Loading...
DGS Dhinakaran

మిమ్మును శపించువారిని దీవించి క్రీస్తు ప్రేమను బయలుపరచండి!

Bro. D.G.S Dhinakaran
20 May
నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మిమ్మల్ని దేవుడు దీవించాలని మీ పట్ల కోరుచున్నాడు. ఏలాగనగా, క్రీస్తును అనుగ్రహించు రక్షణ ద్వారా ప్రతి విశ్వాసి నీతిమంతులై స్థిరముగా నిలిచియుండునట్లు చేస్తాడు. మన యొక్క విశ్వాసంచేత మనం ఆయన ద్వారా గుర్తించబడుచున్నాము. కానీ నీతివంతమైన జీవితాన్ని గడపడం ద్వారా దేవుని ప్రేమను ఇతరులకు ప్రతిబలింపజేయుట మన సొంత బలంతో కష్టమైన కార్యము. ఒక్కసారి ఆలోచించండి, మీ స్నేహితులు మీ లోపాలను చివరిగా ఎప్పుడు ఎత్తి చూపారు? మీ బలహీనతలలో ఇది ఒకటి. కానీ, మంచి స్నేహితుడు దీన్ని ఎన్నడును ఇలాగున చేయడు. కానీ, శత్రువులతో అలా కాదు. శత్రువు ఎల్లప్పుడు మీ క్రియలను గమనిస్తూ మిమ్మల్ని దేవునికి వ్యతిరేకంగా పాపం చేయునట్లుగా చేస్తారు. మిమ్మల్ని అతని వలలో పడేలా శత్రువు దేవుని యెదుట సవాలు చేస్తాడు. కానీ, దేవుని ప్రేమ మనలను ఎల్లప్పుడు కాపాడుతుంది మరియు రక్షిస్తుంది.
 
