Loading...

అన్నిటికంటె అత్యధిక విజయము!

Stella Ramola
23 Jul
నా ప్రియ మిత్రులారా, ఈ రోజు రోమీయులకు 8:37 వ వచనమును గురించి ధ్యానం చేద్దాం. " మనలను ప్రేమించినవాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము.'' అవును, యేసు నేడు మిమ్మును ప్రేమించుచున్నందున ఆయన మిమ్మల్ని ఈ లోకంలో విజేతగా చేస్తాడు. ఈ రోజు, ఈ సందేశము చదువుచున్న మీరు మీ జీవితంలో గందరగోళంతో ఉంటూ, ఈ సందేశాన్ని చదువుతూ ఉండవచ్చును, మీ జీవితం ఎక్కడికి వెళుతుందో మీకు తెలియకపోవచ్చును, తరువాత ఏమి జరగబోవుచున్నదో మీకు తెలియదని మీరు భావిస్తుండవచ్చును. భవిష్యతులో మీ కోసం ఏమి తీర్మానించబడినదో అనియు మరియు మీరు ఎంతోకాలంగా బాధపడుతున్నందున మీరు చనిపోతారని మీకు అనిపించవచ్చును. మీరు అనారోగ్యాలను, అప్పులను, ఉద్యోగం లేదా చదువులలో లేదా కుటుంబంలో వైఫల్యమును ఎదుర్కొనుచుండవచ్చును. కానీ, ప్రియమైన స్నేహితులారా, దేవుడు మిమ్మల్ని ఈ ప్రపంచంలో అన్నిటిలోను అత్యధిక విజయమును అనుగ్రహిస్తానని వాగ్దానం చేయుచున్నాడు. కాబట్టి, ధైర్యంగా ఉండండి.

బైబిల్‌లో ఫిలిప్పీయులకు 4:13 ప్రకారం యేసు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి, మిమ్మల్ని బలపరిచే క్రీస్తు ద్వారా మీరు సమస్తమును చేయగలరు. మీరు చేసే ప్రతి పనిలో దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు. ఏమి చేయాలో మరియు ఎలా చేయాలో ఆయన మీకు నేర్పుతాడు. ఏమి మాట్లాడాలో ఆయన మీకు తెలియజేస్తాడు. ఆయన మీకు స్వస్థతను మరియు జ్ఞానంను అనుగ్రహిస్తాడు. మీ మీద ఆయనకున్న ప్రేమ వలన ఆయన మీకు శాంతిని దయచేస్తాడు.
కాబట్టి నా ప్రియ స్నేహితులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు ఎంతో ఉత్సాహంగా ఉండండి. మిమ్మును ప్రేమించినవాని ద్వారా మీరు వీటన్నిటిలో అత్యధిక విజయమును పొందబోవుచున్నారు. మీరు చేసే ప్రతి పనిలో మీకు విజయం కలుగుతుంది మరియు విజేత కంటే ఎక్కువగా విజయాన్ని పొందుకుంటారు. గొల్యాతుపై దావీదు ఎలా విజయం సాధించాడో బైబిల్లో మనం చూడగలం. అతడు దేవుని మీద ఆధారపడ్డాడు. ఈటెలు, కత్తులు లేదా కవచాలను ధరించలేదు లేక వాటి మీద ఆధారపడలేదు. అయినప్పటికిని, దేవుని బలం మీద ఆధారపడ్డాడు. కాబట్టి దావీదు గొల్యాతుపై విజయం సాధించాడు. అందుకే బైబిల్‌లో చూచినట్లయితే, " యుద్ధ దినమునకు గుఱ్ఱములను ఆయత్తపరచుటకద్దు గాని రక్షణ యెహోవా అధీనము '' (సామెతలు 21:31). అవును, విజయం ప్రభువు యొద్దనే ఉన్నది. మరియు 2 కొరింథీయులకు 2:14 లో ఉన్నట్లుగానే, " మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనుపరచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడు విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము '' అని చెప్పబడియున్నది. ఆయన జ్ఞానం యొక్క సువాసనను ప్రతిచోటా కనుపరచుటకు ఆయన మిమ్మల్ని ఉపయోగించుకుంటాడు. కాబట్టి, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు విజయము పొందాలంటే, మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకున్నట్లయితే, నిశ్చయముగా ఆయన అన్నిటిలో మీకు అత్యధికమైన విజయమును అనుగ్రహించి మిమ్మల్ని హెచ్చిస్తాడు.
Prayer:
ప్రేమా నమ్మకమైన మా పరమ తండ్రీ,

నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకై నీకు వందనములు చెల్లించుచున్నాము. దేవా, నీవే మా నిరీక్షణయై యున్నావు. ప్రభువా, నీవు మమ్మల్ని ప్రేమించుటయే కాకుండా, విజయానికి నడిపిస్తావన్న నీ వాగ్దానానికై నీకు వందనములు. ప్రభువా, విజయం పొందుటకు మేము నీ బలం మీద, నీ శక్తి మీద ఆధారపడుచున్నాము. మేము చేయు ప్రతిదానిలో మమ్మల్ని ఆశీర్వదించి, అత్యధిక విజయమును పొందుటకు మాకు మార్గము చూపుము. ప్రభువా, మేము ఎక్కడైతే, అవమానము మరియు ఓటమిని పొందుకున్నామో అదే స్థలములో మాకు విజయమును దయచేయుము. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనుపరచుచు నీ యందు మమ్మును ఎల్లప్పుడు విజయోత్సవముతో ఊరేగించునట్లు చేయుము. దేవా, మేము సమస్తమును మమ్మల్ని బలపరచు క్రీస్తునందు చేయుటకు సహాయము చేయమని యేసుక్రీస్తు అతి శక్తివంతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

For Prayer Help (24x7) - 044 45 999 000