Loading...

లోబడండి మరియు దీవింపబడండి!

Shilpa Dhinakaran
22 Jul
హలో నా ప్రియ స్నేహితులారా, నేటి వాగ్దానం ద్వితీయోపదేశకాండము 28:6 వ వచనమును బైబిల్ నుండి ఎన్నుకొనబడినది. ఈ వచనమేమనగా, " నీవు లోపలికి వచ్చునప్పుడు దీవింపబడుదువు; వెలుపలికి వెళ్లునప్పుడు దీవింపబడుదువు '' అన్న వచనము ప్రకారము నేడు ఈ సందేశము చదువుచున్న మీరు ఎక్కడ ఉన్నా, ఎక్కడికి వెళ్ళినా, మీరు ఆశీర్వదింపబడెదరని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఎందుకంటే, మీరు దేవుని బిడ్డలై యున్నారు. ప్రభువు తన పిల్లలను ఆశీర్వదించడానికి ఇష్టపడుచున్నాడు. ప్రభువు మనము సంతోషంగాను, ఆశీర్వాదంగా ఉండాలని ఇష్టపడుచున్నాడు. ఈ బైబిల్ పుస్తకం ప్రజలు యుద్ధానికి వెళ్ళే కాలంలో వ్రాయబడియున్నది. అందువలన, ఈ వచనం వారి కొరకు వ్రాయబడెను. ఎందుకంటే, వారు ఇంటి నుండి బయటికి వెళ్ళినప్పుడు మరియు వారు తిరిగి వచ్చినప్పుడు కూడా ప్రభువు వారిని ఆశీర్వదించాడు.

నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు ద్వితీయోపదేశకాం డము 28 వ అధ్యాయాన్ని చూచిన ప్పుడు, అది దేవుని ఆశీర్వాదంతో నింపబడి ఉన్నది. ఈ అధ్యాయం 2 వ వచనం ఈ ఆశీర్వాదాలను వారసత్వంగా పొందే వాగ్దానాలను గురించి మాట్లాడుతుంది. ఇది " నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన యెడల ఈ దీవెనలన్నియు నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. '' ఇది మనకు తెలుసు, మనం చేయవలసింది ప్రభువు మాట వినినప్పుడు, ప్రభువు మనలను సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు.
సాధారణంగా, పిల్లలు విధేయులుగా ఉన్నప్పుడు, వారి తల్లిదండ్రులు చాలా సంతోషంగా ఉంటారు, వారిపై వారి ప్రేమను కనుపరుస్తారు మరియు బహుమతులు కూడా ఇస్తారు. అదేవిధంగా, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు ఆయనకు విధేయత చూపినప్పుడు ప్రభువు మీ పట్ల ఎంతో ఆనందిస్తాడు మరియు ఆయన మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. ఈ రోజు, సందేశము చదువుచున్న మీరు విధేయులైన బిడ్డలుగా ఉంటారని ప్రభువునకు తెలియజేసినప్పుడు, ప్రభువు మీ పట్ల సంతోషించి మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు.
Prayer:
ఆశీర్వాదములకు కర్తవైన మా ప్రియ పరలోకపు తండ్రీ,

నేటి వాగ్దాన వచనానికై నీకు వందనములు. ప్రభువా, మేము మా జీవితాన్ని సంపూర్ణంగా నీ చేతులలోనికి సమర్పించుచున్నాము. ప్రతివిషయములోను దేవా, నీకు ఎల్లప్పుడూ లోబడి ఉండటానికి మాకు కృపను మరియు శక్తిని దయచేయుము. నీ నామమునకు మహిమ తీసుకొని వచ్చునట్లుగా మమ్మలిన మార్చుము. నేటి వాగ్దానం ప్రకారం దేవా, నీవు మమ్మును ఆశీర్వదించబోతున్నందుకై నీకు వందనాలు. ప్రభువా, నీ వాక్యము ద్వారా మాతో మాటలాడినందుకై నీకు స్తోత్రములు చెల్లించుచున్నాము. ఈనాటి నుండి మేము నీ వాక్యమును చదివి, దానిని ధ్యానించుటకు మమ్మును నీ హస్తములకు సమర్పించుకొను చున్నాము. ఆలాగుననే, మా జీవితములో అలుముకొనియున్న అంధకార సమయములలో నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడమని వేడుకొనుచున్నాము. ప్రభువా, మమ్మల్ని, ఆత్మీయంగాను, శారీరకంగాను దీవించుము. మేము బయటకు వెళ్లునప్పుడు, లోపలికి వచ్చునప్పుడు నీ యొక్క సమృద్ధికరమైన దీవెనలతో మమ్మల్ని నింపుము. మా బ్రదుకు దినములన్నియు కృపాక్షేమములే మా వెంట వచ్చునట్లు చేయుము. మా కొరతలన్నిటిని నీ దివ్య హస్తాలకు అప్పగించుకొనుచున్నాము. దయతో మా కొరతలన్నిటిని నీ యొక్క సమృద్ధికరమైన దీవెనలతో తీర్చుము. మేము అనేకులకు దీవెనకరముగా ఉండునట్లు మాకు సహాయము చేయుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

For Prayer Help (24x7) - 044 45 999 000