Loading...
Evangeline Paul Dhinakaran

మీరు నీతికి ఫలములిచ్చే వారుగా ఉండండి!

Sis. Evangeline Paul Dhinakaran
28 Sep

నా ప్రియ స్నేహితులారా, నేడు ఒక చక్కటి వాగ్దానమును ప్రభువు ఈ సందేశము చదువుచున్న మీకు ఇవ్వబడినది. బైబిల్‌లో యోహాను 15:4వ వచనములో ప్రభువు ఇలాగున సెలవిచ్చుచున్నాడు, " నా యందు నిలిచి యుండుడి, మీ యందు నేనును నిలిచి యుందును. తీగె ద్రాక్షావల్లిలో నిలిచి యుంటేనేగాని తనంతట తానే యేలాగు ఫలింపదో, ఆలాగే నా యందు నిలిచియుంటేనే కాని మీరును ఫలింపరు '' అన్న వచనము ప్రకారము, ప్రభువు ఎల్లప్పుడూ మీతో మాట్లాడాలనియు మరియు మీతో సహవాసం చేయాలనియు మరియు ఆయన మీతో ఏకము కావాలనియు మీ పట్ల కోరుకుంటున్నాడు. అందుకే అపొస్తలుడైన పౌలు, రోమీయులకు 8:35లో ధైర్యంగా ప్రకటించాడు, " క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమయైనను బాధయైనను హింసయైనను కరవైనను వస్త్రహీనతయైనను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపునా?'' అని చెప్పినట్లుగానే, క్రీస్తు ప్రేమ అంతటి బలమైనది. కాబట్టి, ఈ లోకములో ఏదీయు మనలను దేవుని ప్రేమ నుండి వేరు చేయలేదు. కనుకనే, ధైర్యముగా ఉండండి.

బైబిల్‌లో, యేసు ప్రభువు మరియ మరియు మార్తా ఇంటికి అనేకసార్లు వెళ్ళాడని మనకు తెలుసు. మార్త ఎప్పుడు అతిథులను పరామర్శించడంలోనూ, అందరికీ భోజనాలు సిద్ధము చేయుటకు, మార్త విస్తారమైన పని పెట్టుకొనుటచేత తీరిక లేకుండా ఉండేది. కానీ, మరియ యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధవినుచు, దేవుని సన్నిధిని వెదకుచు, ఉత్తమమైనదానిని ఏర్పరచుకొనెను. అందుకే యేసు మార్తతో, " మరియ ఉత్తమమైనదానిని ఏర్పరచుకొ నెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. '' ప్రియ స్నేహితులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీ ఏకైక మార్గం యేసు మాత్రమే. అందుకే ఆయన, " నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును '' అని చెప్పిన ప్రకారం, మీరు ఆయనలో నిలిచియున్నప్పుడు, మీరు నీతి ఫలములను ఇచ్చేవారుగా ఆయనలో బహుగా ఫలిస్తారు. అన్నిటికంటే, ప్రభువు నేడు ఈ సందేశము చదువుచున్న మిమ్మల్ని అత్యధికముగా పవిత్రతోను మరియు నీతిమంతులుగా మార్చాలని నేను కోరుకుంటున్నాను మరియు ప్రార్థిస్తున్నాను.

నా ప్రియులారా, అందుకే, యేసు ప్రభువు, మిమ్మును చూచి, " నా యందు మీరును మీ యందు నా మాటలును నిలిచియుండిన యెడల మీకేది యిష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును '' (యోహాను 15:7) అని ప్రభువు తనతో సహవాసము కలిగియుండుట యొక్క ప్రాముఖ్యతను మనకు స్పష్టముగా తెలియజేయుచున్నాడు. నీతి ఫలములను భరించడానికి ప్రభువు మీకు అలాంటి జీవితాన్ని నేడు మీకు అనుగ్రహించాలని కోరుకుంటున్నాడు. అందువలన, దేవునితో మనము అతిత్వరలోనే ఏకము కాగలము. ఆయన కూడ మనతో ఏకము కాగలడు. ఒకవేళ, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు మీ శత్రువులను చూచి భయపడుచున్నారా? వారికి భయపడకండి. అందుకు బదులుగా, " దేవుడు నాతో ఉన్నాడు, నేను భయపడను '' అని నమ్మకముతో ప్రకటించండి. ఏ మానవుడు కూడ మీకు ఏమి చేయలేడు. దేవుని యొక్క దీవించే హస్తం ఈ రోజు మీ మీదికి దిగివస్తుంది. తద్వారా, మీరు ఫలములు ఇచ్చే చెట్టుగాను, నీతి ఫలములను ఇచ్చే చెట్టుగాను మార్చబడినప్పుడు, మీరు ప్రార్థనలో దేవుని ఏది అడిగినా అది మీకు అనుగ్రహింపబడుతుంది. కాబట్టి, సంతోషంగా ఉండండి! దేవుడు నేడు ఇటువంటి గొప్ప ధన్యతను మీకిచ్చి మిమ్మును దీవించును గాక.

Prayer:

కృపామయుడవైన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ,

నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు చెల్లించుచున్నాము. ప్రభువా, మేము నిన్ను మాత్రమే హత్తుకొని జీవించుటకు మాకు నీ కృపను దయచేయుము. దేవా, నీవలె మమ్మును ప్రేమించువారు ఎవరూ లేరు. నీవే మా ఏకైక నిరీక్షణ. ప్రభువా, నీ ప్రేమతో మా హృదయాన్ని నింపుము. దేవా, మేము నీతో బలమైన సహవాసమును ఏర్పరచుకొనుటకు మాకు సహాయము చేయుము. దేవా, మరియ వలె మేము ఉత్తమమైనదానిని ఎన్నుకొని నీలో నిలిచి నీతో కలిసి జీవించుటకు మాకు నీకృప నిమ్ము. ప్రభువా, అనేకులకు ఫలమిచ్చువారుగాను మరియు నీ కొరకు, నీ మహిమ కొరకు ఫలవంతమైన చెట్టుగా మరియు నీతి ఫలాలను భరించడానికి మాకు సహాయం చేయుము. యేసయ్యా, ఈ లోకములోని ఏదీయు మమ్మును మరియు మా కుటుంబమును నీ ప్రేమ నుండి వేరు చేయనివ్వకుండా, మమ్మును నీ బలమైన హస్తముతో కప్పుము. దేవా, మమ్మును విడువకుండా గట్టిగా పట్టుకొని, నీ దీవెనలతో నింపుము. పాత విషయాలన్నిటిని మరచిపోవుటకు నీ కృపనిమ్ము. దేవా, నేడు మాకు విరోధముగా, క్రియ చేయుచున్న చీకటి శక్తులన్నిటిని యేసు నామంలో నిర్మూలము చేయుము. ప్రభువా, మా పాపముల నుండి మమ్మును విడిపించుము మరియు నీ నీతితో మమ్మును నింపుము. దేవా, మేము ఇతరులను ఆశీర్వదించే పాత్రగా ఉండునట్లు చేయుటకు, నేడు మా చేయి పట్టుకొని మమ్మును ఫలవృక్షంగా మార్చుము. ప్రభువా, నీలో మా జీవితాన్ని నిర్మించి, నీలో నిలిచి ఫలించునట్లుగా మమ్మును ఉపయోగించుకొనుమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

For Prayer Help (24x7) - 044 45 999 000