కొన్ని సంవత్సరాల క్రితం, ఒక యువ బోధకుడు ఉండెను. అతను ఎల్లప్పుడు అనేకమంది దైవ సేవకులను విమర్శిస్తూ ఉండేవాడు. అతను నన్ను మరియు పరిచర్యను నిందిస్తూ, ఎటువంటి కారణం లేకుండా అపనిందలు వేసేవాడు. తగిన సమయంలో, నేను దీని గురించి మరచిపోయాను. ఒకరోజు రాత్రి, నా టెలిఫోన్ మోగింది మరియు అతను ఫోన్ ద్వారా, మరొక వైపు నుండి, అతను ఎంతో, తీవ్రంగా ఏడుస్తు నాతో ఇలా అన్నాడు, " సహోదరుడా, నా ఏకైక కుమార్తె తలలో కణితి కారణంగా మరణ పడక మీద ఉన్నది. నేను ఆమెను పోగొట్టుకొనలేను. దయచేసి నాకు సహాయం చేయండి. '' నా మీద అపనిందలు వేసిన అతను ఎంతో దారుణంగా ఏడుస్తున్నాడని నేను నమ్మలేకపోయాను. ఆ సమయములో నేను ఏమి చేయాలో నాకు తెలియదు. " ఎందుకనగా, ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడియున్నది '' (రోమీయులకు 5: 5) అన్న వచనము ప్రకారం, పరిశుద్ధాత్మ తన ప్రేమను నాలో కుమ్మరించాడు. ఒక వైపు నేను అతని స్వరము విన్నప్పుడు ఎంతో కోపంగా అనిపించినది. కానీ, మరొక వైపు దేవుని ప్రేమ నాలో నుండి ప్రవహించినది. నాకు తెలియకుండా, " సోదరుడా, రేపు ఉదయం మీ కుమార్తె స్వస్థపడుతుంది, మీరు ధైర్యంగా ఉండండి '' అని చెప్పాను. వెంటనే, అతడు, నాతో, సహోదరుడా, రేపు ఉదయం ఆమె తలను ఆపరేషన్ చేయనున్నారు; అని చెప్పాడు. అందుకు, ' నేను, మళ్ళీ, రేపు ఉదయం, ఆ కణితి అక్కడ ఉండదు ' అని అన్నాను. అతను నన్ను మళ్ళీ సంప్రదిస్తానని చెప్పి ఫోన్ పెట్టెను. ఈ మాటలు ఒకవేళ నా శరీరము ద్వారా నేను అలా చెప్పానని తలంచినప్పటి నుండి గొప్ప భయం నాలో నింపబడినది. రాత్రంతా, నేను దేవునికి మొర్రపెడుతూ, ' తండ్రీ, నన్ను క్షమించుమని, నేను ఈ వ్యక్తిపై నిజంగా కోపంగా ఉన్నాను, కాని ఈ చిన్న అమ్మాయి పరిస్థితిని బట్టి నేను కదిలించబడ్డాను. దయచేసి నన్ను క్షమించు; ఆమెపై దయ చూపించుమని ' ప్రార్థించాను. ఆ ప్రార్థనకు ప్రభువైన యేసుక్రీస్తు ఆ అమ్మాయి పట్ల కనికరముతో చలించిపోయాడు. మరుసటి రోజు ఉదయం డాక్టరులు శస్త్ర చికిత్సకు ముందు ఆమెను పరీక్షించినప్పుడు, ఆమె తలలో కణితి యొక్క జాడ కనిపించలేదు అని చెప్పారు. ప్రభువు ఆమెను రక్షించి ఆమెను సజీవంగా లేపాడు. దేవునికే మహిమ కలుగును గాక.
నా ప్రియులారా, ఈ క్రైస్తవ జీవిత ప్రయాణంలో ప్రయాణించే గొప్ప ఆయుధాలలో దైవికమైన ప్రేమ ఒకటి. ఆ శాశ్వతమైన ప్రేమ యేసుక్రీస్తు యొక్క దైవీక జీవితం నుండి ప్రవహించినది. మరియు ఈ ప్రేమ ప్రతి విశ్వాసి జీవితం ద్వారా బయలుపరచబడుతుంది. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా క్రీస్తు ప్రేమించినట్లు మనం ఇతరులను ప్రేమించగలుగుతాము. ఆ విధంగా, " మిమ్మును శపించువారిని దీవించుడి, మిమ్మును బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి '' (లూకా సువార్త 6:28) అన్న వచనము ప్రకారము ఆయన ప్రేమ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి, నేడు ఈ సందేశము చదువుచున్న మిమ్మల్ని కూడ అనేక మంది నిందించి యుండవచ్చును, హింసించి మరియు బాధించి యుండవచ్చును. మీకు విరోధముగా క్రియలు జరిగించవచ్చును. కానీ, నేడు మీకు విరోధముగా మాట్లాడు వారిని, మీ శత్రువులను మీరు శపించకుండా, వారిని దీవించండి, అంతమాత్రమే కాదు, దేవుని ప్రేమను మీరు పొందుకొనుటకు ఆయన సన్నిధిలో వారి కొరకు ప్రార్థించినట్లయితే, నిశ్చయముగా, అప్పుడు దేవుడు మీలో తన ప్రేమను కుమ్మరించి, ఇతరుల పట్ల కనికరముతో చలించి, మీ ద్వారా వారి పట్ల అద్భుతములను జరిగించి, ఇతరులకు ఆశీర్వాదకరముగా మిమ్మల్ని మార్చి, క్రీస్తు ప్రేమను మీ ద్వారా అనేకులకు ప్రతిబలింపజేస్తాడు.
Prayer:
సర్వోన్నతుడవైన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ,

ప్రేమలేని ఈ లోకములో మాలో ఉన్న ప్రేమ కొన్నిసార్లు కఠినమైనదిగాను మరియు కొన్నిసార్లు మృదువైనది ఉంటుంది. కానీ, క్రీస్తు తన శాశ్వతమైన ప్రేమను ఇతరులకు, ఆయన మహిమకు కుమ్మరించుట కొరకు మేము ఈలోకములో జీవించాలని ప్రార్థిస్తున్నాము. యేసు క్రీస్తు సిలువపై వ్రేలాడుదీసిన వారిని ప్రేమించినట్లుగా, దేవా, ఈనాడు మా శత్రువులను ప్రేమించే కృపను మాకు దయచేయుము. తండ్రి వీరిని క్షమించు, వీరు ఏమి చే యుచున్నారో వీరికి తెలియదు అని చెప్పడానికి మాకు అటువంటి ప్రేమ గల హృదయాన్ని మాకు దయచేయుము. నేడు నీ యొక్క షరతులేని ప్రేమ ద్వారా ఇతరుల పట్ల నీ ప్రేమను కనుపరచుటకు మాకు సహాయము చేయుము. దేవా, మమ్మల్ని శపించేవారిని మేము దీవించునట్లుగాను మరియు మమ్మల్ని బాధించువారి నిమిత్తము ప్రార్థించునట్లు మాకు సహాయము చేయుమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

For Prayer Help (24x7) - 044 45 999 000