Loading...
Paul Dhinakaran

మీ ఆశీర్వాదాలను వృద్ధిపొందించే దేవుడు!

Dr. Paul Dhinakaran
23 Feb
నా అమూల్యమైన స్నేహితులారా, ఈ రోజు దేవుడు ఈ సందేశము చదువుచున్న మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆశీర్వదించాలని మీ పట్ల కోరుచున్నాడు. ఈ రోజు వాగ్దానం వచనమేమనగా, బైబిల్ నుండి నిర్గమకాండము 23:25 వ వచనము ఎన్నుకొనబడినది. అదేమనగా, " నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నేను నీ మధ్య నుండి రోగము తొలగించెదను '' అని ఆయన సెలవిచ్చిన ప్రకారం మనం ఆయనను మాత్రమే సేవించాలని ప్రభువు మన పట్ల కోరుకుంటున్నాడు. అనేకసార్లు, ఈలోక భారాలు, సమస్యలు, బలహీనత, ఈలోక పాపాలు, అవినీతి మరియు ఈలోకంలో దుర్మార్గత ఎంతో గొప్ప భారముగా ఉన్నవి. వీటన్నిటి వలన మనం దేవుని వైపు చూడలేకపోవుచున్నాము. అయితే, బైబిలు ఇలా చెబుతోంది, మత్తయి సువార్త 6:33వ వచనమును చూచినట్లయితే, " కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును '' అన్న వచనము ప్రకారము మీరు దేవుని నీతిని రాజ్యమును వెదకినట్లయితే, నిశ్చయముగా, మీ భారాలన్నిటిని ప్రభువు మీ నుండి తొలగించి, మిమ్మల్ని ఎన్నో దీవెనలతో నేడు ఆశీర్వదిస్తాడు.

నా ప్రియులారా, దేవుని రాజ్యం అంటే ఏమిటి? లేదా? దేవుని రాజ్యం దేనిని కలిగి ఉన్నది? అది నీతి - దేవుని నీతిని కలిగి ఉన్నది. మరియు శాంతి - సమస్యలన్నిటిని అవగాహన చేసుకొని వాటిని జయించగలిగిన లోకమివ్వలేని శాంతి, ఇది యేసుప్రభువు మాత్రమే ఇవ్వగలడు. ఆనందం - పరిశుద్ధాత్మ వలన కలిగే ఆనందం, ఇది దేవునికి అసాధ్యమైనదేదియులేదని చెబుతుంది. నేడు ఈ సందేశము చదువుచున్న మీరు దేవుని బిడ్డలు కాబట్టి, ఆయన మీ కోసం అద్భుతాలు జరిగిస్తాడు మరియు పరిశుద్ధాత్మ ద్వారా మీకు ఆనందాన్ని కుమ్మరిస్తాడు. అంతమాత్రమే కాదు, ఆయన మీ ఆహారమును మీ పానమును దీవించును. ఆయన మీ మధ్య నుండి రోగమును తొలగిస్తాడు. అదియుగాక, వృద్ధిపొందించేలా, మీరు ఆయనను సేవించాలని దేవుడు మీలో కోరుకునే కారణాలు ఇవి. కాబట్టి,ఈ రోజు మీ దృష్టిని దేవుని వైపు మరల్చి, ఆయనను మీ పూర్ణ హృదయముతో వెదకండి మరియు సేవించండి.
నా ప్రియులారా, ఇంకను నేడు ఈ సందేశము చదువుచున్న మీరు ఈ భూమి మీద వృద్ధిపొందుట మాత్రమే కాదు, ఆయన మిమ్మల్ని ప్రేమించుచున్నాడు. అందుకే బైబిలేమంటుందో చూడండి, ద్వితీయోపదేశకాండము 7:13వ వచనములో చూచినట్లయితే, " ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధిచేసి, నీకిచ్చెదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశములో నీ గర్భఫలమును, నీ భూఫలమైన నీ సస్యమును, నీ ద్రాక్షారసమును, నీ నూనెను, నీ పశువుల మందలను, నీ గొర్రెల మందలను, మేకల మందలను దీవించును '' అని సెలవిచ్చుచున్నాడు. యేసు ఐదు రొట్టెలను మరియు రెండు చిన్న చేపలను ఎలా ఆశీర్వదించాడో, దానిని ఆశీర్వదించి ప్రజలకు ఎలా ఇచ్చాడో బైబిల్‌లో యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం చదువుచున్నాము. కాబట్టి, నేడు ఈ సందేశము చదువుచున్న మీ జీవితంలో ఆయన అలాగుననే ఆశీర్వదించబోవుచున్నాడు. నేడు ఈ సందేశము చదువుచున్న మీరు కొంత పొదుపు చేసుకొనియుండవచ్చును. కొంత ఆనందం, కొంత సంబంధం మాత్రమే ఉన్నదని మీరు తలంచవచ్చును. కానీ, దేవుడు దానిని ఆశీర్వదిస్తాడు మరియు విస్తరింపజేస్తాడు. నేడు,ఈ వాగ్దానం ఈ సందేశము చదువుచున్న మీ జీవితములో నెరవేరుతుంది మరియు మీకు కలిగియున్నదంతయు వృద్ధిపొందుతుంది. బైబిల్‌లో చూచినట్లయితే, సారెపతు విధవరాలి జీవితంలో ఇలాగుననే జరిగినది. చూడండి, " అందుకామె నీ దేవుడైన యెహోవా జీవముతోడు తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నా యొద్దనున్నవే గాని అప్పమొకటైన లేదని...చెప్పెను. '' కానీ, ఆమెకు కలిగియున్న దానిలో నుండి ఆమె దానిని ఆ దైవజనుడైన ఏలీయాకు ఇచ్చెను. అంతట ఆమె వెళ్లి ఏలీయా చెప్పిన మాటచొప్పున చేయగా దేవుడు ఆమె వద్ద ఉన్న తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు ప్రభువు ఆశీర్వదించి, భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువకాదు, బుడ్డిలో నూనె అయిపోకుండా, కరువు ముగిసేంత వరకు ఆమెయు ఆమె యింటి వారును అనేక దినములు భోజనము చేయుచు వచ్చిరి. దేవుడు ఆమెకు తగిన న్యాయం చేసినట్లుగానే, నేడు ఈ సందేశము చదువుచున్న మీ పట్ల కూడా ఇలాగుననే జరిగిస్తాడు.

