Loading...
Paul Dhinakaran

విధేయత మేలులను తీసుకొనివస్తుంది.

Dr. Paul Dhinakaran
28 Jun
నా ప్రశస్తమైన స్నేహితులారా, ప్రభువు ఈ దినము కొరకైన ప్రతి ఆశీర్వాదమును మీ కొరకు ఇదివరకే సిద్ధపరచి ఉంచాడు. కావున దానియందు నమ్మిక ఉంచి యేసు నామములో ఆ ఆశీర్వాదములోనికి అడుగుపెట్టండి. ఈ దిన వాగ్దానము యెషయా 1:19 నుండి తీసుకొనబడినది."  మీరు సమ్మతించి నా మాట వినినయెడల మీరు భూమి యొక్క మంచిపదార్థములను అనుభవింతురు." అని ప్రభువు చెప్పుచున్నాడు.

దేవుడు ఆదాము హవ్వలను సృష్టించి వారు నివసించుటకు ఒక తోటను కూడా ఆయన సృష్టించాడు. ఆ తోటలో చెట్లను ఆయన సృష్టించాడు మరియు చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ఫలములను కూడా ఆ చెట్లలో సృష్టించాడు అని ఆదికాండము 2:8,9 చదివినచో మీరు తెలుసుకొంటారు. "మీరు సమ్మతించి నా మాట వినినయెడల మీరు భూమి యొక్క మంచిపదార్థములను అనుభవింతురు" అని ప్రభువు వారికి చెప్పాడు. కానీ అవిధేయులైన కారణముగా ఆదాము మరియు హవ్వ ఈ ఆశీర్వాదమును కోల్పోయారు. ప్రభువుయందలి విధేయతే ఆశీర్వాదమునకు మూలము. "బలులు అర్పించుటకంటె ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుటకంటె మాట వినుటయు శ్రేష్ఠము." అని 1 సమూయేలు 15:22 లో చెప్పబడినదికదా!
విధేయత అనగా ఏమిటి? యేసు యొక్క జీవమును మనలో కలిగియుండుటయే. "యేసు సర్వశక్తుడగు దేవునికి మరణము పొందునంతగా విధేయత చూపినవాడై, తన్నుతాను తగ్గించుకొనెను." అని ఫిలిప్పీయులకు 2:6 చెప్పుచున్నది కదా! సర్వమానవాళి పాపముల క్షమాపణ నిమిత్తము సిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకొనిన కారణముగా దేవుడు తనను మరణము నుంచి లేవనెత్తి రాజులకు రాజుగా చేసెను. మనము కూడా అనుదినము లేఖనముల ద్వారా మరియు పరిశుద్ధాత్మ మూలముగా దేవుని వాక్యమును విని ఆయనకు విధేయత చూపవలసియున్నది. మనము మన జీవితములలో దేవుని వాక్యమునకు విధేయత చూపించినచో ప్రభువు మనలను ద్వితీయోపదేశకాండము28:1 లో తెలిపిన ప్రకారం "భూమిమీదనున్న సమస్త జనముల కంటే హెచ్చిస్తాడు". మనము దేవుని వాక్యమునకు విధేయత చూపించి దేవుని ముందర మరియు ప్రజల ముందర నీతిమంతమైన కార్యములు చేసిన యెడల యోహాను 14:23 లో తెలిపిన ప్రకారం సర్వశక్తుడగు తండ్రి మనలను ప్రేమిస్తాడు, సర్వశక్తుడైన దేవుడగు యేసు పరిశుద్ధాత్మ మూలముగా మనలోకి వచ్చి నివసిస్తాడు మరియు దేశములో ఉత్తమమైన మరియు ఫలభరితమైన ప్రదేశము మనకు అనుగ్రహించబడుతుంది. ఆదాము, హవ్వ ఏదేను తోటలో కోల్పోయినది మీ స్వంతమగును. ఉత్తమమైన ఆహారము మరియు ఆశీర్వాదముల సంపూర్ణ సన్నిధిని మీరు పొందుకొనెదరు. మీ జీవితములో ప్రతి ఆశీర్వాదమును మీరు సమాధానముతో పొందుకొని అనుభవించెదరు. మీ హృదయమును తెరవండి, యేసును మీ హృదయములో కలిగియుండండి, యేసు వలే జీవించండి తద్వారా మీరు ఈ లోకములోని అత్యుత్తమమైనవన్నియు కలిగియుండెదరు. దేవుడు మిమ్మును దీవించునుగాక!
Prayer:
తండ్రి దేవా,

ఈ చక్కని వాగ్దానమును బట్టి మీకు వందనములు. ప్రతి విషయములో మీకు విధేయత చూపించి, నేను చేయు ప్రతి కార్యములో కూడా మిమ్మును సంతోషపెట్టులాగున జీవించేలా నాకు సహాయము చేయుట ద్వారా నా జీవితములో మీయొక్క అత్యుత్తమమైన దీవెనలు పొందుకొనేలా నా యెడల కృప చూపండి. యేసు నామములో నేను ప్రార్థించుచున్నాను. 

ఆమెన్!

For Prayer Help (24x7) - 044 45 999 000