Loading...

యెహోవా ఉత్తమమైనదాని ననుగ్రహించును!

Shilpa Dhinakaran
23 Nov
నా ప్రియ స్నేహితులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీకు ఉత్తమమైన దానిని మీకు అనుగ్రహిస్తానని వాగ్దానము చేయుచున్నాడు. ఈనాడు దేవుని నుండి వచ్చిన వాగ్దాన వచనము కీర్తన 85:12 నుండి ఎన్నుకొనబడినది. యెహోవా నిజంగా ఉత్తమమైన దానిని అనుగ్రహిస్తాడు, మన భూమి దాని ఫలమునిచ్చును. నేను వ్యక్తిగతంగా ఈ వాగ్దాన వచనమును ప్రేమిస్తున్నాను ఎందుకంటే, ఇది నా చిన్న వయస్సు నుండి ఇప్పటి వరకు నా జీవితంలో నెరవేరుతూ వస్తుంది. మా కుటుంబంలో ఏదైనా మంచి లేదా కీడు జరిగిన ప్రతిసారీ, ప్రభువు మనకు ఇచ్చినదానిని నేను పొందుకుంటాను, ఆయన ఉత్తమమైన దాని మాత్రమే అనుగ్రహిస్తాడు. మీ జీవితంలో ఎన్నో విషయాలు జరిగి ఉండవచ్చును, కానీ, ప్రభువు నిన్ను ప్రేమిస్తున్నాడని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి, మీరు ఆయన బిడ్డలు. కాబట్టి ఆయన మీకు హాని కలిగించే ఎటువంటి కార్యమును చేయడు. ప్రభువు ఇచ్చేవన్నీ ఉత్తమమైనవిగా ఉంటాయి.

నా ప్రియులారా, దేవుడు సమస్తమును సమకూడి మేలు కలుగునట్లు చేస్తాడు. అందుకే, రోమీయులకు 8:28 వ వచనము బైబిలు ఇలా చెబుతుంది, " దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పముచొప్పున పిలువబడినవారికి, మేలుకలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము. '' ఆయన ఉద్దేశ్యం ప్రకారం మీరు పిలువబడ్డారు. మనం ప్రభువును ప్రేమిస్తున్నప్పుడు మరియు మనల్ని ఆయన హస్తములలో అప్పగించినప్పుడు ఆయన మనకు సమస్తమును మేలైన వాటిని మాత్రమే అనుగ్రహిస్తాడు. నేను ఆశ్చర్యపోయిన నా జీవితంలో ఎన్నో సంఘటనలు నాకు గుర్తున్నాయి, ముఖ్యంగా నా పన్నెండవ తరగతి పరీక్షల సమయంలో నేను చాలా కష్టపడ్డాను, కానీ, నేను ఊహించిన మార్కులు రాలేదు. అయితే, అప్పుడు కూడా ప్రభువు మేలును మాత్రమే నా జీవితములో చేశాడు. ఆయన ఇప్పటికి నాకు ఒక అద్భుతమైన కళాశాలలో ప్రవేశం ఇచ్చాడు మరియు ఎంబిబియస్‌ను పూర్తి చేయడానికి నాకు కృపను అనుగ్రహించాడు, దీని నిమిత్తము నేను ప్రతి రోజు ప్రభువునకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాను. కాబట్టి నా స్నేహితులారా, ఇది ఒక చిన్న ఎదురుదెబ్బ అయినప్పటికీ, చింతించకండి. ఎందుకంటే, ప్రభువు మీ జీవితానికి మేలును మాత్రమే అనుగ్రహిస్తాడు.
అదేవిధంగా, దేవుని ఆజ్ఞానుసారంగా అబ్రాహం మరియు లోతు ప్రయాణించే ప్రదేశానికి వెళ్ళారని బైబిల్లో కూడా మనం చదివియున్నాము. వారు కనాను దేశమునకు దగ్గరకు చేరుకున్నప్పుడు, అబ్రాముతో కూడ వెళ్లిన లోతుకును గొర్రెలు గొడ్లు గుడారములు ఉండెను గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలక పోయెను; ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమైయుండెను. కాబట్టి వారు ప్రత్యేకించబడవలసి వచ్చినది. అబ్రాహాము లోతును తాను కోరుకున్న స్థలాన్ని ఎన్నుకోమని కోరాడు మరియు లోతు సొదొమను ఎన్నుకున్నాడు. కానీ, దేవుడు చూపించిన దేశానికి వెళ్ళడానికి అబ్రాహాము సిద్ధంగా ఉండెను. మరియు అదేవిధంగా దేవుడు పాలు మరియు తేనెలు ప్రవహించే భూమిని కనాను దేశమును దేవుడు అబ్రాహామునకు ఇచ్చాడు. లోతు తన కన్నులెత్తి యొర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొఱ్ఱా అను పట్టణములను నాశనము చేయకమునుపు సోయరుకు వచ్చువరకు అదంతయు యెహోవా తోటవలెను ఐగుప్తు దేశమువలెను నీళ్లు పారు దేశమైయుండెను. కానీ, సొదొమ మనుష్యులు దుష్టులును, యెహోవా దృష్టికి బహు పాపులునై యుండిరి. అక్కడి ప్రజల పాపాల కారణంగా ఆ ప్రదేశం త్వరలోనే అగ్నితో కాల్చబడినది. కాబట్టి అబ్రాహాము దేవుడు ఏర్పరచుకున్నదానిని అనుసరించినప్పుడు అతడు ఆశీర్వదించబడ్డాడు. అవును నా ప్రియులారా, దేవుడు ఇచ్చేదానిని గురించి మీరు చింతించనవసరము లేదు. ఎందుకంటే, అది నిశ్చయముగా, మరొక రూపములో ఆశీర్వాదం కలిగి ఉంటుంది. కాబట్టి, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు తప్పకుండా తిరిగి చూసి, దేవుడు మీకు ఒక రోజు ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలుపుతారు. కాబట్టి, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు అటువంటి ఉత్తమమైన దానిని పొందుకోవాలంటే, నిశ్చయముగా, అబ్రాహాము వలె మీరు ఆయనకు లోబడినట్లయితే, నిశ్చయముగా, దేవుడు మీకు ఉత్తమమైనదానిని అనుగ్రహించి మిమ్మల్ని విస్తరింపజేస్తాడు.
Prayer:
సర్వోన్నతుడవైన మా పరలోకమందున్న తండ్రీ,

నిన్ను స్తుతించుటకు మాకు సహాయము చేయుము. దేవా, నీవు మాకిచ్చిన వాగ్దానానికై నీకు వందనములు. దేవా, నీ సన్నిధితోను మరియు ఆత్మతోను మమ్మల్ని నింపుము. ప్రభువా, మేము నీ యొద్ద కోరినది పొందుకోలేకపోవుచున్నామన్న చింతను మా నుండి తొలగించుము. దేవా, నీవు మాకు ఉత్తమమైన ద దానిని అనుగ్రహిస్తావని మేము నమ్ముచున్నాము. దేవా, నీ ప్రేమ చేత మమ్మల్ని నింపుము. దేవా, నీ సంకల్పం మా జీవితంలో నెరవేరునట్లు మాకు నీ కృపను అనుగ్రహించుము. నీ నామ ఘనత నిమిత్తము మేము నీ కొరకు వాడబడునట్లు మాకు సహాయము చేయుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

For Prayer Help (24x7) - 044 45 999 000