కాబట్టి, నా ప్రియులారా, దేవుడు ఈ సందేశము చదువుచున్న మిమ్మల్ని కూడ దేవుడు ఆశీర్వదిస్తాడు.ఈ లోకము మీకు బాధల యొక్క అప్పమును ఇచ్చుటకు సిద్ధముగా ఉండవచ్చును. కానీ, దేవుడు మీకు అనేక ఆశీర్వాదాలను ఇస్తాడని మరియు అనారోగ్యాన్ని మీ నుండి తొలగిస్తాడని సెలవిచ్చుచున్నాడు. - పాపం వలన కలిగే అనారోగ్యం, ఈ లోకములో సూక్ష్మక్రిములు ద్వారా వ్యాధులు, ప్రభావాల ద్వారా ఈలోకములో వ్యాధులు లేదా ఈలోకములో దుష్ట ప్రజలచే సమస్యలు మరియు వ్యాధులు కలుగవచ్చును. అయితే, దేవుడు వ్యాధులను మీ నుండి తొలగిస్తాడని వాగ్దానం చేసినట్లుగానే, ఆయన మీ వ్యాధులను మీ నుండి తొలగిస్తాడు. కాబట్టి, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు సారెపతు విధవరాలి వలె మీకు కలిగియున్నదానిలో నుండి మీరు ప్రభువునకు ఇచ్చినప్పుడు, నిశ్చయముగా, ఆయన మీ ఆహారమును, పానీయమును మరియు మీకు కలిగియున్న కొంచెమును ఆశీర్వదించి, నేడు డాక్టర్లు స్వస్థపరచలేని వ్యాధులను ప్రభువు మీ నుండి తొలగించి, మిమ్మల్ని స్వస్థపరచి, ఈ లోకమివ్వలేని శాంతిని ఆయన మీకిచ్చి, మిమ్మల్ని సమృద్ధిగా దీవించి, వృద్ధిపొందింపజేస్తాడు.
Prayer:
కృపకు పాత్రుడవైన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ,

నీవు మాకిచ్చిన వాగ్దానమును బట్టి నీకు వందనాలు చెల్లించుచున్నాము. ప్రభువా, మా జీవితంలో ఈ వాగ్దానాన్ని నెరవేర్చుము. దేవా, నీ ప్రేమచేత మమ్మల్ని నీ యొద్దకు చేర్చుకొని,ఈ లోకము ఇవ్వలేని శాంతిని, సమృద్ధిని మాకు దయచేయుము. ప్రభువా,ఈ లోకములో మాకు తప్ప మరెవర్వు లేరు. దేవా, మమ్మల్ని నీ బిడ్డలనుగా మార్చి, ఆశీర్వదించుము. దేవా, నేటి నుండి సమృద్ధికరమైన ఆశీర్వాదాలను మాకు అనుగ్రహించుము. మాలోను మరియు మీ ప్రియులగువారి యొక్క అనారోగ్యాన్ని మా నుండి తొలగించి, మా జీవితంలో మాకు ఆనందంను దయచేయుము. దేవా,ఈ లోకములో మేము ఎవ్వరిపై నమ్మకముంచకుండా, నీ మీద మాత్రమే సంపూర్ణమైన నమ్మకాన్ని కలిగి ఉండునట్లుగా మాకు సహాయము చేయుము. ప్రభువా, మా పూర్ణ హృదయముతోను, ఆత్మతోను నిన్ను సేవించువారలనుగాను మరియు నీ నీతిని రాజ్యాన్ని మొదట వెదకువారలనుగాను మమ్మల్ని మార్చుము. దేవా, నిన్ను సేవించుట ద్వారా మా ఆహారమును మరియు పానీయమును ఆశీర్వదించి, మా మధ్య ఉన్న రోగమును నేడు తొలగించి, మమ్మల్ని సంపూర్ణంగా దీవించుమని సమస్త స్తుతి ఘనత మహిమ నీకే చెల్లించుచు యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

For Prayer Help (24x7) - 044 45 999 000