Loading...
Dr. Paul Dhinakaran

మీరు క్రీస్తు అను బండ మీద నూతన సృష్టిగా కట్టబడాలి!

Dr. Paul Dhinakaran
11 Jun
నా ప్రియులారా,నేడు ఈ సందేశము చదువుచున్న మిమ్మల్ని నూతన సృష్టిగా మార్చాలని మీ పట్ల కోరుచున్నాడు. మన జీవితమును దేవుడు మాత్రమే తన స్వాధీనములో ఉంచుకొనుటకు శక్తిమంతుడై యున్నాడు. ప్రతిరోజు మనం ఏలాంటి పరిస్థితులను ఎదుర్కోవాలో ఆయన మనకంటె ముందుగానే నిర్ణయించియున్నాడు. కానీ, మనలో ఎంతోమంది వారి జీవితాలలో ఈ విషయాలను గుర్తించరు. ప్రతిదానికి దేవుడే బాధ్యత వహిస్తాడనే జ్ఞానంతో మనం ప్రతిరోజు మన జీవితములో సమస్యలను మరియు పోరాటములను ఎదుర్కోవాలి. మనము ఇటువంటి పరిస్థితులలో ఉన్నప్పుడు మనం స్వయంగానే ఉదయం దేవుని వైపు చూచినప్పుడు ఆయన చేతులలో ఉన్న ఆశీర్వాదములను మనకు అనుగ్రహిస్తాడు. ఆ దినమునకు కావలసిన వాగ్దానములను మనము బైబిల్ ద్వారా చదవాలి లేక వినాలి. మనం ఆయనను మరియు వాక్యమును విశ్వసించినప్పుడు పచ్చికగల చోట్లను ఆయన మనలను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద మనలను నడిపిస్తాడు. మన సమస్యల నుండి బయటపడటానికి మార్గము ఇదియే. మనము ఆయన యొద్దకు వచ్చినప్పుడు కంటికి కనిపించినవి లేక కనబడని ప్రమాదాల నుండి దేవుడు మనలను రక్షిస్తాడు. మనం ఆయనలో విశ్రాంతిని పొందగలిగినప్పుడు, మనకు ఆశ్చర్యమును కలిగించుట కొరకే మనం ఎదుర్కొంటున్న సమస్యల నుండి మనకు విడుదల నిచ్చుటకు ఆయన మనకంటే ముందుగా వెళ్లుచున్నాడు. ఈలాగుననే, దేవుని సన్నిధి మన మనశ్శాంతిని మరియు సమాధానమును కాపాడుకోవడా నికి సహాయపడుతుంది. మనం ఎటువంటి క్లిష్ట పరిస్థితుల ద్వారా వెళ్ళినా అది దేవుని నుండి వచ్చినదని మనకు తెలుసు. కాబట్టి, ప్రతి దానిని మనము దేవుని హస్తాలకు సమర్పించుకొన్నప్పుడు, నిశ్చయముగా, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు.

