Loading...
Evangeline Paul Dhinakaran

లెక్కకు మించిన ఆశ్చర్యక్రియలు!

Sis. Evangeline Paul Dhinakaran
25 Sep
నా ప్రియ స్నేహితులాలా, కీర్తన 40:5 ప్రకారం నేడు దేవుడు ఈ సందేశము చదువుచున్న మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఈ వచనం ఇలాగున చెబుతోంది: " యెహోవా నా దేవా, నీవు మా యెడల జరిగించిన ఆశ్చర్య క్రియలును మా యెడల నీకున్న తలంపులును బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పెదననుకొంటినా అవి లెక్కకు మించియున్నవి నీకు సాటియైనవాడొకడును లేడు. '' నాకు ఈ వచనం చాలా ఇష్టం. ప్రభువు నా జీవితంలో ఈలాగుననే ఎన్నో అద్భుతాలు జరిగించాడు మరియు మా జీవితంలో దేవుని కార్యాలన్నింటిని వివరించడానికి నాకు మాటలు చాలవు. నేను దానిని దేవుని సన్నిధిలో వివరించలేను. ఆలాగుననే, నేడు ఈ సందేశము చదువుచున్న మీ జీవితంలో కూడా దేవుడు ఇలాంటి అద్భుతాలు చేయాలని ప్రార్థిస్తున్నాను.

సరిగ్గా ఇదేవిధంగా ప్రభువు దావీదును ఆశీర్వదించాడు. కీర్తన 40:17 లో దావీదు ఇలా అంటున్నాడు, " నేను శ్రమలపాలై దీనుడనైతిని ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. నాకు సహాయము నీవే నా రక్షణకర్తవు నీవే. నా దేవా, ఆలస్యము చేయకుము.'' నా పెళ్లి రోజున, నా తల్లి కూడా అదే మాటలు చెప్పారు. నా జీవితంలో దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదాలను చూసి, ఆమె అక్షరాలా ఏడ్చి, ' ప్రభువా, నేను దీనురాలిని మరియు అవసరతలో ఉన్నదానను, కానీ నీవు మా గురించి చింతించుచున్నావు. నీవు నా కుమార్తెను ఎలాగున ఆశీర్వదించావో నేను చూడగలుగుచున్నాను ' అని దేవుని స్తుతించెను.
నా ప్రియ స్నేహితులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీ జీవితంలో ప్రభువు చేసే అద్భుతాలను కూడా మీరు ప్రకటించబోవుచున్నారు. మీరు ఇన్ని రోజులు ఎన్నో కార్యాల పట్ల, సంతానములేక, ఆర్థిక ఇబ్బందులు, వ్యాదుల నిమిత్తము ఏడ్చి, ప్రార్ధించి ఉండవచ్చును. కానీ, మీ జీవితంలో ఇంకా మంచి విషయాలు జరగబోవుచున్నాయి. దేవుడు నేడు ఈ సందేశము చదువుచున్న మీ గురించి తలంచుచున్నాడు మరియు వాటిని నిల్వ చేయడానికి మీకు తగినంత స్థలం లేదని మరియు కొలవలేని లెక్కకు విస్తారముగా మిమ్మల్ని ఆశీర్వదించబోవుచున్నాడు. కాబట్టి, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు దేవుని సన్నిధిలో దావీదు వలె కన్నీటితో ప్రార్థిస్తూ, ఆయన కొరకు కనిపెట్టుకొనియున్నప్పుడు, ఆయన మీ జీవితములో లెక్కకు విస్తారమైన కార్యములను జరిగించి మీ దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాడు.
Prayer:
కృపాకనికరము కలిగిన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ,

నేటి వాగ్దానాని బట్టి నీకు వందనములు చెల్లించుచున్నాము. దేవా, నీవు మా గురించి ఆలోచిస్తున్నందుకు మరియు మా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేయుచున్నందుకై నీకు వందనములు చెల్లించుచున్నాము. ప్రభువా, మేము పోగొట్టుకున్న ప్రతిదాన్ని మాకు మరల దయచేయుము. ప్రభువా, శ్ర్రమలపాలై దీనులుగా ఉన్న మాకు సహాయము చేయుము. దేవా, నీవే మా ఆశ్రయము, మా రక్షణకర్తగా ఉండి, మమ్మల్ని మరియు మా కుటుంబమును రక్షించుము. యెహోవా నా దేవా, నీవు మా యెడల జరిగించిన ఆశ్చర్యక్రియలును మా యెడల నీకున్న తలంపులును బహు విస్తారములుగా ఉండునట్లు చేసినందుకై నీకు వందనములు చెల్లించుచున్నాము. దేవా, నీ సన్నిధిలో దావీదు వలె ప్రార్థించునట్లుగా మమ్మల్ని మార్చుమని సమస్త స్తుతి ఘనత మహిమ నీకే చెల్లించుచు యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.
 

For Prayer Help (24x7) - 044 45 999 000