Loading...
Dr. Paul Dhinakaran

మీకు దేవుడు మేలు చేయడాన్ని ఎవరు ఆపలేరు!

Dr. Paul Dhinakaran
08 Dec
నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు బ్రదుకు దినములన్నియు కృపాక్షేమములే మీ వెంట వచ్చునట్లు చేస్తానని ప్రభువు మీ పట్ల వాగ్దానము చేయుచున్నాడు. కాబట్టి, ప్రభువు మీకు మేలు లేక మంచి చేయుటకు ప్రారంభించినట్లయితే, అది ఎన్నడు ఆటంకపరచబడదు. దానిని ఎవ్వరు కూడ ఆపలేరు. కాబట్టి, నేడు మీరు, మీ జీవితములో మేలులు జరగలేదని చింతించుచున్నారా? దిగులుపడకండి, మీరు ఆయన నిబంధనలను గైకొని మరియు ఆయన నీతిని అనుసరించండి, అప్పుడు సమస్త మేలులు మరియు ఆయన మందిరములో నివసించే గొప్ప ధన్యతను మీకు అనుగ్రహిస్తాడు.

ఆవిరి యంత్రములను కనిపెట్టిన ఆర్.యల్. స్టీవెన్సన్, అది పనిచేయునట్లు చేయుటకు అనేక మార్లు ప్రయత్నించాడు. ప్రతిసారీ, అది ప్రారంభించబడి నప్పుడు, అతడు తన సహోదరిని పిలిచి, " మేరీ, ఇక్కడకు రా, ఇంజన్ పని చేస్తున్నది. వచ్చి, చూడు '' అని చెప్పేవాడు. వెంటనే, అతని సహోదరి వచ్చి, " అవును, పని చేస్తున్నది, పని చేస్తున్నది '' అని సంతోషముగా కేకలు వేసేది. కానీ, ఆ ఇంజన్ ఆగిపోయినప్పుడు, వెంటనే, " అయ్యో. ఆగిపోయింది, '' అని చెప్పేది. ఒక దినము స్టీవెన్సన్ ఆ సమస్యకు పరిష్కారమును కనిపెట్టి ఆ యంత్రమును సరిచేశాడు. ఇంజన్ పని చేసినప్పుడు, " స్టీవెన్సన్ ఇంజన్ పని చేయుచున్నది, అది పని చేస్తున్నది '' అని మేరి కేకేలు వేసింది. ఆ తరువాత కొంచెం సమయం గడిచిన తరువాత, " ఇంజన్ ఆగలేదు '' అని మేరి కేకలు వేయడం ప్రారంభించినది.

అదేవిధంగా, నా ప్రియులారా, దేవుని మేలులు మీ జీవితములోనికి వచ్చుచునే ఉండును. దేవుని మేలు ఆటంకపరచబడలేదు అని మీరు చెప్పెదరు. అందుకు దేవుడు ఇలా అంటున్నాడు, " మీరు నన్ను శోధించిన యెడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి, పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చు చున్నాడు '' (మలాకీ 3:10) అన్న వచనము ప్రకారము, మీరు దేవుని శోధించినప్పుడు, ఆయన మీకు విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తాడు. మరియు " నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను; వారు నన్ను విడువకుండునట్లు వారి హృదయములలో నా యెడల భయభక్తులు పుట్టించెదను '' (యిర్మీయా 32:40) అన్న వచనము ప్రకారము, ఆయన ఇలా అంటాడు, మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను మనతో చేయుచున్నాడు, ఇక ఎన్నటికిని మనలను విడిచిపెట్టనని వాగ్దానం చేయుచున్నాడు. ఆయన ఎల్లప్పుడు మనకు మేలు చేస్తాడు. ఈ సారాంశంలో, ఆయన మీకు మేలు చేయడాన్ని ఎప్పటికి ఆపలేనని తెలియజేయుచున్నాడు. కాబట్టి, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు, ' దేవుడు నాకు మేలు చేయుటకు ఎన్నడు ఆపడు ' అని మీ హృదయంలో చెప్పుకోండి. నిశ్చయముగా, మీ ఆశ భంగము కానేరదు, నిశ్చయముగా మీకు ముందుగతి రానేవచ్చును.
నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీపై ఆయన కనికరముతో నిండినందున మీరు ఒకదాని వెంబడి ఒక ఆశీర్వాదములను పొందుకొనునట్లు చేస్తాడు. కీర్తనాకారుడైన దావీదు కూడా ఇలా అంటున్నాడు, " నేను బ్రదుకు దినములన్నియు కృపా క్షేమములే నా వెంట వచ్చును చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసెదను '' (కీర్తనలు 23:6) అన్న వచనము ప్రకారము, అవును! దేవుడు మీతో నడవడానికి మరియు ఆశీర్వాదాలు ఉన్న ప్రదేశానికి మిమ్మల్ని నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి, ఆశీర్వదించబడటానికి మీ నీతి యథార్థత మీద ఆధారపడవద్దు. బదులుగా, ఇటువంటి దేవుని కృపలో మీరు పాలిభాగస్థులుగా మారండి మరియు దేవుని యొక్క ఆటంకపరచలేని మేలులన్నిటిని మీ జీవితంలోకి స్వీకరించుటకు ఆయన ఇచ్చిన వాగ్దానాలను నమ్మినట్లయితే, నిశ్చయముగా, మీ బ్రదుకు దినములన్నియు కృపాక్షేమములే మీ వెంట వచ్చునట్లు, చిరకాలము యెహోవా మందిరములో మీరు నివాసము చేసెదరు. దేవుని దీవెనలు మరియు మేలులు నిత్యము మీ జీవితములో ఎల్లప్పుడు కుమ్మరించబడునట్లు చేస్తాడు.
Prayer:
కృపా క్షేమములు నిచ్చే మా ప్రియ పరలోకపు తండ్రీ,

మాకు సమస్త మేలులను అనుగ్రహించుటకు నీవే మూలకర్తవు. నీ కృప ద్వారానే మేము శాశ్వతమైన శిక్ష నుండి రక్షింపబడ్డాము. దేవా, మమ్మల్ని రక్షించుటకు నీ సొంత కుమారుని బలిగా ఇచ్చుటకు నీవు వెనుదీయ్యనందుకు నీకు వందనములు చెల్లించుచున్నాము. తద్వారా, ఆయనతో కూడా సమస్తాన్ని మాకు అనుగ్రహిస్తావని మేము నమ్ముచున్నాము. మేము మా నీతి మీద ఆధారపడకుండా, సమస్త మేలులు గుప్తములైయున్న నీ యందు మాత్రమే మేము నమ్మికయుంచియున్నాము. మా జీవితంలో నీ యొక్క పొంగిపొర్లుతున్న మేలులన్నిటిని మాపట్ల దయచేస్తావని మేము ఎదురు చూస్తున్నాము. మేము చేసే పనులన్నిటిలోను అభివృద్ధి చెందునట్లుగాను మరియు నీ నామాన్ని మహిమపరుచునట్లుగాను మమ్మల్ని మార్చుము. మా బ్రదుకు దినములన్నియు కృపా క్షేమములే మా వెంట వచ్చునట్లు మాకు సహాయము చేయుము. చిరకాలము నీ మందిరములో మేము నివాసము చేయునట్లుగా మమ్మల్ని మార్చుమని మా ప్రభువును ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

For Prayer Help (24x7) - 044 45 999 000