున అది అసాధ్యమని అన్నాడు. అయితే, ఆ యువకుడు అంతటితో ఆపుకోలేదు. అతను, ' లేదు అయ్యాగారు, నేను మాత్రమే కాదు, నాతో ఉన్న నా స్నేహితులు కూడా ఆ సైనికులను చూశారు మరియు మేము అందరం వారిని లెక్కించాము. ఆ కాపలాదారుల వల్లననే మేము మీకు ఏ హాని చేయలేకుండా పోయాము అని చెప్పాడు.
అమెరికాలోని మిచిగాన్‌లోని తన ఇంటి దగ్గర చర్చిలో ఈ సంఘటనను మిషనరీ పంచుకున్నారు. కథ చెప్పుచున్న ఆ సమయంలో, సంఘములోని ఒక యువకుడు ఆతురుతలో నిలబడి పాస్టర్ను మధ్యలో ఆపాడు. అతను సంఘటన జరిగిన ఖచ్చితమైన తేదీ మరియు సమయాన్ని తెలుసుకోవాలనుకున్నాడు. ఆ యువకుడు ఇలా అన్నాడు, ' పాస్టర్, నేను అదే సమయంలో గోల్ఫ్ ఆడటానికి బయలుదేరాను మరియు మీ కోసం ప్రార్థించమని నాలో చాలా బలమైన ప్రేరేపణ కలిగినది. నేను వెంటనే సంఘములోని కొద్దిమంది సభ్యులను పిలిచాను మరియు మేము అందరం కలిసి ప్రార్థించాము మరియు మేమందరము కలిసి మొత్తము 26 మంది ఉన్నాము! ఎంత అద్భుతం! ' మిచిగాన్‌లో దేవుని ప్రజలు కలిసి ప్రార్థించినప్పుడు, ఆ మిషనరీని రక్షించడానికి దేవుడు తన దేవదూతలను ఆఫ్రికాలోనికి పంపించాడు. మనలను కాపాడటానికి మనకు ఎంత అద్భుతమైన దేవుడు ఉన్నాడు కదా!

నా ప్రియులారా, ప్రభువు దావీదును ప్రమాదం నుండి ఎలా రక్షించాడో మరియు దావీదు పట్ల దేవుడు ఎలా ఆనందించాడో బైబిల్లో మనం చదివియున్నాము. ఇశ్రాయేలీయుల రాజైన సౌలు కూడా దావీదునకు వ్యతిరేకంగా నిలబడలేకపోయాడు. ఆలాగుననే, నేడు ప్రభువు మనలో కూడా ఆనందిస్తాడు. ఎందుకంటే, మనం ఆయన యొక్క ప్రేమగల బిడ్డలము. మన చుట్టూ ఉన్న ప్రమాదాలన్నిటి నుండి ఆయన మనలను రక్షిస్తాడు మరియు బైబిలు చెప్పినట్లుగా, ఎవరూ మీకు వ్యతిరేకంగా నిలబడలేరు. " మీకు విరోధముగా రూపింపబడిన యే ఆయుధమును వర్ధిల్లదు '' (యెషయా 54:17) అన్న వచనము ప్రకారము మీ పక్షమున దేవుడు నిలువబడియున్నాడు. కాబట్టి, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు భయపడినప్పుడు, ఆయనను విశ్వసించి, ప్రార్థించినట్లయితే, ఆయన మీ ప్రక్కనే ఉన్నాడు మరియు మీరు ఆయన ప్రేమతో కప్పబడి ఉంటారు. కాబట్టి, మీ యెదుట ఎవరు కూడ నిలువకుండా పారిపోతారు. కాబట్టి, ధైర్యముగా ఉండండి. దేవుడు మిమ్మల్ని కాపాడి సంరక్షిస్తాడు.
Prayer:
సర్వశక్తిమంతుడవైన మా ప్రియ పరలోకపు తండ్రీ,

నీ రక్షణకు మరియు మేము ఎక్కడికి వెళ్ళినా ఎల్లప్పుడూ మమ్మల్ని చుట్టుముట్టే నీ దేవదూతల నిమిత్తము నీకు కృతజ్ఞతలు తెలియజేయుచున్నాము. మా దోషములను మరియు పాపముల నుండి మమ్మల్ని క్షమించుము. అపవాది యొక్క పధకాలకు వ్యతిరేకంగా మమ్మల్ని కాపాడినందుకు నీకు వందనములు చెల్లించుచున్నాము. మరియు మాకు వ్యతిరేకంగా ఎవరూ నిలబడకుండా చూసుకున్నందుకు వందనాలు. దేవా, మాకు విరోధముగా రూపింపబడిన యే ఆయుధమును వర్ధిల్లకుండా చేయుము. దేవా, మాకు విరోధముగా లేచు శత్రువులను నీవు పారిపోవునట్లు చేయుము. నీ దూతల సమూహాన్ని మాచుట్టు ఆవరించునట్లు సహాయము చేయుమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

For Prayer Help (24x7) - 044 45 999 000