ఎంతోకాలం క్రితం మేస్త్రీగా పనిచేసే ఒక సహోదరుడు ఉండేవాడు. ఆయన దేవునికి దూరముగా ఉండేవాడు. ఆయన సొంత ఇల్లు కట్టుకోవాలని ఆశించాడు. కానీ, అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. అతడు పొదుపు చేసిన డబ్బంతటిని చికిత్స కొరకే ఖర్చు చేశాడు. ఇకపై అతను పనిచేయకూడదని డాక్టర్లు చెప్పారు. దానితో అప్పులు పెరిగిపోయాయి. జీవితము మీద అతను నమ్మకమును కోల్పోయి, నిరుత్సాహముతో త్రాగడం ప్రారంభించాడు. అతని భార్య పనిమనిషిగా వెళ్లడం ప్రారంభించింది. మరియు కుమార్తె చదువు ఆగిపోయింది. అన్ని వైపులా పేదరికం చుట్టు ముట్టినది. నిరాశ అతనిని అనుదినము చంపేస్తుండేది. అయితే, యేసు అతని వేదనను చూచి, " నేను నిన్ను మార్చి, నీకు స్వస్థతను అనుగ్రహించెదను అని చెప్పెను. '' ఆ తరువాత అతని జీవితము పూర్తిగా మారిపోయింది. అతను త్రాగుడు మానేసి, తన హృదయమును దేవునికి సమర్పించుకొనెను. దేవుడు అతని జీవితమును మళ్లీ కట్టెను.
అవును నా ప్రియులారా, ప్రధాన మూల రాయియైన క్రీస్తు నేడు ఈ సందేశము చదువుచున్న మీ జీవితమును కూడ కడతాడు. అంతమాత్రమే కాదు, ఆయన మిమ్మల్ని చూచి, " నా కుమారుడా/ కుమార్తె, ఈ లోకము మిమ్మును తిరస్కరించిననూ, నేను మిమ్మల్ని తిరస్కరించను, దేవుని రాజ్యములో మీరు నాతో కూడ ఉందురు. నేను మీ జీవితమును కట్టి, మీతో పాటు నివసించెదను. ఈనాటే మీరు నన్ను ఆశ్రయించు అని ఆయన చెప్పుచున్నాడు. '' కనుక నిరీక్షణ కలిగినవారై దేవుని ఆశ్రయించండి. మీరు క్రీస్తు అను బండ మీద కట్టబడియున్నావు గనుక మీరు కదిలించబడరు! ఆయన మీ జీవితమును మీ కుటుంబమును మీ పరిచర్యను కట్టును గాక. ప్రియులారా, ఈ రోజు యేసును మీ జీవితములోనికి అంగీకరించి, ఆయనపై మీ జీవితాన్ని నిర్మించుకొన్నట్లయితే, దేవుడు దేని కాలమందు అది చక్కగా ఉండునట్లుగా చేస్తాడని ఈ వచనము ప్రకారము గుర్తుంచుకొనండి (ప్రసంగి 3:11). ఆయన మిమ్మల్ని వినయంగా మార్చినట్లయితే, ఆయన తగిన కాలమందు మీకు ఘనతను అనుగ్రహిస్తాడు. పరిస్థితులు మిమ్మల్ని బ్రద్ధలు చేసినట్లయితే, ఆయన మిమ్మల్ని కడతాడు. దేవుని ద్వారా మార్చలేని పరిస్థితులలో మీరు ఎన్నటికిని ఎంతమాత్రము ఉండలేరు. ఆయన కుంటివారిని నడుచునట్లుగాను మరియు గ్రుడ్డివారికి చూపునిచ్చినట్లుగాను మనము చూస్తున్నాము. ఆయన మిమ్మల్ని స్వస్థతపరచగలడు. ఆయన మీ అవసరతలను సమృద్ధిగా అనుగ్రహించుటకును మరియు కాకోలము ద్వారా ఆయన ఏలీయాకు ఆహారమును పంపించినట్లుగాను, యెజెబెలు కోపము నుండి ప్రవక్తను కాపాడినట్లుగానే, ఆయన మిమ్మల్ని కాపాడుటకు సమర్థుడై యున్నాడు. నేడు మీ పాపపు జీవితమును విడిచిపెట్టాలంటే, మీకు ఒక నూతన జీవితము ఎంతో అవసరము. కావుననే, " కాగా ఎవడైనను క్రీస్తునందున్నయెడల వాడు నూతన సృష్టి; పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయెను '' (2 కొరింథీయులకు 5:17) అన్న వచనము ప్రకారము మీ పాత జీవితమును దేవునికి ప్రీతిగా లేనట్లయితే, దానిని విడిచిపెట్టి, ఆయన యొద్దకు వచ్చినట్లయితే, ఆయన మిమ్మల్ని నూతన సృష్టిగా మార్చి, మీ జీవితములో అద్భుతములను జరిగిస్తాడు. మీరు మరోసారి అభివృద్ధి చెందుతారు. కాబట్టి, ధైర్యంగా ఉండండి.
Prayer:
ప్రేమగల మా ప్రియ పరలోకమందున్న తండ్రీ,

ఈనాడు మాతో మాటలాడిన విధానమును బట్టి నీకు స్తోత్రములు. మా జీవితములో నీవే ముఖ్యమైన మూలరాయియై యుండి, మమ్మును కట్టుచున్నందుకై నీకు స్తోత్రములు చెల్లించుచున్నాము. నీ కుమారుడైన యేసుక్రీస్తుపై మా విరిగిన జీవితమును కట్టుమని మా జీవితమును నీ చేతులకు అప్పగించుకొనుచున్నాము. మా పాపాలను క్షమించి, మమ్మల్ని నూతన సృష్టిగా మార్చుము. ఈ రోజు మరియు నీవు మా జీవితాన్ని మరోసారి కడతావన్న నీ మాటలకు కృతజ్ఞతలు తెలియజేయుచున్నాము. కష్టాల నుండి మమ్మల్ని రక్షించుము. ప్రతిరోజు నిన్ను ఆసక్తిగా వెదకడానికి దేవా, మాకు సహాయం చేయుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

For Prayer Help (24x7) - 044 45 999 000